ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసక్తిరేపుతున్నా ఎన్నికల యుద్దం
విస్త్రుతంగా ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నా బిఅర్ ఎస్ , బిజెపి, కాంగ్రేస్

.
ఆదిలాబాద్
ఆ. నియోజకవర్గం బిఅర్ ఎస్ కంచుకోట…. ఆ కంచుకోట నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయంసాదించారు ఎమ్మెల్యే జోగురామన్న,… జైత్రయాత్రను కోనసాగిస్తున్నారు.. ఆ కంచుకోటను. బద్దలు చేయాలని ఎత్తుగడలు వేస్తోంది… కారు కోటపై పాగావేసేందుకు వ్యూహలు రచిస్తోంది కమల దళం.. కమలం ఎత్తుగడలు పలిస్తాయా? బిజెపి టిక్కెట్ పోరు ఎమ్మెల్యే రామన్నకు అనుకూలంగా మారుతుందా? విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా..?మళ్లీ ఆదిలాబాద్ గడ్డ పై కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందా? బిజెపి అసంత్రుప్తి నాయకులు కాంగ్రేస్ అభ్యర్థి గా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారా?ఆదిలాబాద్ నియోజకవర్గం లో మారుతున్నా రాజకీయ సమీకరణాల పై ప్రత్యేకకథనం
.. తెలంగాణ లో ఎన్నికల నోటిపికేషన్ రాలేదు.. ఆదిలాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఎన్నికల యుద్దంమొదలైంది.. పార్టీలు ఎన్నికలలో విజయం సాధించడానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి బిఅర్ ఎస్,బిజెపి, కాంగ్రెస్ పార్టీలు… అయితే నియోజకవర్గం లో..ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్, బేల మండలాలున్నాయి..వీటిలో కోత్త. ఓటరు జాబితా ప్రకారం రెండు లక్షల. పంథోమ్మిది వేల ముప్పై నాలుగు ఓటర్లు ఉన్నారు..
ఎమ్మెల్యే జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా దీపాయిగూడ. సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు…సర్పంచ్ గా జైనథ్ ఎంపిపిగా , జడ్పీటీసీగా , ఆదిలాబాద్ నియోజకవర్గం నుండినాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎమ్మెల్యే జోగురామన్న రికార్టును స్రుష్టించారు…2009,2012,2014,2018 ఎన్నికలలో విజయం సాధించారు..ప్రదానంగా 2014ఎన్నికలలో 14,711 ఓట్ల మేజారీటీతో, 2018 26,606 ఓట్ల మెజారిటీతో జోగురామన్న. బిజెపి అభ్యర్థి పాయల్ శంకర్ పై ఎమ్మెల్యేగా విజయం సాదించారు…మళ్లీ అదేవిధంగా ఐదవసారి ఎమ్మెల్యేగా విజయంసాదించాలని గ్రామాలను చుట్టేస్తున్నారు ఎమ్మెల్యే రామన్న
..బిఅర్ ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే… మొదటి సారి ప్రభుత్వంలో రామన్న మంత్రిగా పనిచేశారు.. రెండోసారి మంత్రి పదవిదక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.. కాని రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.. రెండోసారి మంత్రి వర్గంలో స్థానం లబించకపోవడంతో అసంత్రుప్తికి గురయ్యారు…కాని ముచ్చటగా మూడోసారి ఎర్పడబోయే ప్రభుత్వం లో మంత్రి కావాలని కలలుకంటున్నారు..అందులో బాగంగా ఈసారి 2023లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.. అయితేనియోజకవర్గం లో మున్నూరు కాపు సామాజిక ఓటర్లు మెజారిటీఓట్లు ఉన్నాయి..ఈసామాజిక. ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి… అదే సామాజిక వర్గానికి చెందిన రామన్నకు సోంత. సామాజిక వర్గం అండగా నిలుస్తున్నారు… గంపగుత్తగా ఓట్లువేస్తున్నారు… దాంతో విజయ యాత్రను కొనసాగిస్తున్నారు…మున్నూర్ కాపు ఓట్ల తర్వాత. ముస్లిం ఓట్లుఉన్నాయి. ..ఈ ఓట్లు రాబోయే ఎన్నో తనకు దన్నుగా నిలుస్తాయాని రామన్న అంచనాలు వేసుకుంటున్నారట.
