కోడంగల్ బరిలో కాంగ్రేస్ కోదమసింహం
కోడంగల్ నుండి పోటీ చేస్తానని ప్రకటించిన. రేవంత్

– కొడంగల్ బరిలో కాంగ్రేసు కోదమ సింహం.. సోంత గడ్డ నుండి ఎన్నికల యుద్దానికి సై అంటున్నా రేవంత్ . ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నా టీపీసీసీ అదినేత … రేవంత్ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నా ఎమ్మెల్యే..కోడంగల్ దంగల్ లో గెలిచేది?ఒడేదేవరు?కోడంగల్ ఎన్నికల యుద్దం పై ప్రత్యేక కథనం
-ఉమ్మడిపాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రెండు జిల్లాలో పరిధిలోకి వెళ్లింది.కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉండగా మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి.ఇక్కడ మొత్తం 2లక్షల 16 వేల 112 మంది ఉండగా అందులో పురుషులు లక్షా ఏడు వేల 788 మంది స్త్రీలు లక్షా 8 వేల 317 మంది ఉన్నారు.ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్‌పై పడింది.రేవంత్‌రెడ్డి 2009,2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.తర్వాత ఆయన కాంగ్రేస్ పార్టీలో చేరారు.2018 ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.తర్వాత మల్కాజిగిరి ఎంపీగాపోటీ చేసి గెలిచారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశారు.అధికార బీఆర్‌ఎస్‌తో నిత్యం కొట్లాడి పనుల విషయంలోరాజీలేకుండా పోరాడారు.అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆయన్ను టార్గెట్ చేసి ఓడించారు.కేటీఆర్,హరీష్‌రావు ఇద్దరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్ది పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించారు.ఓడిపోయినా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తన సోదురుడు, అవసరమైనప్పుడు ఆయనే వచ్చి నిర్వహిస్తున్నారు.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను ఆపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ ప్రజల్లో కూడ ఆయనపై ప్రస్తుతం మంచి అభిప్రాయంతోనే ఉన్నారు.ఇంకోవైపుఅధికార బీఆర్‌ఎస్ పార్టీలోని వర్గవిభేదాలు సైతం ఈసారి రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది.తనకు రాజకీయంగా మొదటి నుంచి వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ నేత గుర్నాథ్‌రెడ్డిలు ఇటీవల కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది.కొడంగల్‌లో కాంగ్రేస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్‌రెడ్డికి 2014లో కాంగ్రేస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీఆర్ఎస్‌లో చేరి పోటీ చేశారు.కాని ఓటమి చెందారు.2018లో టీఆర్ఎస్ ఆయనకు మొండిచెయ్యి చూపారు.అయినా పార్టీ అభ్యర్ది విజయం కోసం పనిచేశారు.నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది.డీసీసీబీ చైర్మన్ పదవి కూడ దక్కకపోవటంతో సింగల్‌విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకుదూరంగా ఉంటున్నారు.గుర్నాథ్‌రెడ్డితో రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.తిరిగి ఆయన సొంతగూటికి వచ్చారు.. దాంతో కాంగ్రెస్ కి బలం పెరిగింది.
తనకు ఎలాగో వయసు మీదపడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై భరోసా కావాలని అడిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.త్వరలో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్ణయించారు.అందులోతన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానని చెప్పారు గురునాథ్ రెడ్డి.గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది తప్పా తర్వాత ఏం జరగలేదని రేవంత్‌రెడ్డిఆరోపిస్తున్నారు.ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత,తాను గతంలో చేసిన అభివృద్ది గెలిపిస్తాయని రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు.
అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డికి చాలా మంది ముఖ్యనేతలను పట్టించుకోవటం లేదని వారంతా ఆయనకు,పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్పా కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు.ఇప్పటికీ బొంరాసిపేట,దౌల్తాబాద్ మండలాల్లో ఇంటర్‌మీడియట్ కళాశాలలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నియోజకవర్గంలో ఒక్క డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కూడ నిరుపేదలకు అందివ్వలేదు.కోస్గి 50 పడకల ఆస్పత్రి ఇంకా పూర్తి కాలేదు.ఇసుక అక్రమ రవాణ,మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక్కడి రైతులకు సాగునీరందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఇప్పటికే గురునాథ్ పార్టీకి దూరమయ్యారు.అది పార్టీకి .మైనస్‌గా మారుంది.కేవలం ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు
పార్టీలో గ్రూపురాజకీయలు,అంతర్గత కుమ్ములాటలు సైతం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనేప్రచారం కొనసాగుతుంది.మొత్తంగా ఈసారి బీఆర్‌ఎస్‌కు ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్ధితులే కనిపిస్తున్నాయి.ఇక బీజేపీ పరిస్ధితి అధ్వాన్నంగా ఉంది.గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడ దక్కలేదు.ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవారు కరువయ్యారు.ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్ధితి లేదు.దీంతో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రేస్‌గా సాగనుంది.మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి