డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నా తల్లులు

మంచిర్యాల మాత శిశు అసుపత్రిలో ఐసీయులో ఎసీలు లేక ఇబ్బందులు పడుతున్నా రోగులు

. రోజుకు ముప్పై డెలివరీలు.. గర్బీణీ మహిళలు చికిత్స కోసం వందల్లో వస్తున్నారు. కాని వైద్యం అందించేది .ఇద్దరే డాక్టర్లు..డాక్టర్లు లేక. పురుడు కోసం తల్లులు తల్లడిల్లుతున్నారు…‌ వైద్యం కోసం రోజుల తరబడి నిరిక్షిస్తున్నారు.. అంతేకాదు సర్కార్ ఆసుపత్రిలో సౌలతులు సున్నా… ఐసీయూలో ఎసీలు లేవు. ఉన్నా ప్యాన్ లు తిరగడం లేదు… రోగులే ఉక్కపోతకు తట్టుకోలేక రోగులే ప్యాన్లు తెచ్చుకుంటున్నారు.. మంచిర్యాల మాతశిశు కేంద్రం లో రోగుల. కష్టాల పై కథనం

. ‌మంచిర్యా జిల్లా కేంద్రంలో ‌మాత శిశు కేంద్రం ఉంది… ఈ ఆసుపత్రిలో డెలివరీలకోసం, గర్బణీ మహిళలు ప్రతినిత్యం రెండు వందల మంది వస్తున్నారు… కుమ్రంబీమ్ జిల్లా , మంచిర్యాల. ప్రాంతాల‌నుండి మహిళలు వైద్యం కోసం వస్తుంటారు.. వచ్చే మహిళలు నిరుపేదలే ఉన్నారు..

. మాత శిశు కేంద్రంలో అద్వాన్నమైన. వసతులు ఉన్నాయి… అసుపత్రిలో డెలివరీలు చేయడానికి , గర్బీణి మహిళలకు వైద్యం అందించడానికి ఉండాల్సిన. డాక్టర్లు ఐదుగురు..‌కాని కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు..ఈ ఇద్దరు డాక్టర్లు వైద్యం గర్బిణి ‌మహిళలకు డెలివరీలు చేస్తున్నారు.. గర్బిణి మహిళలకు వైద్యం అందిస్తున్నారు.. ఇద్దరు డాక్టర్లు ఉండటం వల్ల. మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ఒకవైపు గర్బీణీ మహిళలకు పరీక్షలు చేయడం, ఇంకోవైపు డెలివరీ చేయడం, మరోకవైపు రకరకాల. సమస్యలతో వచ్చే మహిళలకు వైద్యం అందించడం వైద్యులకు బారంగా మారింది.

డాక్టర్ల కోరత వల్ల రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ‌ప్రదానంగా డెలివరీ కోసం వచ్చే మహిళలు సకాలంలో వైద్యం అందక. ఇబ్బందులు పడుతున్నారు… గంటల కోద్ది పరీక్షలు, డెలివరీలు అలస్యమవుతున్నాయని వాపోయారు.. పురుడు కోసం తల్లడిల్లుతున్నా పట్టించుకునే వాళ్లు కరువ్యయారని వాపోతున్నారు…అదేవిధంగా గర్బీణీ మహిళలు చెకప్ కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్నామని అందోళన వ్యక్తం చేస్తున్నారు… ప్రదానంగా కుమ్రంబీమ్ , మంచిర్యాల జిల్లాల దూరప్రాంతాల నుండి వచ్చిన మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామంటున్నారు

…ఒకవైపు డాక్టర్ల కోరతతో పురుడు కోసం అవస్థలు పడుతూ పుట్టేడు దుంఖంతో తల్లడిల్లతున్నారు… పోని డెలివరైనా మహిళలకు అసుపత్రిలో కనీస. వసతులు లేవు..‌ సర్జీల తర్వాత. మహిళలను ఐసియు కేంద్రాలకు తరలిస్తారు… ఇక్కడే తల్లి బిడ్డ ఉంటారు.. కాని ఐసి యూ కేంద్రంలో ఎసీలు లేవు.. గత వర్షకాలంలో‌ బారీ వర్షాలకు మాతశిశు కేంద్రం నీటిలో‌మునిగిపోయింది‌. అప్పుడు ఎసీలు తీసేశారు‌‌.. కాని ఇప్పటి వరకు ఎసీలు లేవు.. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి.. కాని ఎసీలు లేక. నవజాత శిశువులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.. ఉక్కపోత వల్ల రోగాల బారిన పడుతున్నామంటున్నారు మహిళలు… ‌ ఐసీయులో ఎసీలు లేకపోవడమే కాదు.. జనరల్ వార్డులో ప్యాన్లు తిరగడం లేదు.‌ దాంతో రోగులే ఇంటి వద్ద నుండి ప్యాన్లు తెచ్చుకుంటున్నారు‌‌ .. ప్యాన్లు తిరగనందు వల్లనే ప్యాన్లు ఇంటి తెచ్చుకుంటున్నామన్నారు మహిళలు… అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న బోజనం నాసిరకం ఉంది.. ఈ నాసిరకం బోజనం తప్పని పరిస్థితులలో తింటున్నామంటున్నారు రోగులు

Leave A Reply

Your email address will not be published.