కమలం పార్టీలో అగ్గిరాజేస్తున్నా విబేదాలు
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో తారస్థాయికి చేరిన విబేదాలు

…కమలం పార్టీలో కుంపట్లు …. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఇరవై ఒకటి గ్రూపులు .. ప్రత్యర్థి పార్టీ నాయకుల్లా ఒకరిని చిత్తు చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నా పార్టీ నాయకులు.. కుంపట్లు పార్టీని బలహీనం చేస్తున్నాయా.?ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో కమలం పార్టీలో అగ్గిరాజేస్తున్నా విబేదాల పై ప్రత్యేక కథనం
నిర్మల్ జిల్లా లో బండి సంజయ్ పాదయాత్ర పార్టీలో ఉత్సహన్ని నింపింది..ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచింది…ప్రదానంగా పాదయాత్ర ముథోల్, నిర్మల్ , ఖానాపూర్ నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహించారు బండి సంజయ్… సంజయ్ తెచ్చిన ఊపుతో టిక్కెట్ దక్కితే చాలు గెలుస్తామనే నాయకులకు దీమాను కల్గిస్తున్నాయట
..ఆ ఉత్సహంతోనే నాయకులు టిక్కెట్ కోసం బారీగా పోటీగా పోటీపడుతున్నారు… ద్వితీయ శ్రేణి నాయకులు సైతం టిక్కెట్ కోసం పై రవీలు ప్రయత్నాలు సాగిస్తున్నారు…. ముథోల్ యోజకవర్గంలో రామరావు పటేల్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మోహన్ రావు పటెల్ టికెట్ కోసం పోటీపడుతున్నారు.. ఒకరిని మించి మరోకరు టిక్కెట్ కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట… అదేవిధంగా టిక్కెట్ తనకు దక్కుతుందని తనకు దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారట.. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి నియోజకవర్గంలో పట్టు బిగిస్తున్నారట.. పట్టుబిగించడంలో ప్రత్యర్థి పార్టీనాయకులా ఒకరిని మించి మరొకరు చిత్తులు వేసేలా వ్యూహలు రచిస్తున్నారట..
… నిర్మల్ నియోజకవర్గం లో మల్లికార్జున్ రెడ్డి, మాజీమున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు.. ఖానాపూర్ నియోజకవర్గం లో మాజీ ఎంపి రమేష్ రాథోడ్, పెంబి జడ్పీటీసీ జాను బాయి, హరి నాయక్ పోటీ పడుతున్నారు.. గత. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన. అభ్యర్థి సట్ల ఆశోక్ టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. ఈ. నలుగురు నలుగు దిక్కులా చీలిపోయారట. జాను బాయి తాను నియోజకవర్గానికి చెందిన లోకల్ అభ్యర్థిని తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట..రాథోడ్ రమేష్ బలమైనా అభ్యర్థి… ఓ సారి ఎమ్మెల్యే, మరొకసారి ఎంపి గా పనిచేసిన. అనుభవం ఉంది… ప్రజల్లో గుర్తింపు ఉంది… పార్టీ నిర్వహించిన. సర్వేలలో బలమైనా అభ్యర్థి అని తెలిందట..కాని రాథోడ్ రమేష్ కు టిక్కెట్ దక్కితే…. మిగితా వాళ్లు గెలుపు కోసం పనిచేయరని ప్రచారం ఉంది.. సోంత పార్టీ నాయకులు ఇప్పుడే ఓడించటానికి ప్రయత్నిస్తారని పార్టీలో చర్చ జరుగుతుందట.. ఇదే రమేష్ రాథోడ్ గుబులు పుట్టిస్తోందట.. సోంత. పార్టీ నాయకులే ప్రత్యర్థి పార్టీ నాయకులను మరిపిస్తున్నారని రాథోడ్ రమేష్ సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తున్నారట..
