గిరిజనుల త్రాగు నీళ్లను అడ్డుకున్నా అటవీ అదికారులు

రిజర్వ్ పారేస్ట్ పేరుతొ త్రాగునీళ్లను అడ్డుకున్నా అదికారులు

.. సాగు వద్దంటున్నారు. బుక్కేడు బువ్వ పెట్టే పోడుభూముల్లో అడుగు పెట్ట వద్దంటున్నారు.. దుక్కి దున్నితే కేసులు పెడుతామంటున్నారు.. కరెంట్ ను అడ్డుకుంటున్నారు..‌ కాంతులను దూరం చేస్తున్నారు… నీళ్లను‌ అడ్డుకుంటున్నారు…నిదులను రాకుండా చేస్తున్నారు అటవీ అధికారులు.. అటవీ అదికారుల‌ అంక్షల పై అదివాసీలు తిరగబడుతున్నారు.. దర్మ పోరాటానికి‌ జంగ్ ‌సైరన్ మ్రోగిస్తున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీ బిడ్డల ధర్మపోరాటం పై ప్రత్యేక. కథనం

. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ధర్మాజీపేట గూడేం. ఉంది.. ఈ గూడేం లో ముప్పై కుటుంబాలు ‌ఉన్నాయి… రెండు వందల జనాభా ఉంది..‌ వీరంతా మూడు‌‌న్నర దశాబ్దకాలంగా గూడేం లో‌ అవాసాలు ఏర్పాటు చేసుకోని జీవనం సాగిస్తున్నారు..

.‌ ఎళ్లుగా పోడుభూములు సాగు చేసుకోని పొట్ట నింపుకుంటున్నారు అదివాసీ బిడ్డలు.. ఇది రిజర్వ్ పారేస్ట్ ప్రాంతం ఉన్నా గూడేం.. కనీసం వసతులు లేవు.. ఆ వసతులు లేక. గిరిజన బిడ్డలు పడే కష్టాలు అన్ని ఇన్నికావు.. పోడు భూములకు పట్టాలు లేవు.. సాగు చేసుకుంటున్నా భూములను ట్రాక్టర్లతో దున్నితే కేసులు నమోదు చేస్తున్నారని అదివాసీలు అందోళన వ్యక్తం‌చేస్తున్నారు

..‌అదేవిదంగా అదివాసీ బిడ్డలకు విద్యుత్ సరపరా చేయడానికి ఐటిడిఎ అదికారులు ఏర్పాట్లు చేశారు..‌కాని అటవీ అదికారులు అడ్డుకోవడంతో విద్యుత్ సరపరా నిలిచిపోయింది. విద్యుత్ సరపరా లేక చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నామని గిరిజనులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. విద్యుత్ సరపరా చేయడానికి ప్రత్యామ్నయంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు..‌కాని సోలార్ విద్యుత్ కు అవసరమైన ఏండ లేక సరిగా పనిచేయడంలేదంటున్నారు..దాంతో చీకట్లో పాముల , తెళ్ల. మద్య ‌కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు అదివాసీలు.. అదేవిధంగా త్రాగునీరు అందించడానికి బోరు ఉంది…ఆ బోరు కు కూడ సోలార్ విద్యుత్ తోని పనిచేస్తుంది.. కాని సోలార్ విద్యుత్ కు అవసరమైన. ఎండ లేక పనిచేయడంలేదు.. బోరు సరిగా పనిచేయక త్రాగునీరు దోరకడంలేదని గిరిజనులు దాహంతో అలమటిస్తున్నామని వాపోతున్నారు. బోరునీరు రాదు… అటవీ అదికారులు అడ్డుకోవడంతో మిషన్ భగీరథ నీటిని త్రాగుదామంటే అదికూడ లేదు‌‌‌ .. అటవీ అదికారులు మిషన్ భగీరథ నీరు అడ్డుకున్నారని…మంజూరైనా వాటర్ ట్యాంకును అటవీ అదికారులు‌ నిర్మించకుండా అడ్డుకున్నారని చర్యలు చేపట్టారని గిరిజనపటేల్ బీమ్ రావు అవేదన వ్యక్తం చేస్తున్నారు

. మారుమూల. ప్రాంతమైనా గూడాన్ని అభివృద్ధి చేయడానికి ఐటిడిఎ అదికారులు దత్తత తీసుకున్నారు‌. గూడేంలో పేదలందరికి ఇండ్లను నిర్మిస్తామన్నారు..ముప్పై ఇండ్లను నిర్మించడానికి నిదులు కూడ మంజూరు చేశారు..కాని అటవీ అదికారులు ఇండ్ల నిర్మాణం అడ్డుకోవడంతో పక్క ఇండ్లు నిర్మాణం అగిపోయిందని గిరిజనులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. అదేవిధంగా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అడ్డుకుంటున్నారని అటవీ అదికారుల తీరు పై యువకుడు సాయికిరణ్ మండిపడుతున్నారు.. వెంటనే సర్కారు తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.