పేపర్ లీకేజీలో నా తప్పేం లేదు..హరీష్

డిబార్ ఎత్తివేయాలని పరీక్ష కేంద్రానికి వచ్చిన తల్లి , కోడుకు హరీష్

హన్మకొండ

పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసు ఓ విద్యార్థి నా ఆవేదనతో ఆందోళనకు గురి చేస్తోంది. కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనతో ఐదేళ్ళు డిబార్ అయిన దండెబోయిన హరీష్ భవిష్యత్తుకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థి హరీష్ తో పాటు తల్లి లలిత పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని డిబార్ ను ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటిపర్యంతమై అధికారులను వేడుకున్నారు.

హన్మకొండ జిల్లా కమలాపుర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థి హరీష్ నుంచి శివ అనే బాలుడు రెండు రోజుల క్రితం హిందీ ప్రశ్నాపత్రం లాకెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కేసు సంచలనంగా మారి బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు పది మంది పై కేసు నమోదు చేశారు. డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసి ఇన్విజిలేటర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థి హరీష్ ను ఐదేళ్ళు డిబార్ చేశారు. డిబార్ అయిన హరీష్ ఈరోజు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు.
పరీక్ష రాస్తున్న సమయంలో హఠాత్తుగా తాను కూర్చున్న కిటికీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి క్వశ్చన్ పేపర్ అడిగాడు తను ఇవ్వనని చెప్పాను కొంత సమయం గడిచాక వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడనుకుని క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి ఆన్సర్ పేపర్ పై మార్జిన్ కొట్టుకుంటుండగా మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ప్రశ పత్రం లాక్కుని ఫొటో తీసుకుని మళ్ళీ పేపర్ నావైపు విసిరాడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు లేకుంటే చంపుతామని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంత వరకే తనకు తెలుసని ఆతరువాత ఎం జరిగిందో తనకు తెలియదని విద్యార్థి హరీష్ అంటున్నాడు. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి సెంటర్ వద్దకు రాగానే డిఈఓ హాల్ టికెట్ తీసుకుని సంతకం తీసుకున్నాడని ఎందుకు సంతకం తీసుకున్నారని అడిగితే హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఐదేళ్ళు డిబార్ చేశామని తెలిపారని అన్నారు. తనకు తెలియకుండా జరిగిన తప్పుకు శిక్ష వేయడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు నేను బలి అయ్యానని, నా భవిష్యత్తు ను నాశనం చేయొద్దని శనివారం జరిగే గణితం పరీక్షకు అధికారులు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు .

హరీష్ తోపాటు తల్లి లలిత సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నా కొడుకు భవిష్యత్తు తో ఆడుకోవద్దని వేడుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరో చేసిన తప్పును నాకొడుకు శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కష్టం చేసుకుని బ్రతికే కుటుంబం మాది ఏంజెపి గురుకుల్ పాఠశాలలో హాస్టల్ లో చదివిస్తున్నామని, న్యాయం చేయాలని విద్యార్ధి తల్లి కోరుతుంది. ఎవరో చేసిన తప్పిదానికి విద్యార్థి డిబార్ కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

….

Leave A Reply

Your email address will not be published.