పోలీసు స్టేషన్ కు చేరిన బిఅర్ ఎస్ వసూళ్ల చాయితీ
తనపై ఆరోపణలు చేసినవారి పై చర్యలు చేపట్టాలని పోలీసులకు పిర్యాదు చేసిన ఎంపిపి తులశ్రీనివాస్

.. అదికార పార్టీ నాయకులే బరితేగించారు.. దళితబంధులో వసూళ్ల దందాకు పాల్పపడ్డారు … పథకం రావాలంటే పైసలు ఇవ్వాలన్నారు…లేదంటే పథకం రాదన్నారు..ఆ భయంతోనే పుస్తేలమ్మి పథకం కోసం పైసలు చెల్లించారులబ్దిదారులు .. డబ్బుల వసూళ్లపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పై బిఅర్ ఎస్ ప్రజాప్రతినిదులు తిరుగుబాటు చేశారు.. చర్యల పై చేతులు ఎత్తేశారు..కాని ఆరోపణల పై ఎమ్మెల్యే అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు…ఆరోపణలు చేస్తున్నా ఎంపిపి తుల శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది ఎమ్మెల్యే వర్గం… ఎంపిపి జిల్లా పరిషత్ నిదులు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పపడ్డారని ఎమ్మెల్యే అనుచరులు తుల శ్రీనివాస్ పై ఆరోపణలు సందిస్తున్నారు… మరి వసూళ్ల దందా లో ఏవరి వాటా ఎంత? బోథ్ బిఅర్ ఎస్ లో దళిత బందు లో దోపిడీ దందా పై ప్రత్యేక. కథనం
…ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం లోని గులాబి పార్టీ విబేదాలు తారాస్థాయికి చేరాయి..దళిత బందు పథకంలో బారీగా వసూళ్లకు పాల్పపడ్డారని జిల్లా పరిషత్ లో బిఅర్ ఎస్ ఎంపిపి తులశ్రీనివాస్, జడ్పీటీసీ అనిల్ జాదవ్ సంచనల ఆరోపణలు చేశారు..కోందరు సర్పంచ్ లు , గులాబి పార్టీ నాయకులు పథకం కోసం డబ్బులు తీసుకున్నారన్నారు.. డబ్బలు ఇస్తేనే పథకం వస్తుందని బిఅర్ ఎస్ దళారులు వసూళ్లకు పాల్పపడ్డారన్నారు…పైసలు ఇవ్వకపోతే పథకంరాదని బెదిరించారన్నారు… ఆ బెదిరింపులకు భయపడి అడవాళ్లు మేడలో తాళీలు అమ్మి డబ్బులు చెల్లించారని ఆరోపించారు ఎంపిపి తులశ్రీనివాస్, జడ్పీటీసీ అనిల్ జాదవ్ పై తమ ఆదారాలున్నాయని ప్రకటించారు….. అదేవిధంగా వసూళ్ల కు పాల్పడిన. వారి పై చర్యలు చేపట్టాలని డిమాండు చేస్తున్నారు
.అయితే ఈ ఆరోపణలే అగ్గిరాజేస్తున్నాయి… జిల్లా పరిషత్ సమావేశంలో దళిత. బందు వసూళ్ల. పర్వం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరువు తీసింది… దాంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆయన వర్గం వసూళ్ల దందా పై ఎదురుదాడి ప్రారంభించింది.. అందులో బాగంగా ఎమ్మెల్యే వర్గీయులు ఎంపిపి తుల శ్రీనివాస్ ను టార్గేట్ చేశారు..ఈ టార్గెట్ లో ఎంపిపి పై ఎదురుదాడి చేస్తున్నారు.. బోథ్ వైస్ ఎంపిపి లింబాజీ ఎంపిపి శ్రీనివాస్ జిల్లా పరిషత్ నిదులు ఇప్పిస్తానని చెప్పి తనవద్ద. యాబై వేల రుపాయలు తీసుకున్నారని ఆరోపించారు .. కాని ఇప్పటి వరకు పనులు ఇప్పించలేదన్నారు… అదేవిధంగా తనకు డబ్బులు ఇవ్వలేదన్నారు.. అదేవిధంగా డబ్బులు అడిగితే ఇవ్వడంలేదన్నారు…ఇలా తానోక్కడినే కాదు…అనేక మందిని మోసం చేశారంటున్నారు…తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరుతున్నారు లింబాజీ
దళిత బందు వసూళ్ల దందాతో బోథ్ లో బిఅర్ ఎస్ రెండుగా చీలిపోయింది…. ఒక వర్గానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వర్గం, మరోక. వర్గం మాజీ మంత్రి గోడం నగేష్ వర్గంగా రెండుపోయారు..నగేష్ వర్గం గత కోన్ని రోజులుగా వసూళ్ల దందా పై పోరాటం చేస్తోంది…వసూళ్ల సంబంధించిన జాబితాను ఆదారాలతో సహ. నగేష్ వర్గం సీఎం కేసీఆర్ కు పిర్యాదు చేశారు. ఆ పిర్యాదు పై స్పందించి ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేశారు.
అనుచరుల వసూళ్ల దందాతో ఎమ్మెల్యే రాథోడ్ ప్రజల్లో పలుచనయ్యారు.. వసూళ్లతో తనకు సంబంధం లేదని కోట్టిపారేస్తున్నా నగేష్ వర్గం వదలడంలేదు… సోషల్ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది…ఆ ప్రచారాన్ని తిప్పి కోట్టడానికి ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నా వారిపై తన అనుచరుల చేత. ఆరోపణలు చేయిస్తున్నారు… ఎమ్మెల్యేగా వర్గానికి దీటుగా మాజీ మంత్రి నగేష్ వర్గం జవాబులిస్తోంది.. ఆరోపణలు ఖండిస్తోంది…. అంతేకాదు. తనపై అనవసరంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేసిన వైస్ ఎంపిపి లింబాజీ చర్యలు చేపట్టాలని తుల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
..అయితే అనుచరుల పథకాల్లో వసూళ్ల. దందాతో రాథోడ్ బాపురావుకు టిక్కెట్ రాదని ప్రచారం ఉంది.. దీనికి తోడు నగేష్ ప్రజల్లోకి వెళ్లుతున్నారు…ప్రజల మద్దతు కూడగడుతున్నారు… తనదే టిక్కెట్ ప్రచారం నిర్వహిస్తున్నారు… ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు… ఈ ప్రచారాన్ని రాథోడ్ బాపురావు తిప్పికోడుతున్నారు… మూడోసారి టిక్కెట్ తనకే దక్కుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు…విజయం సాదించి నియోజకవర్గాన్ని అభివ్రుద్ది చేస్తామంటున్నారు ఎమ్మెల్యే.. మరి ఈ. ఇద్దరిలో టిక్కేట్ ఎవరికి దక్కుతుందో చూడాలి