ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బ్యాంక్ అసిస్టేంట్ మేనేజర్

పోలీసులకు పిర్యాదు చేసిన బాదిత యువతి

యువతిని ప్రేమించాడు…పెళ్లి చేసుకుంటానని యువతిని ‌నమ్మించాడు..కామవాంచను తీర్చుకున్నాడు… గర్బవతిని చేశాడు.. ఆ తర్వాత గర్బాన్ని అబార్షన్ చేయించాడు .. ‌ పెళ్లిమాట అడిగితే కాదంటున్నారు.. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మోసం పై ఠానా మెట్లు ఎక్కింది‌‌‌ యువతి..న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాదిత యువతి.. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ విద్యాసాగర్ కీచక పర్వం‌పై ప్రత్యేక. కథనం

.. ఆదిలాబాద్ జిల్లా లో బ్యాంక్ అప్ బరోడా అసిస్టెంట్ ‌మేనేజర్ విద్యాసాగర్ బరితెగించాడు… బోథ్‌‌మండలం బాబర గ్రామానికి చెంది విద్యాసాగర్, అదే మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సరస్వతి ఇద్దరు బావ ,మరుదళ్లు.. ఆ బందంతోనే అసిస్టెంట్ మేనెజర్ విద్యాసాగర్ , సరస్వతి కి మాయమాటలు చెప్పాడు… పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు… ఆ. మాయ మాటలతో ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు.. కామవాంచను తీర్చుకుంటున్నాడు విద్యాసాగర్…2015నుండి శారీరకంగా వాడుకున్నాడు‌.‌ ..యువతిని గర్భవతి ని చేశాడు.. విషయం బయటకు తెలియకుండా అబార్షన్ చేయించాడు విద్యాసాగర్..

.. అయితే ఇక యువతి పెళ్ళి మాట ఎత్తితే మోహం చాటేస్తున్నాడు.. పైగా మరోక. యువతితో పెళ్లి ఒప్పందం చేసుకున్నాడు విద్యసాగర్ …పెళ్లి పత్రికలు కూడ పంచారు…‌ఈ. విషయం‌ తెలుసుకోని యువతి, ఆమే బందువులు విద్యాసాగర్ ప్రశ్నించారు.‌ తాను సరస్వతిని పెళ్లి చేసుకోనని తేగేసి చెప్పాడు అసిస్టెంట్ మేనేజర్ విద్యసాగర్, .. ఈ విషయం బయట పెడితే అంతుచూస్తామని బెదిరింపులకు దిగుతున్నాడు విద్యాసాగర్… విద్యసాగర్ మోసం పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో బాదితురాలు సరస్వతి, పిర్యాదు చేసింది… తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.. నమ్మించి మోసం చేసిన విద్యసాగర్ పై చర్యలు చేపట్టాలని సరస్వతి డిమాండ్ చేస్తున్నారు.

. ప్రేమించి మోసం చేసిన అసిస్టెంట్ మేనేజర్ విద్యాసాగర్ మోసం పై బాదితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. విచారణ చేపట్టారు… బాదితురాలికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడుతామని డిఎస్పీ ఉమేందర్ అంటున్నారు… ‌ మోసం చేసిన. విద్యాసాగర్ బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఆయన పై చర్యలు చేపట్టాలని ఉన్నాతాదికారులకు లేఖలు రాస్తామంటున్నారు డిఎస్పీ. .

Leave A Reply

Your email address will not be published.