కాంగ్రేస్ ను టార్గేట్ చేసిన సీఎం కేసీఅర్

కర్నాటక పలితాలతో పుంజుకుంటున్నా కాంగ్రేస్ పై ఎదురుదాడి

వ్యూహం మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్… నిర్మల్ సభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన గులాబీ బాస్… రైతు బందుకు రాంరాం చెప్పే….దళితబందును జైబీమ్ చెప్పే….దరణితో పైరవీ కారుల రాజ్యం‌తేస్తామంటున్నా కాంగ్రెస్ ను బంగాళాఖాతం లో పాతరేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. కర్నాటక. పలితాల తర్వాత బిఅర్ ఎస్ ను డీకోట్టేది కాంగ్రెసేనా… తెలంగాణ లో ఎన్నికల యుద్దం బిఅర్ ఎస్, కాంగ్రెస్ ‌మద్య జరుగుతాయా? బిజెపి పై నిప్పులు చెరిగే కేసీఅర్ మౌనం దాల్చడానికి కారణాలేంటి? మారిన. సీఎం కేసీఆర్ వ్యూహం పై ప్రత్యేక కథనం

ప్రదాని మోడి పై విమర్శలు సందించి… బిజెపిని టార్గెట్ గా విమర్శలు చేసే కేసీఅర్ రూట్ మార్చారు…ఆయన కాంగ్రెస్ పార్టీ పై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు…నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరెట్ సమీక్రుత. భవనాలను ప్రారంబించారు… అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేశారు… కాంగ్రెస్ పార్టీ దేశంలో ,రాష్ట్రం లో యాబై ఎళ్ల పాటు పాలన సాగించందన్నారు..‌ కాని చేసింది ఏమిలేదన్నారు…అలాంటి పార్టీ అదికారంలోకి రావడానికి ఎత్తుగడలు వేస్తుందని ఆరోపించారు..

. ప్రదానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదికారంలోకి రావడానికి దరణి పోర్టల్ రద్దు చేస్తామంటున్నారని అన్నారు…ధరణి పోర్టల్ రద్దు చేస్తే పైరవీల రాజ్యం వస్తుందన్నారు.. మళ్లీ విఅర్ ఎ, పట్వారీల అవినీతికి‌ అడ్డులేకుండా పోతుందన్నారు.. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు పదిహేను నిమిషాల్లో పూర్తవుతాయన్నారు… ఒకవేళ దరణి రద్దు చేస్తే … ఏ రోజు భూమి ఏవరి‌ పేరు మీద నుండి ఎవరికో వెళ్లుతుందనే తెలియదన్నారు సీఎం…

. అక్రమాలను నిర్మూలించడానికే దరణి తెచ్చామన్నారు. రైతులు పండించిన దాన్యం కోనుగోలు చేస్తున్నాము..‌ కొనుగోలు చేసిన దాన్యానికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము… భూమి ఉన్నా రైతు చనిపోతే వారం రోజులలో ‌ రైతుకు బీమా డబ్బులు ఐదు లక్షలు చెల్లిస్తున్నామన్నారు…‌దరణి రద్దు చేస్తే మళ్లీ రెవిన్యూ అవినీతికి అడ్డు అదుపులేకుండా పోతుందన్నారు.. దరిణి రద్దు చేసి రైతు బందు రాంరాం చెబుతారని…దళిత బందు కు జై బీమ్ చెప్పే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు..

‌ ఒకప్పుడు తెలంగాణ కరెంటు కష్టాలు అన్ని ఇన్ని కావు…కరెంటు ఎప్పుడు వస్తుందో….ఎప్పుడు పోతుందో‌‌ తెలియని భయంకరమైన పరిస్థితులు ఉండేవని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ వ్యవసాయానికి ‌ కరెంటు నిరంతరాయంగా విద్యుత్ సరపరా చేస్తున్నామన్నారు..అదేవిధంగా ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోగాలతో ప్రాణాలు కోల్పోయేవారన్నారు.. కాని మిషన్ భగీరథ నీళ్లను సరపరా చేస్తూ అదివాసీల ప్రాణాలు కాపాడమన్నారు… కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇస్తే పంటికి అందకుండానే‌ మింగేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. పనిచేసే తమకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఅర్ ప్రజలను కోరారు..

. కాంగ్రెస్ ‌ను టార్గెట్ చేయడం వెనక బిఅర్ ఎస్ అదినేతకు బారీ వ్యూహం ఉంది.. కర్నాటక ఎన్నికలలో విజయం సాదించిన తర్వాత. తెలంగాణ కాంగ్రెస్ అనుహ్యంగా పుంజుకుందట..కోందరు అసంత్రుప్తి‌ బిఅర్ ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమవుతున్నారు…అలాంటి వారిలో నిర్మల్ కు చెందిన బిఅర్ ఎస్ నాయకుడు శ్రీహరి రావు ఉన్నారట‌.‌…‌ అదేవిధంగా జూపల్లి, పోంగులేటి వంటి నాయకులు రేవంత్ రెడ్డి అమెరికా నుండి రాగానే పార్టీలో చేరుతారనే ప్రచారం ఉందట.‌‌ఇదంతా ఒక ఎత్తైతే… బిఅర్ ఎస్ నిర్వహించిన సర్వేలో బిఅర్ ఎస్ కు ఎన్నికలలో పోటీ కాంగ్రెసని తెలిందట… అందుకే కాంగ్రెస్ పై ఏదురుదాడి ప్రారంబించారని ఆ పార్టీ వర్గాలలో‌‌ప్రచారం ఉంది.. ప్రదాని మోడి పై ఒంటి కాలి పై లేచే. సీఎం కేసీఆర్… బిజెపి ఎంపి గా గెలిచిన ఆదిలాబాద్ ప్రాంతం, నిర్మల్ ప్రాంతంలో బిజెపి ముచ్చట కూడ తీయలేదట… కాంగ్రెస్ దెబ్బతీసే వ్యూహం సీఎం విమర్శనా అస్త్రాలు సందించారట.. ఈ. ఏదురు దాడి కాంగ్రెస్ పై రాబోయే రోజులలో మరింత. పెంచుతుందని గులాబీ దళంలో చర్చ సాగుతుందట..‌‌ మరి సీఎం కేసీఆర్ వ్యూహాన్ని కాంగ్రెస్ ఏలా ఎదుర్కోంటుందో చూడాలి..ఏవిదంగా తిప్పికోడుతుందో చూడాలి

Leave A Reply

Your email address will not be published.