దీనికితోడు సర్కారు నియోజక వర్గంలో అభివృద్ధి పథకాలతో నియోజకవర్గం రూపురేఖలు మార్చారు రామన్న…ఆదిలాబాద్ పట్టణం సుందరీకరణ, అదివాసీ గూడాల. రోడ్ల. సౌకర్యం కల్పించారు.. అదేవిధంగా చెనాక, కోరాట. బ్యారేజి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.. రేపుమాపో రైతులకు అందించేవకాశం ఉంది…వీటితో మైనారీటీ, బీసీ, ఎస్టీ డిగ్రీ కళశాలలు ఏర్పాటు చేశారు.. ఆదిలాబాద్ అర్ ఓబికి నిదులు మంజూరు చేయించారు. ఇలాంటి పథకాలతో ఐదోసారి గెలుపును ఎవరు అపలేరని బావిస్తున్నారట..
.. కాని కొన్ని అభివృద్ధి పథకాలు పూర్తి కాలేదు.. చెనాక కోరాట.పనులు చివరి దశకు చెరుకున్నాయి.. ఎత్తి పోతల పథకంం నీరుఅందించాలంటే లిప్ట్ లో సమస్యలు వస్తున్నాయి.. దాంతో ఎప్పుడు నీరు అందిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి… అదేవిధంగా జిల్లా కేంద్రం లో పెద్ద అర్ ఓబి..అర్ ఓబి లేక. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు…ముప్పైశాతం ప్రజలు అర్ ఓబి లేక ఇబ్బందులు పడుతున్నారు..దీనికి నిదులు మంజూరు చేయించారు.కానిఆర్ ఓ బి పనులు ప్రారంభం కాలేదు.. ఇది రామన్నకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా బిఅర్ ఎస్ నాయకులు కబ్జాలు చేయడం రామన్నకు చెడ్డపెరు తెచ్చిందట… రామన్న పై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందనే ప్రచారం ఉంది… అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్. పరిశ్రమ ఉంది. కేంద్రప్రభుత్వం నిర్వహించే పరిశ్రమ మూతపడి ఎళ్లైంది.. ఈ పరిశ్రమను తెరిపిస్తామని రామన్న ఎన్నికల హమీ ఇచ్చారు… అయితే పరిశ్రమను పున ప్రారంబిండానికి అనేక ప్రయత్నాలు చేశారు… రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాయితీలు ఇస్తామని అప్పటి పరిశ్రమల మంత్రికి లేఖలు అందించారు.. కాని ప్రారంభించడానికి కేంద్రం సిద్దంగా లేదు.. రాష్ట్ర జనన ప్రభుత్వం పరిశ్రమ పున ప్రారంభానికి రాయితీలు ఇస్తామని ప్రకటించినా…లేఖలు రాసిన కేంద్రం పట్టించుకోవడం లేదట… ఈ పరిశ్రమను పునప్రారంభించాలని కేంద్రం పై ఒత్తిడి తీసుకరావడానికి రామన్న. అద్వర్యంలో ఉద్యమం నిర్వహించారు.అందులో బాగంగా దర్నాలు, రాస్తారోకోలు , జాతీయ రహదారులు దిగ్బందం చేశారు…కాని కేంద్రం స్పందించలేదు. అదేవిధంగా ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం అడుగు కదలడంలేదు… నిర్మాణం కోసం భూములు ఉన్నా కేంద్రమే పట్టించుకోవడం లేదని రామన్న. బిజెపి నాయకుల పై కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు సందిస్తున్నారు
. వీటికి తోడు బిఅర్ ఎస్ లోఅసంత్రుప్తి ఉంది… పార్టీలో రెడ్డి సామాజిక వర్గనాయకులు రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట.. ప్రదానంగా మాజీ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకభూమరెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ మనిషా పవన్ రావు ఉన్నారు… రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం విశేషం వీరు తమకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట…. ఈ. అసంతృప్తి నాయకులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఏకం చేస్తున్నారట.. రామన్నకు టిక్కేట్ దక్కకుండా ఎత్తగడలు వేస్తున్నారట.. అయితే బలమైనా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రామన్న… దాంతో టిక్కెట్ ఆరునూరైనా తనదేనని దీమాతోఉన్నారట రామన్న
..నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాదించిన. రామన్న కోటను బద్దలు చేయాలని కమలం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది… ఇప్పటికే రామన్న. పై బిజెపి అభ్యర్థి గా పాయల్ శంకర్ రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ..ఈసారి ఆరునూరైనా విజయం సాదించాలని పాయల్ బావిస్తున్నారట .. కాని పాయల్ శంకర్ కు టిక్కెట్ ఇవ్వవద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఎన్ అర్ ఐ. కంది శ్రీనివాస్ రెడ్డి తమకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీని పట్టుబడుతున్నారట. ఈ. ముగ్గురు బిజెపి నాయకులు టిక్కెట్ కోసం పోరు సమరాన్ని మరిపిస్తోంది.. ప్రత్యర్థి నాయకుల్లా అదిపత్య దండయాత్రలు ఒకరి పై ఒకరు చేసుకుంటున్నారట.. సుహసిని రెడ్డి కాలనీలలో పర్యటనలు చేస్తే…కంది శ్రీనివాస్ రెడ్డి అత్మీయసమ్మెళనాలతో ప్రజల్లోకివెళ్లుతున్నారు.. పాయల్ శంకర్ . సర్కార్ వైపల్యాల పై పోరాటం సాగిస్తున్నారు..ప్రజల మద్దతు కూడగడుతున్నారు… దాంతో నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలుగా చీలింది….మెజారిటీ పార్టీ నాయకులు పాయల్ వైపు ఉంటే…. మరికోంతమంది సుహసిని వైపు…ఇంకోంతమంది కంది వైపుఉన్నారట… ఈముగ్గురు రామన్న. పై పోరాటం కంటే ఒకరి పై ఒకరు యుద్దానికిప్రాథాన్యత. ఇస్తున్నారట….ఈ. ముగ్గురు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్కార్ వైపుల్యాల పై పోరాటానికి పిలుపునిస్తే… కలిసి పనిచేయడం లేదు… ముగ్గురు తలోదారిలో వెళ్లుతున్నారు…. పార్టీని , కార్యకర్తలను అయోమంలో గురి చేస్తున్నారట… పైగా పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థులను ప్రకటించకున్నా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారట.. ఒకరిని మించి మరోకరు ప్రజలవద్దకి ప్రచారం చేస్తున్నారట… పార్టీ క్యాడర్ మేజారీటీ పాయల్ శంకర్ తో ఉందట., క్యాడర్ తోపాటు బిసీ కమీషన్ జాతీయ. చైర్మన్ హన్స్ రాజ్ గంగరాం, ఒబిసీ జాతీయ. అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు తో . పార్టీ టిక్కెట్ మళ్లీ తనకే దక్కుతుందని బావిస్తున్నారట పాయల్ … అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు సుహసినరెడ్డికి ఉందట… కిషన్ రెడ్డి మద్దుతో మాజీ జిల్లా పరిషత్ సుహసిరెడ్డిని టిక్కెట్ దక్కుతుందని బావిస్తున్నారట… ఇక.ఎన్ అర్ ఐ. శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో కీలకమైనా నాయకుల్లో ఒకరైనా సంతోజీ మద్దతు తనకు ఉంది ప్రచారం చేసుకుంటున్నారట.. ముగ్గురు పోటీలు పడి వేర్వేరుగా ప్రజల్లో కి వెళ్లుతుండటంపై బలం పడాల్సిన పార్టీ …వర్గాలుగా ఏర్పడి పార్టీ బలహీనం అవుతుందట.. బిజెపి వర్గపోరు ఎన్నికలలో ఎమ్మెల్యే రామన్నకు అనుకూలుంగా మారుతుందని ప్రచారం ఉంది.
.. ఇక. ఆదిలాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉంది.. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత 19శాతంతో 32 వేలకు పైగా ఓట్లు సాదించారు.. ఆ తర్వాత. పార్టీ పరిస్థితి దిగజారుతోంది..బలమైనా నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట..వచ్చే ఈ. ఎన్నికలలో పోటీ చేయడానికి గండ్ర సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు.. కాని బిఅర్ ఎస్ , బిజెపి అభ్యర్థులను తట్టుకోనేంత బలమైనా అభ్యర్థుల కాదనే ప్రచారం ఉందట… అయితే బిజెపిలో టిక్కెట్ లో పోరు తీవ్రంగా ఉంది.. టిక్కెట్ కోసం పడుతున్నా ముగ్గురిలో ఒకరికి టిక్కెట్ దక్కితే మరోక. ఇద్దరు …పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రంగంలోకి దిగడానికి సన్నహలు చేసుకుంటున్నారట.. అందులో బాగంగా బిజెపి నాయకులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని నియోజకవర్గం లో ప్రచారం జోరుగా సాగుతుంది.. ఆ కమలంపార్టీ తిరుగు బాటు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని బిజెపి వర్గాలే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట… మూడు పార్టీలు ఈసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నాయి….మరి ఏవరు విజయంసాదిస్తారో చూడాలి