అంగన్ వాడిలలో వసూళ్ల దందా

టీచర్లు, ఆయాల నుండి నెలనెలా మాముళ్లు తీసుకుంటున్నా ఐసీడిఎస్ అదికారులు

. ఐసిడిఎస్ అదికారుల వసూళ్ల దందా… నెల నెల ముడుపులు వసూళ్లు చేస్తున్నారు… ఇస్తేనే ఉద్యోగం… ఇయ్యకపోతే ఉద్యోగం ఊడుతుందనే బేదిరింపులు.. ఆ భయంతోనే అంగన్ వాడీలు టీచర్లు , ఆయాలు లంచాలు చెల్లిస్తున్నారు.. లంచాలు వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నా అదికారులేవరు?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐసిడిఎస్ అదికారుల వసూళ్ల దందా పై ప్రత్యేక కథనం

 

.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐసిడి ఎస్ అదికారుల అవినీతికి అదుపు అడ్డులేకుండా పోయింది. .. అంగన్ వాడి కేంద్రాలలో చిన్న పిల్లలకు , గర్బీణీ మహిళలకు , బాలింతలకు పోషకాహారం, పనితీరును పరిశీలించాల్సిన ఐసిడిఎస్ అదికారులు .. వాటిని పక్కన పెట్టారు.. వసూళ్ల. దందాకు పాల్పపడుతున్నారు..

.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ అదికారుల. అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయింది.. అంగన్ టీచర్లు, ఆయాల నుండి మాముళ్లు వసూళ్లకు పాల్పడుతుండటం తీవ్రమైన చర్చనీయాంశంగా ‌మారింది..‌ఇటీవల. మామడ మండలం నందుర్తి గ్రామంలో అంగన్ టీచర్లు, ఆయాలు సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా టీచర్ల నుండి ప్రతి నెల నాలుగు వందల యాబై రుపాయలు, ఆయాల నుండి రెండు వందల. యాబై రుపాయలు వసూలు చేశారు.. అదే సమావేశానికి హజరైనా అదికారికి అక్కడే సిబ్బంది ముట్టజెప్పారు.

 

… ఇలా అంగన్ వాడీ సిబ్బంది నుండి ముడుపులు తీసుకోవడం… ఈ.ఒక మండలానికి పరిమితం కాదు… మిగతా మండలాల్లో ‌ అండగోలుగా వసూలు చేస్తున్నారు.. ఒక్కో టీచర్ నుండి వేయ్యి రుపాయలు,‌ఆయాల నుండి ఐదు వందల రూపాయలు ఐసిడి ఎస్ అదికారులు ముడుపులు పుచ్చుకుంటున్నారు.. ఐసిడిఎస్ సీడిపిఓలు, సూపర్ వైజర్లు వసూళ్లకు పాల్పడిన వాటిలో జిల్లా స్థాయి అదికారులకు వాటాలు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా అంగన్ వాడి టీచర్, ఆయాలు డబ్బులు ఇవ్వకపోతే.. ఆ డబ్బులు ఇవ్వని కేంద్రాలకు వెళ్లి ఐసిడిఎస్ అదికారులు తనిఖీలు చేపడుతున్నారు..చిన్న తప్పు ఎదైనా దోరికితే వారి పై చర్యలు తీసుకుంటున్నారు ఐసిడిఎస్ అదికారులు‌.చర్యల్లో బాగంగా ఉద్యోగాల నుండి తోలగించిన సందర్బాలు కూడ ఉన్నాయి… ఇలా లూటీల దందాకు పాల్పడిన అదికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

 

..అయితే వసూళ్ల దందా పై సీడీపీఓ సరిత స్పందించారు.. తాము ఎవరి వద్ద నెలనెల మాముళ్లు తీసుకోవడం లేదని‌..ఆరోపణలు కోట్టిపారేశారు…కొందరు మామడ మండలాన్ని ఖానాపూర్ ప్రాజెక్టు నుండి తోలగించి. నిర్మల్ ప్రాజెక్టు లో కలపడానికి డబ్బులు వసూలు చేశారని తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. కాని తాము నెల మాముళ్లు తీసుకోలేదన్నారు.. అయితే కొందరు మామడ మండలంలో పనిచేస్తున్నా వాళ్లు స్థానికంగా ఉండటం లేదన్నారు..అలాంటి అంగన్ వాడిటీచర్లు ఆరోపణలు చెస్తున్నారని సీడిపీఓ సరిత అగ్రహం వ్యక్తం చేశారు..

 

Leave A Reply

Your email address will not be published.