కమలం పార్టీ సమావేశంలో కోట్లాట

కుర్చీలు, ఇటుకరాళ్లు విసురుకున్నా కార్యకర్తలు

…. ముథోల్ కమలంలో ముదురుతున్నా విబేదాలు… నియోజకవర్గంలో ‌ పార్టీ సమావేశాలు సమరాన్ని మరిపిస్తున్నాయి… స్వంత పార్టీ నాయకులే సమావేశాల్లో కుర్చీలు గాల్లో విరుగుతున్నారు… ఇటుక రాళ్లతో ప్రత్యర్థుల్లా దాడులు చేసుకుంటున్నారు…. పార్టీ పరువునుబజారుకీడ్చుకుంటున్నారు. .. టిక్కెట్ కోసమే ఒక వర్గం…మరోక వర్గం‌ పై దాడులు చేస్తుందా?… ఒకరి పై ఒకరు అదిపత్య. దండయాత్రలు చేస్తున్నాదేవరు?మథోల్ కమలం పార్టీ అగ్గిరాజేస్తున్నా విబేదాల పై ప్రత్యేక కథనం

..‌ ముథోల్ నియోజకవర్గం లో కలిస్తేచాలు కలబడుతున్నారు… ప్రత్యర్థిల్లా దాడులు చేసుకుంటున్నారు.. నిర్మల్‌ ముథోల్ నియోజకవర్గం లో తానూత్ ‌మండల కేంద్రం లో బిజెపి నాయకులు మోహనరావు పటేల్ అధ్వర్యంలో సర్కార్ వైపల్యాలపై ప్రజలను చైతన్యంచేయడానికి సమావేశాన్ని నిర్వహించారు.. సమావేశానికి ముఖ్య. అతిథులుగా జాతీయ బీసీ కమీషన్ మెంబర్ తల్లోజీ అచారీ, ఎంపి సోయంబాపురావు హాజరయ్యారు… పార్టీ పటిష్ఠత కోసం నిర్వహించిన సమావేశంలో గోడవకు దారి తీసింది… ఆ. గోడవే సమావేశం ‌ముగిసిన. కోద్ది సేపట్లో ‌నే పరస్పరం దాడులు ‌ చేసుకున్నాయి…‌సమావేశంలో కుర్చీలను ఒకరి పై ఒకరు విసురుకున్నారు…ఈ సందర్భంగా కుర్చీలు ఇరిగిపోయాయి…. కోందరు కుర్చీలతో దాడులు చేసుకుంటే మరికోందరు ఇటుకరాళ్లు విసిరారు… పరస్పరం కుర్చీలు, ఇటుకరాళ్లతో దాడులు చేసుకోవడంతో‌ దాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది..‌యుద్దాన్ని ‌మరపించింది ..ఈ దాడులలో కోందరికి గాయాలయ్యాయి.. వందల. కుర్చీలు ఇరిగిపోయాయి… భయంతో కోందరు పరుగులు తీస్తూ పారిపోయారు

. అయితే నియోజకవర్గం లో మూడు గ్రూపులు ఉన్నాయి… వీటిలో జిల్లా అద్యక్షురాలు రమాదేవి, ఇటీవల కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిలో రామరావు పటేల్ , మరోకరు మోహన్ రావు పటేల్ ఉన్నారు… ఈ ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు… కాని మాటలు లేవు, పలకరింపులు లేవు‌.. ఒకరు సమావేశం నిర్వహిస్తే మరోకరిని ఆ సమావేశాలకు పిలువరట.. బద్ద శత్రువులకన్నా ఎక్కువగా వీరి మద్య విబేదాలు ఉన్నాయట.. ఆ విబేదాలే పార్టీ కోంపలు‌ముంచుతున్నాయట

. ఈ‌‌ ముగ్గురు టిక్కెట్ పోటీపడుతున్నారు… పైగా తామే అభ్యర్థలమంటూ ప్రచారం చేస్తున్నారు… గ్రామాల్లో ప్రజల మద్దతు కూడగడుతున్నారు….ఏవరి వర్గం వారు… తమ. వర్గాన్ని బలపేతం చేసుకుంటున్నారట… ఈ ప్రక్రియలో బాగంగా ఒక వర్గం నుండి మరోక వర్గంలోకి చెర్చుకుంటున్నారట….ప్రదానంగా రామరావుపటేల్ బిజెపి లో చేరిన తర్వాత రమదేవి వర్గంలోని కోందరు రామారావు పటేల్ వర్గంలో చేరారట… రమాదేవి కూడ. రామరావు పటేల్ తన వర్గంలో చెర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట..‌ మోహన్ రావు పటేల్ కూడ నియోజకవర్గం లో పట్టుసాదించడానికి సోంతంగా ఎత్తుగడలు వేస్తున్నారట…అందులో బాగంగా తనవర్గాన్ని పెంచుకోవడానికి దర్నాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారట..

..ఈ. ముగ్గురి మద్య అదిపత్య పోరే… పార్టీ సమావేశాలు కోట్లాటకు వేదికలు అవుతున్నాయని ప్రచారం ఉంది.. ఒక. వర్గం సమావేశాలు నిర్వహిస్తే…‌మరోక దూరంగా ఉంటుంది… దూరంగా ఉండటమే కాదు… బలగం పెంచుకుంటున్నా నాయకులను సోంత పార్టీ నాయకులే బలహీనం చేస్తున్నారట.. ‌అవసరమైతే సమావేశాలలో ‌
అలజడులు స్రుష్టించి పరువులు తీసుకుంటున్నారట.. ముగ్గురు ఒకరిని బలహీనం చేసుకుంటూ పార్టీనిబలహీనంచేస్తున్నారట.. విబేదాలు ఇలా కోనసాగితే పార్టీ మునగడం ఖాయమని కార్యకర్తలు అందోళనచెందుతున్నారట… మరి పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చెపడుతారో లేదోచూడాలి

Leave A Reply

Your email address will not be published.