సీఎం కేసీఅర్ పై కాంగ్రేస్ ఏదురుదాడి

ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహన్ని అష్కరించారని మండిపాటు

దళితులను‌ దగా చేశారు… దరిణితో ‌ అసైన్డ్ భూములు మింగేశారు….దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్నారు..విగ్రహలు పెట్టడంకాదు దళితుల, అదివాసీ పేదల. బ్రతుకుల‌ను మార్చాలని సీఎం కేసీఆర్ పై ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ … మోసాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రజలకు‌ పిలుపునిచ్చారు.. అదికారంలో వస్తే పోడుభూమలకు పట్టాలు ఇచ్చి పట్టాబిషేకం చేస్తామని…అణచబడిన ప్రజలకు బరోసానిస్తామని మంచిర్యాల డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ .. మంచిర్యాల కాంగ్రెస్ సభ. పై ప్రత్యేక కథనం

.. మంచిర్యాల. జై భారత. సత్యగ్రహ సభ… కాం గ్రేస్ పార్టీకి ఊపునిచ్చింది.. ఉత్సహన్ని నింపింది‌.సీఎల్పీ నాయకుడు ‌ భట్టివిక్రమార్క పాదయాత్ర లో మంచిర్యాల జిల్లా కేంద్రం లోని నస్పూర్ లో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది‌..ఈ బహిరంగ సభకు ఎఐసీసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన. ప్రసంగించారు. దేశంలో‌‌ రాష్ట్రంలో, నియంతల పాలన సాగిస్తున్నారని ప్రదాని మోడి సీఎం కేసీఆర్,పై ఆయన మండిపడ్డారు…అంబేద్కర్ వల్లనే అందరికి ఓటు హక్కు లబించిందన్నారు… ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పారు. కాని ప్రదాని మోడి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు… దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం రాహల్ గాందీ కుటుంబం.. అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్ గాందీని అక్రమంగా పార్లమెంటు సభ్యత్వానికి అనర్హత. వేటు వేయించారన్నారు…బిజెపి ఎంపికి శిక్ష పడిన అనర్హత. వేటు వేయలేదని ప్రదాని మోడి పై అగ్రహం వ్యక్తం చేశారు… రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వందల. పీట్ల విగ్రహలు పెట్టడంకాదు.. దళితులు,గిరిజనుల సబ్ ప్లాన్ నిధులను ఎందుకు మళ్లీంచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. మూడేకరాల భూమి ఇవ్వలేదు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వని బిఅర్ ఎస్ సర్కారు ను పాతరేయాలని పిలుపునిచ్చారు..

.. తెలంగాణ సర్కార్ దళితులకు ‌ క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వకుండా దళితులను అవమాన. పరిచిందన్నారు..‌ రాష్ట్రంలో మాదిగలకు క్యాబినెట్ లో చోటు దక్కలేదన్నారు.. రాబోవు ఎన్నికలలో ఓడిస్తారనే భయంతో సీఎం కేసీఆర్ ఓట్ల కోసం విగ్రహాన్ని అవిష్కరించారన్నారు.. అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతిని తోలగించిన. ముఖ్యమంత్రికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు‌‌‌..రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందన్నారు… అదికారంలోకి రాగానే ప్రాణహిత నిర్మిస్తామన్నారు‌‌‌.. అదేవిధంగా సిలిండర్ ఐదువందలకు ఇస్తామన్నారు… అదేవిధంగా ఖాలీగా ఉన్న రెండు లక్షల. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు రేవంత్..

..ఈ సందర్భంగా సీఎల్పీనాయకుడు భట్టి విక్రమార్క. ప్రసంగించారు… సీఎం కేసీఆర్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ తీవ్రమైన. అన్యాయం జరగిందన్నారు..‌ ప్రాణహిత చెవేళ్లను నిర్మించకుండా . తరలించి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు..కమీషన్ల కోసం‌ కాళేశ్వరం ఎత్తి పోతల పథకం నిర్మించారన్నారు.. ఆదిలాబాద్ ప్రజలను కాళేశ్వరంతో ముంచారన్నారు… ముంచిన. కేసీఅర్ ను కాళేశ్వరంలో ముంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు… తాను పాదయాత్ర లో ప్రజల ఇబ్బందులు కళ్లారా చూశానని…అదివాసీల పోడు భూములకు హక్కులు లేవన్నారు…చివరకు వేట్టిచాకిరిని వాళ్లకు ఇచ్చిన. భూములను ‌లాక్కున్నారని ఆరోపించారు.. సింగరేణి ప్రైవేట్ చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారన్నారు..కాంగ్రెస్ అదికారంలొకి వస్తే సింగరేణి‌పరి రక్షిస్తామన్నారు.. పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు‌. దరణితో భూములు కోల్పోయిన వారికి హక్కులు కల్పిస్తామి ప్రకటించారు ‌..‌ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నా సీఎం కేసీఆర్ కి బుద్ది చెప్పాలన్నారు

Leave A Reply

Your email address will not be published.