… ఎంపి సోయంబాపురావు బోథ్ నియోజకవర్గానికి చెందిన వారు… గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.. కాని అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం పై స్పష్టత ఇవ్వడం లేదట… ఇటీవల. ఉద్యోగ విరమణ చేసిన దశరథ్ టిక్కెట్ఆశిస్తున్నారు.. దశరథ్ కు ఎంపి మద్దతు ఇస్తున్నారని ప్రచారం ఉంది .. ఆదిలాబాద్ నియోజకవర్గం లో పార్టీ పరిస్థితి విచిత్రంగా ఉంది… జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పని చేస్తున్నారు.. గతంలో మూడుసార్లు ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.. మళ్లీ టిక్కెట్ వస్తుందనిఆశలు పెట్టుకున్నారు.కాని మరోక ఇద్దరు అభ్యర్థులమంటూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహసినిరెడ్డి, ఎన్ అర్ఐ కంది శ్రీనివాస్ తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. …ఎకంగా రథాలు ఏర్పాటు చేసుకోని ఎన్నికల ప్రచారం చేస్తున్నారట.. పార్టీ ఏ పిలుపునిచ్చినా కలిసి పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయట… ఈ విబేదాలు రోజరోజుకు ముదురుతున్నాయట.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విబేదాలు చేరాయట.. ఇటీవల. బండి సంజయ్ సమక్షంలో నిర్వహించిన. జిల్లా సమావేశంలో ఒకరి పై ఒకరు పిర్యాదు చేసుకున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోందట.. రాబోయే ఎన్నికలలో పార్టీకి ఒకరికి దక్కినా మరోక ఇద్దరు పార్టీ గెలుపు కోసం పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయట.. పార్టీలో మూడు ముక్కలాట పై కార్యకర్తల అందోళన చెందుతున్నారట..
.అసిపాబాద్ నియోజకవర్గం. అదివాసీల. కోట.. ఇక్కడ అదివాసీలు గెలుపు ఓటములను నిర్ణయిస్తారు..అదే సామాజిక. వర్గానికి చెందిన కోట్నాక విజయ్ కుమార్… బిజెపి నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు.. ప్రజల్లోకి వెళ్లుతున్నారు.. మద్దతు కూడగడుతున్నారు..విజయ్ కుమార్ కు పోటీగా లంబడా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అత్మరామ్ నాయక్ పోటి చేయడానికి తహతహలాడుతున్నారట.. గత ఎన్నికలలో పోటి అత్మరామ్ డిపాజిట్ దక్కలేదట…అయినప్పటికీ అత్మరామ్ తనకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారట. ఇద్దరు ఏవరో అభ్యర్థులు తెలియక కార్యకర్తలు అందోళనకు గురువుతున్నారట.. మరోక నియోజకవర్గం సిర్పూర్ టి నియోజకవర్గం,. ఈ నియోజకవర్గం లో పాల్వాయి హరీష్ బాబు ,కొత్తపల్లి శ్రీనివాస్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట… అయితే ఈ. ఇద్దరిమద్య. టిక్కెట్ సమస్యను బిజెపి పార్టీ పెద్దలు ఒప్పందం చేశారట… పాల్వాయి హరీష్ బాబుకు బిజెపి టిక్కెట్, కోత్త పల్లి శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని సయోధ్య కుదిర్చారట… ఒప్పందం ప్రకారం కొత్తపల్లి జిల్లా అధ్యక్ష పదవికి దక్కిందట…కాని కొత్తపల్లి బిజెపి టిక్కెట్ పై కన్నెశారట.. పాల్వాయి కి టిక్కెట్ దక్కకుండా ఎత్తుగడలు వేస్తున్నారట… అందులో బాగంగా కోత్త ప్రజల్లోకి వెళ్లుతున్నారట… కొత్తపల్లి అభ్యర్థి తనేనని ప్రజల్లోకి వెళ్లడం పై పాల్వాయి రగిలిపోతున్నారట…దీనిపై పార్టీ పెద్దలకు పిర్యాదు చేశారట…కొత్తపల్లిని దారికి తెవాలని కోరుతున్నారట.. ఒప్పందం ఉల్లంగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట…గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన కొత్తపల్లి కి డిపాజిట్ రాలేదు… కాని ఆ అసెంబ్లీలో ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి బారీ ఓట్లు సాదించారు… ఒకదశలో ఎమ్మెల్యే కోనప్పకు వణుకుపుట్టించారని ప్రచారం ఉందట.. బలమైన అభ్యర్థైనా పాల్వాయికి కొత్తపల్లి కావాలనే సమస్యలు స్రుష్టిస్తున్నారని పార్టీ పెద్దలు బావిస్తున్నారట.. అవసరమైతే కొత్తపల్లి పై చర్యలు తప్పవనే ప్రచారం నియోజకవర్గం లో జోరుగా సాగుతుందట…అయితే పార్టీలో టిక్కెట్ పోరు పై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట.. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పార్టీ కార్యకర్తలు పార్టీ పెద్దలను కోరుతున్నారట.. మరి పార్టీ పెద్దలు టిక్కెట్ల కోట్లాటలను ఏలా పరిష్కరిస్తారో చూడాలి