నిర్మల్ లో నిప్పురాజేస్తున్నామాస్టర్ ప్లాన్
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతుల అందోళన

.అది పేదల భూముల మింగే మాస్టర్ ప్లాన్… ఆ ప్లాన్ తోనే పేదల భూములలో రహదారులు నిర్మిస్తామంటున్నారు.. ఆ రహదారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు ధరలకు రేక్కలు రానున్నాయి…పేదలకు కన్నీళ్లు…. రియల్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే మాస్టర్ ప్లాన్ పై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు మున్సిపల్ అదికారుల పై రణానికి సిద్దమవుతున్నారు…నిర్మల్ మున్సిపాలీటీలో అగ్గిరాజేస్తున్నా మాస్టర్ ప్లాన్ మంటల పై ప్రత్యేక కథనం
. నిర్మల్ పట్టణం లో మాస్టర్ ప్లాన్ వివాదస్పంగా మారింది.. పట్టణంలో జనాభా రోజురోజుకు బారీగా పెరుగుతోంది…పెరుగుతున్నా జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ ను రూపోందించింది….మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రైతులకు దడపుట్టిస్తోంది… ప్రదానంగా రెడ్డిపంక్షన్ హల్ నుండి కలెక్టరెట్ కలుపుతూ.. మాస్టర్ ప్లాన్ బాగంగా బంగల్ , విశ్వనాథ్ మీదుగా పాత నలబై నాలుగు జాతీయ రహదారి వరకు ఒక రహదారి నిర్మిస్తున్నారు… వందపీట్లతో రహదారిని నిర్మించడానికి మున్సిపల్ అదికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు..
… రహదారి రాకాసిగా మారుతుందని బంగల్ పేట, విశ్వనాథ్ పేట. రైతులు అందోళన చెందుతున్నారు.. ప్రతిపాదనలు సిద్దం చేసిన రింగు రోడ్డువల్ల చిన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రదానంగా రెండు గంటలు, ఐదుగుంటలు, పది , పదిహేను గుంటల భూములున్నా రైతులు వందకు పైగా ఉన్నారు..రహదారితో పూర్తిగా భూములను కోల్పోతారు.. రోడ్డున పడుతామని అందోళన చెందుతున్నారు…
తమ. భూముల గుండా వెళ్లే రహదారి ని ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు… అందులో బాగంగా నిర్మల్ మున్సిపాలీటీ కార్యాలయం ముందు రైతులు అందోళనచేపట్టారు… వెంటనే తమభూములగుండా నిర్మించే రహదారి ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
.. ఇప్పటికే బంగల్ పెట. చెరువు కట్టపై ఒకదారి ఉంది… ఒకవేళ. దారిని విస్తరించాలంటే ఆదారిని విస్తరించాలని కోరుతున్నారు రైతులు… కాని దారిని విస్తరించకుండా.. కావాలనే చిన్న రైతుల లూటీ చేయడానికి ఈ ప్రతిపాదన తేరపైకి తెచ్చారని రైతులు అదికారుల తీరు పైమండిపడుతున్నారు… తమభూములలో రహదారులు నిర్మించి రియల్ మాపియాకు లాభం చెకూర్చడానికి అదికారులు ఎత్తుగడలు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు.. ప్రాణాలు పోయినా పర్వాలేదు…రహదారిని నిర్మించకుండా అడ్డుకోని తీరుతామంటున్నారు రైతులు
నిర్మల్ మాస్టర్ ప్లాన్ మాదిరిగా… కుమ్రంబీమ్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలీటీలో మాస్టర్ ప్లాన్ అమలు బాగంగా అమలు చేస్తున్నా రోడ్ల విస్తరణ పనులు విచత్రంగా సాగుతున్నాయి…నిరుపేదల. ఇండ్లున్నా విస్తరణ పనులు చెస్తున్నారని దనికులు భవనాలు ఉన్నా వైపు విస్తరణ. చేపట్టడం లేదని బాదితులు అందోళనవ్యక్తం చేస్తున్నారు.. మాస్టర్ ప్లాన్ తో కక్షపూరితంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నా అదికారుల తీరు పై మండి పడుతున్నారు…. అందరికి ఒకేవిదంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు