బోథ్ బిఅర్ ఎస్ లో ముదిరిన వివాదం

ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఎంపిపి తుల శ్రీనివాస్ పోటాపోటీ సమావేశాలు

 

 

అత్మీయతలేదు…అనుబందం లేదు… పార్టీలో ఐక్యత లేదు… ఎమ్మెల్యే ఒంటేద్దు పోకడలపై స్థానిక ప్రజాప్రతినిదులు తిరుగుబాటు చేస్తున్నారు… ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోటీగా అత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు… పార్టీ పాతరేసే నాయకుడు మాకు వద్దంటున్నారు… ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై స్థానిక ప్రజాప్రతినిదులు తిరుగుబాటు చేయడానికి కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో అగ్గిరాజేస్తున్నా అత్మీయ సమ్మెళనాల పై ప్రత్యేక కథనం

. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో అత్మీయ సమావేశాలు పార్టీ లో కుంపట్లు రాజేస్తున్నాయి.. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై సోంతపార్టీ ప్రజాప్రతినిదులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు..అ అసమ్మతే రోజురోజుకు ‌ముదురుతోంది.. .

. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానిక ప్రజాప్రతినిదులకు సమాచారం ఇవ్వడం లేదని …పైగా ఆయన అదిపత్య. దోరణి పై నిరశిస్తూ బోథ్ లో ‌మండలానికి సంబంధించిన. ఇరవై ఆరు మంది సర్పంచ్ లు, ఎంపిపి తులశ్రీనివాస్ అధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహంచారు..అక్కడే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధ్వర్యంలో బిఅర్ ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రజలకు భరోసా సమావేశాన్ని నిర్వహించారు… ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి హజరుకాకుండా ఎంపిపి అద్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం విశేషం.. ఈ సభకు బారీగా ప్రజలు హజరయ్యారు .. సమావేశంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజాప్రతినిధులు. ‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీరు పై తుల శ్రీనివాస్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు.. పార్టీ సమావేశాల. పై తమకు సమాచారం ఇవ్వడం లేదని అందోళన వ్యక్తం చేశారు..‌ ఎనిమిదవ తారీఖు సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించి..‌ తీరా తాము తోమ్మిది తారీఖున. సమావేశం ఏర్పాటు చేసుకుంటే … అదే రోజు అత్మీయ సమ్మెళనం సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు.

.. అదేవిధంగా తాము నిర్వహించే సమావేశ. మందిరానికి తాళం వేయించారని… అదేవిధంగా బైక్ ర్యాలీ నిర్వహించకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని తుల శ్రీనివాస్ ఆరోపించారు‌..ఇవన్ని ఒక ఎత్తేతే.. ఎమ్మెల్యేకు సంబందించిన అనుచరులు దళిత బందు, డబుల్ బెడ్,దళిత బస్తీలో నిరుపేదల నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఎంపిపి ఆరోపించారు…వీటి పై తమవద్ద ఆదారాలున్నాయంటున్నారు‌‌… తాము పార్టీకి వ్యతిరేకం కాదంటున్నారు‌. పార్టీని ప్రజల్లో పలుచనచేస్తున్నా వారికి వ్యతిరేకమంటున్నారు… అందుకే పార్టీని బలోపేతం చేయడానికి సమావేశాలు నిర్వహిస్తూ సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతామంటున్నారు ఎంపిపి

 

. తిరుగుబాటుదార్లు పోటీగా సమావేశం నిర్వహిస్తుండటంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి దీటుగా అత్మీయ. సమ్మెళనానికి బారీగా డ్వాక్రా మహిళలను తరలించారు.. పరువుపోకుండా కాపాడుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిరుగుబాటదార్లు చేస్తున్నా ఆరోపణలను ఖండించారు.. పార్టీలో ఒకరిద్దరు అసంత్రుప్తితో ఉన్నారు …తప్ప అందరు తనతో పాటు ఉన్నారని…తిరుగుబాటుదార్లను తక్కువగా చూపించే ప్రయత్నం చేశారు.. తన అనుచరులు ఏవరు సర్కారు సంక్షేమ పథకాలలో డబ్బులు తీసుకోలేద‌ని ఎంపిపి చేస్తున్నా ఆరోపణలను ఎమ్మెల్యే కోట్టిపారేశారు

 

.. అయితే సమావేశానికి హజరైనా ఇంచార్జ్ ఎమ్మెల్సీ వీ .జీ .గౌడ్ తిరుగుబాటుదార్లకు హెచ్చరికలు జారీ చేశారు.. ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశాలను గుర్తిస్తామన్నారు.. ఇతరులు నిర్వహించే సమావేశాలకు గుర్తింపు లేదన్నారు.. చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కారిస్తామన్నారు..‌అందరు ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేయాలని సూచించారు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నా తెలంగాణ ఉద్యకారుడు శ్రీహరి రావు ఆరోపణలను పార్టీ పరిశీలిస్తుందన్నారు.. సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ…

 

Leave A Reply

Your email address will not be published.