కమలం పార్టీలో కాంగ్రేస్ నాయకుల అదిపత్యం

పార్టీ మారిన వారికే ప్రాదాన్యత ఇస్తున్నార‌ని సీ‌నియర్ల అసంత్రుప్తి

..కమలం పార్టీలో కాంగ్రెస్ నాయకులు… ఆ నాయకులే కమలానికి రథసారథులయ్యారు… ఓటమి‌ని ఓడ్డేక్కిస్తామంటున్నారు.. పార్టీకి అదికారంతో పట్టాబిషేకం చేస్తామంటున్నారు.. కాని కాంగ్రెస్ వలస నాయకుల అదిపత్యం పై కమలం పార్టీ‌నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు… కాంగ్రెస్ కమల దళంతో ‌ కలిసి పనిచేయలేమంటున్నారు అసలైనా బిజెపి నాయకులు… తామే అభ్యర్థులంటున్నారు…కాంగ్రెస్ వలస నాయకులతో పోటీకి సిద్దమంటున్నారు .‌ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో వలస కాంగ్రేస్ నాయకులు వర్సేస్ అసలైనా బిజెపి నాయకుల మద్య యుద్దం పై ప్రత్యేక కథనం

. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ ‌ కు కంచుకోట..కాని తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది.. కాంగ్రెస్ బలహీన పడుతుండటంతో దేశంలో, రాష్ట్రంలో ఊపు , ఉత్సహంఉన్నా బిజెపి పార్టీ వైపు కాంగ్రెస్ నాయకులు మొగ్గుచూపుతున్నారు.. బిజెపి పార్టీలో చేరుతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ నిస్తున్నారు కీలకమైన నాయకులు

..దశాబ్ద కాలంగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్నవారు.. బందం తెచ్చుకుంటున్నార… 2018. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన నాయకులు పార్టీని వీడుతున్నారు..గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి బొథ్ నుండి ఎంపిసోయంబాపురావు, నిర్మల్ నియోజకవర్గం లో మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ టి లో పాల్వాయి హరీష్ బాబు, ఖానాపూర్ లో రాథోడ్ రమేష్, ముథోల్ అభ్యర్థిగా రామరావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు… ఈ ఐదుగురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు..

..ఓటమి తర్వాతే కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం, బిజెపి బలపడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు పార్టీ వీడి బిజెపులో చేరుతున్నారు… 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఎంపి టిక్కెట్ దక్కకపోవడంతో సోయంబాపురావు పార్టీ వీడారు.. కమలంపార్టీలో చేరారు…ఎంపి గా పోటీ చేశారు ..అనుహ్యంగా విజయం సాదించారు.. సోయం విజయం తో కమలం పార్టీకి బలం పెరిగింది
.
.‌కాంగ్రేస్ నుండి సోయంతోమొదలైనా చేరికలు మరింత ఊపు అందుకున్నాయి. సోయంబాపురావు తర్వాత పాల్వాయి హరీష్, మాజీ ఎంపిరమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు‌. పాల్వాయి, రాథోడ్ రమేష్ తర్వాత ముథోల్ ‌కాంగ్రేస్ ‌నాయకుడు రామరావు పటేల్ డీసీసీ అద్యక్ష పదవికి రాజీనామా చేశారు.. కమలం పార్టీలో చేరారు..‌మళ్లీ తాజాగా ఎఐసీసీ కార్యక్రమాల. అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు..బిజెపిలో చేరారు.. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ఎడు అసేంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఐదు స్థానాలనుండి కాంగ్రెస్ నాయకులు కమలంపార్టీలో చేరారు

. అయితే పార్టీ మారిన ఈ కాంగ్రెస్ కమలదళ నాయకులకు బిజెపి టిక్కెట్లు దాదాపు ఖాయం అయ్యాయి.. ఇదే పార్టీలో అసంత్రుప్తికి దారి తీస్తోంది.. కాంగ్రెస్ కమల దళానికి, అసలైన పాత బిజెపి నాయకుల మద్య. విబేదాలు అగ్గిరాజేస్తున్నాయి… ముథోల్ ‌నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గా రమాదేవి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.. కాని ముచ్చటగా మూడోసారి పోటీ చేద్దామంటే టిక్కెట్ రాదని పార్టీలో ప్రచారం ఉంది… రామారావు పటేల్ బిజెపి అభ్యర్థనిపార్టీలో చర్చ సాగుతుందట.. అదేవిధంగా నిర్మల్ లో గత ఎన్నికలలో స్వర్ణ. రెడ్డి బిజెపిపోటీ చేశారు ఓడిపోయారు..ఈసారి బిజెపి టిక్కెట్ కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల. గణేష్ కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరారు.. కాని మహేశ్వర్ రెడ్డి చేరికతో అప్పాల ఆశలు అడియాలయ్యాయి.. టిక్కెట్ దక్కపోతే పార్టీ మారాలని అప్పాలట బావిస్తున్నారని ప్రచారం ఉంది…ఖానాపూర్‌ నియోజకవర్గం నుండి గత ఎన్నికలలో అదివాసీ నాయకుడు సట్ల అశోక్ బిజెపి అభ్యర్థి గా ఎన్నికలలో పోటీ చేశారు..బారీగా ఓట్లు సాదించారు… రాథోడ్ చేరికతో సట్ల అశోక్ కు టిక్కెట్ దక్కేవకాశం లేదు.. అదేవిధంగా సిర్పూర్ టి నుండి గత అసెంబ్లీ ఎన్నికలలో కొత్తపల్లి శ్రీనివాస్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు.. మళ్లీ పోటీ చేయాలని కొత్తపల్లి భావిస్తున్నారు…కాని పాల్వాయి చేరికతో కొత్తపల్లి కి టిక్కెట్ దక్కదు… కొత్తపల్లి శ్రీనివాస్ బిజెపి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన. టిక్కెట్ కోసం పట్టుపడుతున్నారు. బోథ్ లో ఎంపి సోయంబాపురావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం ఉంది… కాంగ్రెస్ నుండి చేరిన నాయకులకు పార్టీ టిక్కెట్లు ఇస్తామనడంపై ‌ పార్టీలో పాత నాయకులు అసంత్రుప్తితో రగిలిపోతున్నారట..‌తమకు టిక్కెట్ ఇవ్వకుండా ఎన్నికల సీజన్ కోసం వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తే కలిసి పనిచేసే పరిస్థితులు లేవట‌.‌అవసరమైతే పాత బిజెపి నాయకులు తమదారి తాము చూసుకోవడానికి సిధ్దమయ్యారట‌.. కాని కాంగ్రెస్ కమల. దళ. నాయకులతో ఎన్నికలలో పనిచేయమని శపథాలు చేస్తున్నారట.. అయితే కాంగ్రెస్ కమల ధళ నాయకులు పాతనాయకులు పనిచేసినా…చేయకపోయినా ఎన్నికలలో విజయం సాదిస్తామని బావిస్తున్నారట… మరి ఉమ్మడి ఆదిలాబాద్ కమలం పార్టీలో పాత ,కోత్త. నాయకుల అదిపత్య. పోరులో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.