ఖమ్మంలో కాంగ్రేస్ కు అభ్యర్థులు కరువు
సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పై కాంగ్రెస్ బారం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో విచిత్రకరమైన పరిస్తితి చోటుచేసుకుంది..సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మినహ చెప్పుకోదగ్గ నేతలేవరు లేకపోవడంతో ఆ పార్టీకి మైనస్ గా మారింది..మధిర నియోజకవర్గం తప్ప ఇతర నియోజక వర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే బలమైన నాయకులే కరువరయ్యారు..క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది..సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోబలమైన నేతల కోసం బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలను చేర్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై ప్రత్యేక కథనం
..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఇబ్బందికరమైన పరిస్తితిలు ఏదురవుతున్నాయి..ఐదు నియోజకవర్గాల్లో ఒక మధిర నియోజకవర్గం మినహ ఇతర నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే బలమైన నేతలు లేరన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతుంది..మధిర నియోజకవర్గం విషయానికి వస్తే సీఏల్పీ నేత భట్టి విక్రమార్క లోకల్ గా బలంగా ఉన్నారు..బీఆర్ఎస్ పార్టీ సైతం మధిర లో ఈసారి భట్టి ని ఓడించడానికి ఊ్యహలు రచిస్తుంది…జడ్పీ చైర్మన్ గా ఉన్న లింగాల కమల్ రాజ్ వరుసగా భట్టి మీద పోటి చేసి ఓటమిపాలవుతు ఉండటంతో ఈసారి ఏమైన అభ్యర్థిని మార్చే ప్రయత్నం చేస్తుందా లేక మళ్లీ కమల్ రాజ్ కే టికెట్ ఇస్తుందా అన్నది క్లారిటీ రావల్సి ఉంది..అయితే స్తానికంగా ఉన్న కొంత బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం అభ్యర్థిని మార్చాలన్న ప్రపోజల్స్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది..మధిర లో ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ లో కాంగ్రెస్ పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదు..
..ఇక ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు,సత్తుపల్లి,వైరా ఈ నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన నేతలు కరువయ్యారు..ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించడమంటే అంత ఈజీ అయ్యే పనికాదు..క్యాడర్ తోపాటు స్థానికంగా ఉన్న లీడర్ సైతం బలంగా ఉండాలి.ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి పోటి ఇచ్చే ఒక నేత కూడ లోకల్ కాంగ్రెస్ లో లేరనే వాదన స్తానికంగా వినిపిస్తుంది..డీసీసీ అధ్యక్షులు దుర్గప్రసాద్,జావెద్ లాంటి నేతలు ఉన్న పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ గా చేయడానికి కొంత ఉపయోగపడుతారేమే కాని వీరిని బరిలో దించిన గట్టి పోటి ఇచ్చే పరిస్తితి కనబడటంలేదు..ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది…మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్నారు..ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్థాయిలో పోటి ఇచ్చే నాయకుడి ని బరిలో దింపితే తప్ప గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవనే చెప్పాలి…
..సత్తుపల్లి,పాలేరు నియోజకవర్గాల్లోను అదే పరిస్తితి నెలకోంది..సత్తుపల్లి కాంగ్రెస్ లో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్,మానవతరాయ్ ఉన్నారు..లోకల్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న..బీఆర్ఏస్ నుంచి బలంగా ఉన్న సిట్టింగ్ ఏమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య లాంటి నేతను ఓడించడమంటే ఆస్తాయిలోనే స్థానికంగా ఉన్న పట్టు ఉన్న నేత అవసరం..అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మట్టా దయానంద్ ను పార్టీలో చేర్పించుకోని టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది..దీంతో ఇక్కడ కూడ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత ఏవరు లేరనే చెప్పాలి…
..ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు హట్ సీట్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడ కాంగ్రెస్ పార్టీ బలమైన నేత అవసరం ఏర్పడింది..రాయల నాగేశ్వర్ రావు కొంత యాక్టీవ్ గా పనిచేస్తున్న లోకల్ గా పార్టీ పుంజుకునేపరిస్తితి కనబడటంలేదన్న ప్రచారం లోకల్ కాంగ్రెస్ లో వినిపిస్తుంది..ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఏమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటు వైఏస్సార్ టీపీ నుంచి వైఏస్ షర్మిల బరిలో నిలిచే అవకాశం ఉండటంతో గట్టి అభ్యర్థి కోసం చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అన్వేషణ చేస్తుంది..
.ఇక వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుక లాగా మారింది..టికెట్ ఆశిస్తున్న వారు అరడజను పైన నేతలు ఉన్న ఇందులో ఒక్కరు కూడ గెలిచే పరిస్తితి కనబడటంలేదు..ఒకరికోకరికి అసలు పడదు..గ్రూప్ ల కారణంగా ఇక్కడ రోజు రోజు పార్టీ మరింత బలహీనంగా మారే పరిస్తితి ఏర్పడింది..దీంతో ఇక్కడ కూడ బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న అసంతృప్తి ఉన్న ఓ బలమైన నేత ను చేర్పించుకోని టికెట్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది..
..ఇదిలా ఉంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..పార్టీలో వస్తే ఖమ్మం నియోజకర్గం నుంచి పొంగులేటి ని పోటి చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతానికి పొంగులేటి ఏ పార్టీలో చేరుతానన్న దానిపై ఇప్పటి వరకు అయితే స్పష్టమైన క్లారిటి ఇవ్వలేదు..ఈ నెలలో క్లారిటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకోస్తున్నారు..పొంగులేటి నిర్ణయం తర్వాత ఖమ్మం జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయి..మొత్తానికి ఖమ్మం కాంగ్రెస్ లో క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తు ఉండటంతో బలమైన నేతల కోసం గాలం వేస్తుంది..