మందుబాబులకు అడ్డగా మారిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్

బోథ్: ఒకప్పుడు బోథ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువులకు నిలయంగా మండలంలోనే ఏకైక కాలేజీ గా నిలిచింది అందులో విద్యను అభ్యాసించిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలిచి ఇటు కాలేజీకి ఉపాధ్యాయులకు మండలానికి గుర్తింపు తెచ్చిన విద్యార్థులు ఎందరో ఉన్నారు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను అభ్యాసిస్తూ గురువులను గౌరవిస్తూ ఉండేవారు దానితోపాటు ఇటు విద్యార్థులకు యువత క్రీడలు ఆడేందుకు క్రీడా నిలయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఒక్కటే ఉండేది ఆయా పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలను ఈ మైదానంలోని నిర్వహించేవారు యువకుల నుండి వయస్సు పైబడిన వారి సైతం వాకింగ్ రన్నింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకునేవారు సాయంత్రం వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా మైదానానికి వచ్చేవారు కాలం మారుతున్న కొద్ది జూనియర్ కాలేజ్ మారుతూ కొత్త భవనాల్లోకి వెళ్లిపోవడం జరిగింది దానితో ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండని విద్యార్థుల నుండి యువత వరకు సాయంత్రం వేళల్లో శిథిల వ్యవస్థ కు చేరుకున్న పూర్వపు కాలేజీలో మద్యం సేవిస్తూ సిగరెట్లు పొగ త్రాగుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు మైదానంలో ఎటు చూసిన సిగరెట్ డబ్బులు ప్లాస్టిక్ గ్లాసులు మందు సీసాలు దర్శనమిస్తున్నాయి సాయంత్రం వేళల్లో పోలీసు బృందాలు తనిఖీలు చేసి దొరికిన వారికి వార్నింగ్ ఇచ్చిన టైమింగ్ మార్చుకుంటున్న రే తప్ప వారి అలవాట్లు మానుకోవట్లేదు కాలేజీ నీ బార్ రెస్టారెంట్లుగా మార్చుకుంటు యువత చెడు అలవాట్లకు అలవాటు పడుతు తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకోవడమే కాకుండా కనిపెంచిన తల్లిదండ్రులను మోసగిస్తూ చెడు వ్యసనాలకు అద్దం పడుతున్నారు ఈ విషయమై పోలీస్ అధికారులు రాత్రి వేళలో వచ్చే వారిపై దృష్టి సారించినట్లైతే చెడు వ్యసనాల బారిన పడే వారిని కొంతవరకైనా తప్పించిన వారైతారు