అపీస్ బాయ్ నుండి అద్యక్షుని వరకు మోడి అత్మీయ పలకరింపు

బిజెపి రాష్ట్ర కార్యాలయ సిబ్బందికి ప్రదాని పలకరింపు

 

హైదారాబాద్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిశారు. ఆఫీస్ లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బోయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరిని ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోదీ కార్యాలయం అనుమతిచ్చింది.

 

దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఆయా సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ – 10 వద్ద కు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు.

మీరంతా ఎన్నేళ్ల నుండి బీజేపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’’అంటూ పలకరించారు. అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేవుడి లాంటి మోదీని కలిసే అవకాశం రావడం తమ అద్రుష్టమని ఆయా సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. మోదీని కలిసిన వారిలో బంగారు శ్రుతితోపాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.