కంది శ్రీనివాస్ రెడ్డి పై తిరుగుబాటు చేసిన కాంగ్రేస్ నాయకులు
కందితో కలిసేదిలేదంటున్నా సుజాత, సాజిద్ ఖాన్,సంజీవ్ రెడ్డి

కాంగ్రెస్ జెండా మోయలేదు….కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడలేదు.. సర్కార్ వైపల్యాల పై సమరం సాగించలేదు… అమెరికా నుండి వచ్చారు,.
..ఆదిలాబాద్ అడుగు పెట్టారు.. పార్టీ లో చేరి నెల దాటలేదు…కాని పార్టీ అభ్యర్థిని నేనుంటున్నారు ఎన్ అర్ ఐ కంది శ్రీనివాస్ రెడ్డి… పారా చ్యూట్ నాయకుని పై కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు.. కందితో కలవమంటున్నారు తిరుగుబాటు నాయకులు … పారాచ్యూట్ నాయకునికిపార్టీకి టిక్కెట్ ఇవ్వవద్దని తీర్మాణాలు చేస్తున్నారు.. ఆయనకు వ్యతిరేకంగా మేమే అభ్యర్థులమంటూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, నియోజకవర్గం ఇంచార్జ్ సుజాత. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ కోసం అమెరికా ఎన్ అర్ ఐ. కంది శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ నాయకుల మద్య టిక్కెట్ యుద్దం పై ప్రత్యేక కథనం
. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో చేరికలు చిచ్చు రేపుతున్నాయి… నాయకుల మద్య. టిక్కెట్ పోరు అగ్గిరాజేస్తోంది..ఇటీవల బిజెపి నుండి ఎన్‌అర్ ఐ కందిశ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరారు.. శ్రీనివాస్ రెడ్డి చేరిక ఆదిలాబాద్ నియోజకవర్గం లో కాంగ్రేస్ నాయకుల మద్య కుంపట్లను రాజేస్తోంది.
అయితే కంది శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక బలం ఉన్నా నాయకుడని…. ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకోవాలంటె ఆర్థికంగా బలమైన నాయకుడు అవసరమని పార్టీ లో కందిని పార్టీ లో చేర్చుకున్నారు.. పైగా టిక్కెట్ కూడ . కంది శ్రీనివాసరెడ్డి కి ఖారారైంది పార్టీలో జోరుగా ప్రచారం ఉంది…
కంది శ్రీనివాస్ పార్టీకి టిక్కెట్ ఖారారు చేస్తే ఒప్పుకోనేది లేదంటూ ఆపార్టీ నాయకులైనా మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి, గత. ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన సుజాత., డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ బహిరంగంగా పార్టీకి హెచ్చరికలు చేస్తున్నారు… మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి అల్లుడు సంజీవ్, లేదంటే గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ ముగ్గురిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు.. తమని కాదని కంది శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇస్తే ఊరుకోనేది లేదంటూ తిరుగుబాటు చేశారు
. కందిశ్రీనివాస్ రెడ్డి పై అసమ్మతి నాయకులు తిరుగుబాటు చేయడమే కాదు.. తామే అభ్యర్థులమంటూ సుజాత, షాజిద్ ఖాన్, సంజీవరెడ్డి గడగడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు… ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు..ఒకవైపు ప్రచారంనిర్వహిస్తున్నారు…మరోకవైపు కందిశ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ దక్కకుండా ఎత్తుగడలు వేస్తున్నారు… పార్టీలో చెరి నెల రోజుల గడవని కంది శ్రీనివాస్ ఏలా పార్టీ టిక్కెట్ ఇస్తారని పార్టీ పెద్దలకు పిర్యాదులు చేస్తున్నారట..ఎళ్లుగా పార్టీనినమ్ముకోని…పార్టీకోసంపనిచేస్తే తమకు టిక్కెట్ ఇవ్వకుండా ఎన్ అర్ ఐ. కంది శ్రీనివాస్ రెడ్డి ఇవ్వవద్దని పార్టీపెద్దలను కోరుతున్నారు…ఒకవేళ ఈ ముగ్గురిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వకుండా కంది శ్రీనివాస రెడ్డి కి టిక్కెట్ కేటాయిస్తే రెబల్ పోటీ చేయడానికి అసమ్మతి నాయకులు సిద్దమవుతున్నారని పార్టీలో చర్చ. సాగుతుందట.
ఈ ముగ్గురు అసమ్మతి నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తో కలసి పని చేయడం లేదు… దశాబ్ది దగా పేరుతో నిరశన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది.. కాని రెండు వర్గాలు విడిపోయి నిరశన ర్యాలీ నిర్వహించారు… డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, సుజాత, సంజీవరెడ్డి కలిసి ఒక నిరశన. ర్యాలీ నిర్వహించారు… ఎన్ అర్ ఐ కంది శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కలెక్టర్ వద్ద నిరశన కార్యక్రమం చెపట్టారు…ఒకే పార్టీ నాయకులు వేర్వేరుగా నిరశనలు చేపట్టడం విశేషం
ఈ అసమ్మతి కంది శ్రీనివాస్ రెడ్డి దడ పుట్టిస్తుందట. సోంత పార్టీ నాయకులే టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించడం చూసి అందోళన చెందుతున్నారట.. టిక్కెట్ గ్యారంటీ అని కాంగ్రెస్ లో చేరితే పార్టీ మారిన పలితందక్కడం లేదని భయపడుతున్నారట.. ఇప్పుడే అసమ్మతి ఇలా ఉంటే ఎన్నికల నాటికి మరింత ముదురుతుందని బావిస్తున్నారట.. ఒకవేళ. టిక్కెట్ దక్కినా సోంత పార్టీ నాయకులు ఓడిస్తారని అందోళన చెందతున్నారట…అయితే అసమ్మతి నాయకులను దారి తీసుకరావడానికి పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారట… ఆ మంతనాలతో అసమ్మతి రాజీకి వస్తార లేదో ఉత్కంఠ రేపుతోందట… మరి కంది మంతనాలతో అసమ్మతి నాయకులు దిగివస్తారో లేదో చూడాలి