నిరుద్యోగులను సీఎంకేసీఅర్‌మోసం చేశారు.బండి

పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ విజయవంత మయ్యింది.స్దానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి క్లాక్లటవర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ,జితేందర్ రెడ్డి, పాల్గొనగా పార్టీ శ్రేణులు,నిరుద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు పాలమూరు నుంచే కేసీఆర్ కౌన్ డౌన్ ప్రారంభమయ్యిందని బండి సంజయ్ కుమార్ అన్నారు
ప్రభుత్వ నిర్లక్ష్యం, కేసీఆర్ కుటుంబం ప్రమేయంతో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.అతిక్ అహ్మద్ కంటే కేసీఆరే ప్రమాదమన్నారు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడన్నారుకేటీఆర్.. లీకువీరుడు..గ్రీకువీరుడని విమర్శించారు.కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలనినష్టపోయిన యువతకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ ఛేశారు

పాలమూరు యూనివర్సిటీ లో టీచింగ్,నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారుటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల పరిస్దితి అయోమయంలో పడిందని అన్నారు. కేసీఆర్ పాసుపోర్టుల బ్రోకరని ఆరోపించారు
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు

Leave A Reply

Your email address will not be published.