బద్దశత్రువులైనా ఎంపి సోయం, ఎలేటి ఎకం అవుతారా?

పార్టీ కోసం కలిసి పనిచేస్తారా?

. వాళ్లిద్దరు ఒకప్పుడు బద్ద శత్రువులు…. ఆ బద్ద శత్రులిద్దరు కమలం గూటికి చేరారు… ఆ ఇద్దరే ఎంపి సోయంబాపురావు, ‌ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి..ఒకప్పుడు కాంగ్రెస్ లో ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకున్నా నాయకులు కలిసి పని చేస్తారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమలానికి కంచుకోటను నిర్మిస్తారా? పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారా? కమలం పార్టీలో అసక్తి రేపుతున్నా ఎంపి సోయంబాపురావు,మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి కలయిక పై ప్రత్యేక కథనం

. అదిలాబాద్ ఎంపి సోయంబాపురావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు… 2018ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ తరపున నిర్మల్ నుండి మహేశ్వర్ రెడ్డి , బోథ్ నుండి సోయంబాపురావు ఎమ్మెల్యేగా గా పోటీ చేశారు… వీరిద్దరు ఆ ఎన్నికలలో ఓటమి ‌పాలయ్యారు.

. అసెంబ్లీ ఎన్నికలలో తర్వాత ఎంపి సోయంబాపురావు కాంగ్రెస్ నుండి బిజెపి లో చేరారు.. ఎంపిగా పోటీ చేశారు..‌..అదివాసీల అండతో సోయంబాపురావు విజయం సాదించారు… గోండుల ఖిల్లా పై కమలం జెండా ఎగురవేశారు. ఎంపి సోయంబాపురావు.. ఈ విజయంతో కమలం పార్టీ రికార్డులను బద్దలను చేశారు… ఆ విజయంతో పార్టీ రోజురోజుకు బలపడుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో ,దేశంలో బిజెపి ఊపు కోనసాగుతోంది.. బలమైన పార్టీగా బావించి పార్టీలో బారీగా చేరుతున్నారు.

. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాల్వాయి హరీష్, మాజీ ఎంపి రాథోడ్ రమేష్ బిజెపిలో చేరారు.. తాజాగా కాంగ్రెస్ ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా వేశారు బిజెపి అద్యక్షుడు .నడ్డా సమక్షంలో ‌ బిజెపిలో చేరారు.

.అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో సోయంబాపురావుకు, మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి తీవ్రమైన విబేదాలు ఉండేవట… అలాంటి ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో కోనసాగుతున్నారు.. కలిసి పని చేయడానికి సిద్దమవుతున్నారు.. ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్న సమయంలో బద్దశత్రువులుగా ఉండేవారట.. ప్రత్యర్థి పార్టీని మరిపించే వైరం ఉండేదని జిల్లా లో ప్రచారం ఉంది . ప్రదానంగా 2018. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోయం, మహేశ్వర్ రెడ్డి మద్య. విభేదాలు తారస్థాయికి చేరాయట‌… అప్పట్లో ఎంపి సోయంబాపురావు బోథ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.. అదేవిధంగా బిఅర్ ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ పోటీ చేశారు.. ఈ ఎన్నికలలో బిఅర్ ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 61,125 ఓట్లు సాదించారు. అదేవిధంగా సోయంబాపురావు 54,639ఓట్లు సాదించారు.. సోయం పై రాథోడ్ బాపురావు కేవలం 6,486 ఓట్లతో విజయం సాదించారు…అదే కాంగ్రెస్ తిరుగుబాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ జాదవ్ కు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు ఓట్లు సాదించారు …తిరుగుబాటు అభ్యర్థి దెబ్బకు సోయం ఓటమి‌ పాలయ్యారని పార్టీలో చర్చ ఉందట..

… అయితే అనిల్ జాదవ్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయడానికి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రోత్సహం ఉందట ..మహేశ్వర్ రెడ్డి అండదండలతో‌‌ అనిల్ జాదవ్ పోటీ చేశారని ప్రచారం ఉంది… అనిల్ జాదవ్ అభ్యర్థిగా పోటీయే సోయం‌,ఎలేటి ‌మహేశ్వర్ రెడ్డి విబేదాలు పెంచిందట.. మహేశ్వర్ రెడ్డి ,సోయం మద్య మనస్పర్ధలు రావడానికి కారణమైందట…అలాంటి ప్రత్యర్థి పగలు ఉన్నా ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉన్నారు..‌..ఈ ఇద్దరు నాయకులు ఎలా కలిసి పనిచేస్తారని ప్రచారం ఉంది.. అనుమానాలు కలగడానికి కారణాలు ఉన్నాయట… మహేశ్వర్ రెడ్డి డిల్లీలో చేరిక సందర్భంగా సోయం హజరుకాలేదు… అందుకే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. అదివాసీలలో బలమైనా నాయకుడు సోయం,బోథ్, ఖానాపూర్, అసిపాబాద్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా ఉందట. అదేవిధంగా నిర్మల్ , ముథోల్, ఖానాపూర్ లో ప్రబావం చూపించే సత్తా ఉన్నా నాయకుడు ఎలేటి… బలమైన ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తారా లేదా అనేది కమలం పార్టీలో ఉత్కంఠ. రేపుతోందట… పార్టీవర్గాలు మాత్రం.. వాళ్ల మద్య విబేదాలు లేవని కోట్టిపారేస్తున్నారట.. ఇద్దరు.కలిసి పనిచేస్తారని‌ పార్లమెంటు పరిదిలో ‌మొత్తం ఏడు సీట్లలో విజయం సాదిస్తామని దీమాను వ్యక్తం చేస్తున్నారట…

Leave A Reply

Your email address will not be published.