ఓవైసీ ఇంటికి వస్తా‌…అస్సాం సీఎం హేమంత్ శర్మ

దేశంలో సీవిల్ కోడ్ తేస్తాము

కరీంనగర్ హిదూ ఏక్తాయాత్రలో తెలంగాణా ప్రభుత్వంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.సూర్యుడు ఉన్నంత వరకు హిందుత్వం, సనాతన ధర్మం ఉంటుందన్నా.ఓవైసీ హిందువులను నీవేం చేయలేవన్నారు.హిందువులు జాగృతం అయ్యారు
పదేళ్ళ క్రితం అయోధ్యలో రామ మందిరం అవుతుందని ఎవరూ అనుకోలేదు.కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తైంది .అదేవిదంగా370 ఆర్టికల్ పోతుందని ఎవరూ అనుకోలేదన్నారు. మోడి అర్టికల్ 370 తోలగించి సత్తా చాటారన్నారు.దేశం లో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుంది
భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందన్నారు
తెలంగాణలో రామరాజ్యం రాబోతుంది
అసోంలో 98 రూపాయలకే పెట్రోల్ వస్తుంది.. కాని తెలంగాణలో 108 రూపాయలు ఉందన్నారు

అసోంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుంది
తెలంగాణ లో ఒకటవ తారీఖున రాదన్నారు.50 వేల ఉద్యోగాలు కూడా తెలంగాణలో ఇవ్వలేదన్నారు
తెలంగాణ ప్రభుత్వం పేరు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందన్నారుఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు
బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే .బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుంది..కానిపాకిస్థాన్ పరిస్థితి చూడండి ..అద్వాన్నంగా ఉందన్నారు
హిందూ దేవుళ్ళను నమ్మని వారి పరిస్థితిని చూడండి.. వారి దుస్థితి చూడండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ నెంబర్ వన్ కాబోతుంది.మీరు ఒక్కసారి కేరళ స్టోరీ చూడాలి
హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా తయారు చేస్తారో చూపించారన్నారు లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను.ఆరువేల మదర్సాలనూ బంద్ చేయించాం
ఓవైసీ నన్ను చూసుకుంటా అని బెదిరించారు
వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తామన్నారు.ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను.. ఓవైసీ ఇంట్లో కి కూడా వస్తా ఏం చేస్తాడో చూడాలి
రజాకార్ రాజ్యం పోవాల్సిన అవసరం ఉంది
బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను తెలంగాణలో మార్పు వస్తుందని దీమాను వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.