కోత్తగూడేం టిక్కేట్ కోసం బిఅర్ ఎస్ లో కోట్లాట
టిక్కేట్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నా హెల్త్ డైరెక్టర్, వనమా

..కొత్తగూడెం బీఆర్ఎస్ లో కొత్త లోల్లి మొదలైంది..కొత్తగూడెం టికెట్ తనదేంటున్నా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ .. సేవల పేరుతో ఎన్నికల. ప్రచారాన్ని మరిపిస్తున్నా హెల్త్ డైరెక్టర్…వనమాకు దడపుట్టిస్తున్నా శ్రీనివాస్ …. పుకార్లను కోట్టిపారేస్తున్నా గులాబీ టికేట్ తనదేంటున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే.. కోత్తగూడేంలో టిక్కెట్ కోట్లాట పై ప్రత్యేక కథనం
..కొత్తగూడెం బీఆర్ఎస్ లో అప్పుడే టికెట్ వార్ నడుస్తుంది..వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటి చేయాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు సిద్దంగా ఉన్నారు..దీనిలో బాగంగానే ఏడాదిన్నర నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు..ఇదే సమయంలొ అనేక వివాదాలు సైతం వచ్చి వార్తల్లో సైతం నిలిచారు…
ఓ ఏంపీపీ ఇంట్లో ఆయన చేసిన మిరపకాయ పూజలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రెకెత్తించాయి..ఒక హెల్త్ డైరెక్టర్ అయిన మూడ నమ్మకాలు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు సైతం వచ్చాయి..అయితే వాటిని శ్రీనివాస్ రావు కోట్టేపారేశాడు..అప్పటి నుంచి విపక్ష పార్టీల నేతలు సైతం హెల్త్ డైరెక్టర్ ను టార్గెట్ గా చేసుకుంటు వస్తున్నారు.
..ప్రస్తుతం గడల శ్రీనివాస్ జీఏస్సార్ ట్రస్ట్ పేరు మీద ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు జనంకు దగ్గర ప్రయత్నం చేస్తున్నారు..వారంలో రెండు రోజులు కొత్తగూడెంకే కేటాయిస్తున్నారు..కొత్తగూడెం ఇంకా అభివృద్ది కావాలని మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా తనను ఆశీర్వాదించాలని జనంను కోరుతు వస్తున్నారు..కూల,మతాలకు అతీతంగా సాటి మనిషి పట్ల మానవత్వం చూపడమే తన జెండా,అజెండా అని క్లారిటీ ఇస్తున్నారు..దిన్ని బట్టి చూస్తే శ్రీనివాస్ రావు తన అజెండా ఫీక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది..అంతేకాదు తన పదవిని ఉపయోగించుకోని పొలిటికల్ గా సైతం ఫేమ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు..దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న చందగా పదవి ఉన్నప్పుడే దానిని అనుకులంగా వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో చేయాల్సిన పనులు అన్ని ఊ్యహత్మకంగా చేసుకుంటు వస్తున్నారు..
..మరోవైపు వీలు దోరికినప్పుడల్లా సీఏం కేసీఆర్ ఆశీర్వాదం సైతం తీసుకుంటు రెండు వైపుల నుంచి తన పని తాను చేసుకుంటు వెళ్లుతున్నారు..గతంలో సీఏం కేసీఆర్ ను కలిసిన సందర్బంలో కేసీఆర్ కాళ్లను నిమిషాల వ్యవధిలో రెండు సార్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే..వెంటనే శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి గులాబి కండువా కప్పుకోవాలని సెటైర్లు సైతం వేశారు.ఎన్ని విమర్శలు వచ్చిన తన టికెట్ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తు వస్తున్నారు గడల శ్రీనివాస్ రావు..టికెట్ పై కేసీఆర్ నుంచి స్పష్టమైన హమీ లభించిన వెంటనే తన పదవికి రాజీనామా చేయడానికి గడల శ్రీనివాస్ రావు సిద్దంగా ఉన్నట్లు కొత్తగూడెంలో జోరుగా ప్రచారం జరుగుతుంది..
.ఇదిలా ఉంటే సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు మాత్రం కొత్తగూడెం సీటు నాదే గెలుపు నాదే అంటున్నారు..గడల శ్రీనివాస్ రావు తో పాటు ,మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు ఆశిస్తు ఉండటం పొత్తుల్లో బాగంగా టికెట్ తనకే వస్తుందన్న దీమాలో కూనంనేని సాంబశివరావు ఉన్న నేపథ్యంలో…తన టికెట్ కాపాడుకోవడం కోసం అనేకపాట్లు పడుతున్నారు వనమా.టికెట్ పోటి ఏక్కువగా ఉండటంతో లోకల్ లోనే మకాం వేశారు..ఏవరెన్ని ప్రయత్నాలు చేసిన టికెట్ తనకే వస్తుందంటున్నారు వనమా..అనారోగ్య కారణాలతో వనమాకు టికెట్ రాదని బీఆర్ఎస్ లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు దీమాతో ఉన్నారు..ఇదిలా ఉంటే వనమా,గడల శ్రీనివాస్ రావు ఇద్దరు ఒక్కటే సమాజిక వర్గానికి చెందిన వారు..కొత్తగూడెం నియోజకవర్గంలో మున్నురు కాపు ఓట్లు ఏక్కువగా ఉంటాయి..దీంతో ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో ఇద్దరు వారికి అనుకులంగా మలుచుకొని లోకల్ గా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు…మొత్తానికి కొత్తగూడెం నియోజకవర్గంలో రసవత్తరమైన పాలిటిక్స్ నడుస్తున్నాయనే చెప్పాలి.ఇక్కడ కాంగ్రెస్,బీజెపీ అంతగా బలంగా లేకపోయిన రాజకీయమంతా బీఆర్ఎస్ చుట్టే తిరుగుతుంది..చూడాలి ఎన్నికల సమాయానికి కొత్తగూడెంలో ఇంకా ఏటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయో…ఏలాంటి ట్విస్ట్ లు కొనసాగుతాయో చూడాలి మరి…
.