మాస్టర్ ప్లాన్ లో వివాదస్పద రహదారి నిర్మాణం రద్దు
రైతులకు నష్టం చేసే రోడ్డును రద్దు చేస్తున్నాము...మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

అవి ముక్కారు పంటలు పండే భూములు.. ఆ పంటలతోనే రైతులకు సిరుల వర్షం కురుస్తోంది… ఆ సిరుల వర్షం కురిపించే భూములను మింగేందుకు మాస్టర్ ప్లాన్ రూపోందించారు మున్సిపల్ అదికారులు… ఆ ప్లాన్ తోనే పచ్చటి పంటపోలాల్లో రహదారులు నిర్మిస్తామంటున్నారు… రైతులకు దడపుట్టిస్తున్నారు…. భూములను మింగే మాస్టర్ ప్లాన్ పై రైతులు తిరగబడుతున్నారు… మున్సిపల్ అదికారులకు ముచ్చేటమలు పుట్టిస్తున్నారు…మాస్టర్ ప్లాన్ పై కర్షకుల. యుద్దంతో మున్సిపల్ అదికారులు మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గడానికి అదికారులు సిద్దమవుతున్నారా?..నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతుల. యుద్దంపై ప్రత్యేక కథనం
. నిర్మల్ పట్టణం అతివేగంగా అభివృద్ధి చెందుతున్నా పట్టణం.. 2011 జనాభా లేక్కల ప్రకారం94 వేల ఉంది..ఇప్పుడు ఆ జనాభా బారీగా పెరిగింది… ఆ పెరుగుతున్నా జనాభా కు అనుగుణంగా వసతులు కల్పించడానికి మున్సిపల్ అదికారులు మాస్టర్ ప్లాన్ రూపోందించారు.
..ఆ మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రైతులకు దడ పుట్టిస్తోంది…ప్రదానంగా మాస్టర్ ప్లాన్ లో బాగంగా మంచిర్యాల. రహదారి నుండి ఆదిలాబాద్ వెళ్లే పాత నలబై నాలుగ జాతీయ రహదారి వరకు వంద పీట్లతో రోడ్డు నిర్మిస్తామని ప్రతిపాదనలు సిద్దం చేశారు..
.ఈ. రహదారి బంగల్ పెట్, విశ్వనాథ్ పెట,నాయుడు పెటలో పచ్చటి పంటపోలాల. రహదారి నిర్మిస్తామని అదికారులు మాస్టర్ ప్లాన్ లో పోందుపరిచారు..ఇదే వివాదానికి కారణమైంది..ఈ. భూములన్ని వినాయక్ సాగర్ చెరువు క్రింద. ఉన్నా పచ్చటి పంటపోలాలు …ముక్కారు పంటలు పండుతాయి…అలాంటి అన్నం పెట్టే భూముల్లో వంద పీట్ల రోడ్డు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. తమ పంటపోలాల్లో రోడ్డు నిర్మిస్తే ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు.. ఇప్పటికే ఈ మార్గంలో వినాయక్ సాగర్ చెరువు కట్టపై రోడ్డు ఉంది..కావాలంటే అదికారులు ఆరోడ్డును విస్తరించాలని రైతులు కోరుతున్నారు.. కాని పంటపోలాల్లో రహదారి నిర్మిస్తామని ఓప్పుకోనేది లేదని రైతులు తిరుగుబాటు చేస్తున్నారు..వెంటనే ప్రతపాదన విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..
అయితే మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ వివాదం అగ్గిరాజేస్తుండటంతో అదికారులు అందోళన. చెందుతున్నారు..మరో కామారెడ్డి గా మారుతుందని భయపడుతున్నారు.. అందులో బాగంగా ప్రజల నుండి అభ్యంతరాలను మున్సిపల్ అదికారులు స్వీకరిస్తున్నారు…ప్రజలకు నష్టం చేసేవిదంగా ఏలాంటి చర్యలు ఉండవని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ రైతులకు భరోసానిస్తున్నారు… రైతుల పచ్చటి పంటపోలాల్లో నిర్మించే ఎనబై పీట్ల. రోడ్డునిర్మాణం ప్రతిపాదన విరమించకున్నట్లు ఆయన ప్రకటించారు… అదేవిధంగా పంటపోలాల మద్య నిర్మించాల్సిన. రహదారిని వినాయక్ సాగర్ చెరువు కట్ట పై విస్తరించి రోడ్డు నిర్మిస్తామన్నారు… ఈవిదంగా రోడ్డు నిర్మించడం వల్ల రైతులకు.నష్టం లేదన్నారు.. రైతులకు సంబంధించిన. ఇంచు భూమికోల్పోరని బరోసానిస్తున్నారు