చేల్లేల్ల ఆకలి కోసం కూలీగా మారి‌న అన్న

తల్లదండ్రలు చనిపోవడంతో ముగ్గురు చెల్లేల్ల కూలిగా మారిన అన్న

… పాపం పసివాళ్లు…. అనురాగాలను పంచే అమ్మ దూరమైంది……అలాన పాలన చూసే నాన్న లేడు… ఆకలితో అలమటిస్తున్నా… పిడికేడు మేతుకులు పెట్టే నా వాళ్లు లేరు.. అమ్మనాన్న లు లేక… అదరించే వాళ్లు దిక్కులు చూస్తున్నారు … దుంఖం తో తల్లడిల్లుతున్నారు… ముగ్గురు చెల్లేల కన్నీటి కష్టాలను తుడవటానికి అన్నయ్య. అడ్డగా‌ కూలీయ్యాడు… ఆ కూలీ డబ్బులు కూటీకి చాలడంలేదు…ఆకలి తీర్చడంలేడు…ముగ్గురు చెల్లేలను పోషించడానికి కష్టాలు పడుతున్నా ఆన్నయ్య పై ప్రత్యేక కథనం

. కుమ్రంబీమ్ జిల్లా దహేగామ్ మండలం చాక. గ్రామం సిడాం సత్తయ్య, లలిత దంపతులకు ఐదుగురు పిల్లలు సంతానం.. ఒక అబ్బాయి, నలుగురు అడపిల్లలున్నారు…పేద కుటుంబం … కూలీనాలి చేసి పిల్లలను పోషిస్తున్నారు… కలో గంజోత్రాగి బ్రతుకుతున్నా కుటుంబం పై విది పగపట్టింది… ఆరేళ్ల క్రితం నాన్న సత్తయ్య అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు… నాన్నను మింగిన. రాకాసి రోగం అమ్మను వదలిపెట్టలేదు… అమ్మ లిలిత బ్రతికి ఉన్నప్పుడే రెండేళ్ల క్రితం పెద్ద కూతురుకి వివాహం చేసింది..‌ ఇటీవల అమ్మ. లలిత అనారోగ్యంతో నలుగురు పిల్లలకు దూరమైంది..‌కనరాని లోకాలకు వెళ్లిపోయింది‌.

…అమ్మ నాన్నలను రాకాసి రోగాలు బలి తీసుకోవడంతో పదిహేను ఏళ్ల రాజు, పదమూడేళ్ల. మమత, పదేళ్ల. దీపిక, ఎడెళ్ల దివ్య దిక్కులేని పక్షులయ్యారు… అమ్మనాన్నలను కోల్పోయి అనాథలుగా మారారు…

. అలనా పాలన చూసే అమ్మనాన్న లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు..‌ కనీసంతిందామంటే బియ్యం లేవు…బియ్యం లేక. ఆ ఇంట్లో, ఇంట్లో కిలో బియ్యం అడుక్కోని కడుపు నింపుకుంటున్నారు నలుగురు పిల్లలు‌.

అయితే ఈ. ఆకలి కష్టాలను బరించలేక అన్న రాజు ముగ్గురు చెల్లేలను పోషించడానికి వ్యవసాయ కూలిగా మారాడు..‌గ్రామంలో ఏవరైనా కూలీ పనులు ఉంటే వారికి కూలీకి వెళ్లి ‌ముగ్గురు చెల్లేలను పోషిస్తున్నారు..ఆకలితో అలమటించే చెల్లేలకు కూలీ డబ్బులు పిడికేడు మేతుకులు పెడుతున్నారు..

.‌రాజు రోజు కూలీ పనులు చేయడానికి సిద్దంగా పనులు లేవు..ఒకరోజు ఉంటే కూలీ దోరికితే మరోక రోజు కూలీ దోరకడంలేదు…దాంతోకూలీ దోరకినప్పుడు తింటున్నారు…లేనిసమయంలో పస్తులుంటున్నామని రాజ. ఆవేదన వ్యక్తం చేశారు..కనీసం తమకు ఏడాది కాలంగా రేషన్ బియ్యం కూడ ఇవ్బడం లేదంటున్నారు.. రేషన్ బియ్యం ఇవ్వాలని అదికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు రాజు.

.. అనాథలుగా మారిన నలుగురు పిల్లల కష్టాలు చూసి చలించిపోతున్నారు… ఎంతో కోంతో తోడ్పాటు అందించిన వారి అవసరాలను తీర్చలేకపోతున్నామని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు… దాతలు, సర్కార్ స్పందించి ఈపిల్లలను అదుకోవాలని గ్రామస్తురాలు నిర్మల కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.