నాటుపడవ పై పాఠశాలకు వెళ్లుతున్నా ఉపాద్యాయురాళ్లు

దశాబ్ద కాలంగా పడవ. పై పాఠశాలకు వెళ్లుతున్నా టీచర్లు

 

కీకారణ్యంలో నడుస్తున్నారు….. కోండలు ఎక్కుతున్నారు… బండలు దాటుతున్నారు సముద్రాన్ని మరిపించే నీటిలో పడవ పై ప్రయాణం సాగిస్తున్నారు…. ప్రమాదం అంచున నాటు పడవపై ప్రయాణం పై చేస్తున్నారు…పాఠశాలకు వెళ్లుతున్నారు…. విద్యార్థులకు అక్షరాల వెలగులు నింపుతున్నారుఆ. ఇద్దరు ఉపాద్యాయురాళ్లు…. పడవ పై ప్రయాణం సాగిస్తు విద్యార్థులకు బోదన చేస్తున్నా ఉపాద్యాయురాళ్ల పై ప్రత్యేక కథనం ‍..

కుమ్రంబీమ్ జిల్లా కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామం అత్యంత మారుమూల ప్రాంతం…ఈ గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం లేదు… పైగా‌‌ కొండప్రాంతం లో‌ఉన్నా గ్రామం… దీనికి తోడు ఎప్పుడు అడెం ప్రాజెక్టు వరదనీరు ఉంటుంది… గ్రామానికి వెళ్లాలంటే గోదావరిని మరిపించే వరద నీటిలో పడవపై ప్రయాణం తప్పదు..

 

. ఈ గ్రామంలో ప్రాథమిక. ఉన్నత పాఠశాల ఉంది.. అట్టడగు వర్గాల సంబంధించిన పిల్లలు బడిలో చదువుకుంటున్నారు.. కాని పాఠాలు బోదించడానికి సర్కార్ ఉపాద్యాయులు నియమిస్తే… పడవ పై సాహస. ప్రయాణం చేయలేక… బడి మోహం చూడకుండా బదిలీ పై వెళ్లారు ఉపాద్యాయులు.

కాని ఆ ఇద్దరు ఉపాద్యాయురాళ్లు విద్యార్థులకు విద్యను అందిస్తున్నా సంకల్పం..ప్రపంచానికి స్పూర్తినిస్తోంది. ఆ ఇద్దరు ఉపాద్యాయురాళ్లే రజిత,శిరిష… వీరిద్దరు కుమ్రంబీమ్ జిల్లా కేంద్రానికి చెందినవారు… వీరిని ఇందాపూర్ పాఠశాలలో బోదన చేయడానికి అదికారులు నియమించారు…

వాయిస్ ఓవర్.. రోడ్డు లేని ప్రాంతం… వాహనాలు రాని ప్రాంతం… కోండలు, కోనలు ఉన్నా ప్రాంతం.. ఇవన్ని ఒక ఎత్తైతే గోదావరి లాంటి అడ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో ఉంటుంది… బ్యాక్ వాటర్ తోడు ఉద్రుతంగా ప్రవాహించే. వాగు ఉంటుంది..ఈ ప్రాంతం సముద్రంలా ఎడాదిపాటు నీటితో కనిపిస్తోంది… బడికి వెళ్లడానికి నీటిని దాటాలి.. ఈ అడ్డంకుల వల్ల
ఉపాద్యాయురాళ్లు అడగు వెనక వేయలేదు..

.. నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడానికి పడుతున్నా తపన అంత ఇంతకాదు… కుమ్రంబీమ్ జిల్లా కేంద్రం నుండి ప్రతినిత్యం విద్యార్థులకు విద్యను అందించడానికి పాఠశాలకు వస్తున్నారు ‌.. పాఠశాలకు రావడమంటే మాటలు కాదు…. బస్కేక్కి బడి స్టాప్ దిగే పరిస్థితులు లేవు.. బస్సులు రావు… రోడ్లు లేవు… అతికష్టం మీద. జిల్లా కేంద్రం నుండి కెరమెరి మండలం దనోరా గ్రామానికి చేరుకుంటున్నారు… అక్కడి నుండి ఇందాపూర్ వెళ్లాలి…ఈ మార్గంలో కోండలు ఉన్నాయి…. అటవీ జంతవులు ఉన్నాయి…ఈ కోండలు కోనలు మద్య. ప్రయాణం సాగిస్తున్నారు.. గోదావరిని మరిపించే నీటి వద్దకు చెరుకుంటున్నారు శిరిష, రజిత. ఉపాద్యాయురాళ్లు..

. ఇక్కడ నుండి ఇందాపూర్ బడికి వెళ్లాలంటే నీటిలో ఆర కిలోమీటర్ ‌నాటు పడవ పై ప్రయాణం…. ప్రాణాలు అరచేతి ఉపాధ్యాయురాళ్లు నాటు పడవపై ప్రయాణం సాగిస్తు‌న్నారు… ఈ. ప్రయాణం సహసంతో కూడుకున్నా ప్రయాణం… ‌ముప్పై‌ నుండి నలబై పీట్ల వరకు లోతు నీరు ఉంటుంది… ఆ నీటిలోనే పడవలో ప్రయాణం సాగిస్తున్నారు… కుండపోతగా వర్షం కురిసినా పడవపై ఎదురీదుతూ బడికి వస్తున్నారు… కుటుంబ సభ్యులు నాటు పడవ పై ప్రయాణం వద్దన్నారు..‌సహ ఉపాధ్యాయులు హెచ్చారించారు.. కాని నిరుపేద విద్యార్థులకు బోదచేయాలనే సంకల్పంతో పడవపై ప్రయాణం చేస్తూ పాఠశాలకు వెళ్లుతున్నామంటున్నారు ఈ. ఉపాద్యాయురాళ్లు

 

 

..పడవ. ప్రయాణం తర్వాత. ఈ. ఇద్దరు ఉపాద్యాయురాళ్లు పాఠశాలకు వెళ్లుతున్నారు..విద్యార్థులకు అధ్బుతమైన బోదన చేస్తున్నారుశిరిష, రజిత ఉపాద్యాయురాళ్లు… తమకు బోదన చేయడానికి పడవలో ప్రాణాలకు తెగించి వస్తున్నా ఉపాద్యాయురాళ్లను విద్యార్థులు అభినందిస్తున్నారు విద్యార్థులు… తాము కూడ ఈ ఉపాద్యాయరాళ్లను స్పూర్తిగా తీసుకోని ఎదుగుతామంటున్నారు.. అయితే ఉపాద్యాయురాళ్లు ప్రాణాలు తెగించి.. పాఠశాలకు వస్తే… పాఠశాలలో సమస్యలు ఇబ్బంది గా మారాయి.
.పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.
కాని సమస్యలను పరిష్కరించడం లేదని వాపోతున్నారు విద్యార్థులు అధ్యాపకులు, విద్యార్థులు‏

.

Leave A Reply

Your email address will not be published.