మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్నారు

సీఎం కేసీఅర్ తీరు పై మండిపడిన. జూపల్లి , పోంగులేటి

రాష్ట్రంలో  ప్రజాస్వామ్యం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావ్…కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంకు జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు…వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పై ఎవరు వచ్చిన బాగా రిసీవ్ చేసుకునే వారు..ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు..తిండి లేకున్న ఉండవచ్చు కాని ఆత్మ గౌరవం లేని చోట ఉండలేమన్నారు..

బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ లక్ష్యం నెరవేరడం లేదన్నారు…ముఖ్యమంత్రి అంటే ట్రస్టి అనే విషయాన్ని మరిచిపోయి నాది అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు..తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే, అవమానించే కార్యక్రమం నడుస్తుందన్నారు…
బిఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలన్నారు జూపల్లి…తెలంగాణలో మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం , అప్పులో కూరుకు పోయిందన్నారు…పేపర్ లీకేజీలులో ప్రభుత్వం బాధ్యత వహించాలని..దళిత బంధు అంశంలో ప్రజలను మభ్య పెట్టడం సరైంది కాదన్నారు..

..బిఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని కేసిఆర్ కలలు కంటు..స్వార్థం కోసం పార్టీ పేరు మార్చుకున్నారన్నారు..ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు..అనేక మంది తల్లి తండ్రులు కాయ కష్టం చేసి చదివిస్తే , మంత్రుల పిఎ ల ద్వారా లీకులు చేయించి, సిట్ అనే ఇంటి సంస్థ ను దర్యాప్తు చేయమని నియమించారని ఫైర్ అయ్యారు…కవితను కేసు నుంచి విడిపించేందుకు వాదించేందుకు న్యాయ వాదులకు ఫీజులు చెల్లించడానికి డబ్బులున్నాయి కాని మైనారిటీ రిజర్వేషన్ కోసం వాదించే న్యాయవాదికి చెల్లించడానికి డబ్బు లేదా ..?
అని ప్రశ్నించారు… రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని ముఖ్యమంత్రి తెలుసుకోవాలని…ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఒక్కటయ్యేందుకు కొత్తగూడం సమ్మేళనంలో బీజం పడిందన్నారు..కొత్తగూడెం నియోజక వర్గం శ్రీనన్న పెద్ద కొడుకు లాగా ఉంటాడని…చందాలు , దందాలు చేసే వారు ఉమ్మడి జిల్లాలో ఉండబోదన్నారు..ఇల్లందు  ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , తండ్రి , భర్త ఖబ్జాలు చేస్తున్నారన్నారు..ప్రజలకు అన్యాయం చేస్తే నిరహార దీక్ష చేస్తానన్నారు…అధికారం ఎవరబ్బ సొత్తు కాదని..అధికారులు తొత్తులుగా మారితే ఎవ్వరిని వదలమన్నారు

Comments are closed.