అర్టీఎ కార్యాయలంలో పెక్ డ్రైవింగ్ పరీక్షల దందా
చలనా నిర్వహించకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నా అర్టీఎ అదికారి

…నిర్మల్ అర్టీ ఎ కార్యాలయం లో అక్రమాల. జాతర…పెక్ డ్రైవింగ్ పరీక్షలు…చాలనా చెల్లింపులు. లేవు… సర్కారు పారదర్శకత లేదు…అంత అడ్డగోలు దోపిడీ దందా…. ఎజెంట్ల మాపియాదే రాజ్యం. ఆ మాపియాతోనే అదికారులు కుమ్మక్కయ్యారు… దోపిడి దందాసాగిస్తున్నారు… వాహనదారులను లూటీ చేస్తున్నారు.. నిర్మల్ అర్టీఎ కార్యాలయం లో పేక్ డ్రైవింగ్ పరీక్షల దందా పై ప్రత్యేక కథనం
.. నిర్మల్ అర్టీఎ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది….దోపిడీ దందాకు అడ్డులేదు… అదుపులేదు.. సర్కారు పారదర్శకతకు అణువుంత ఉండదు.. అంత ఎజేంట్ల కనుసన్నలో జరుగుతోంది .. ఇక్కడ రవాణా శాఖ అదికారిగా ఎం విఐ అజయ్ కుమార్…ఈ అదికారి జిల్లా రవాణా శాఖఅదికారి… ఎంవిఐ, ఎఎంవిఐ కూడ లేరు. అన్ని విదులు ఈ ఇతను నిర్వహిస్తుండటం విశేషం
. అర్టీఎ. కార్యాలయం లో డ్రైవింగ్ తీసుకోవాలంటే వాహనదారులు..మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి.. శ్లాట్ బుక్ చేసుకోవాలి..అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం పదమూడు వందలు ముప్పై ఐదు రూపాయలు చాలనా తీసి చెల్లించాలి..కాని నిర్మల్ అర్టీఎ.కార్యాలయం లో ఇదేమి ఉండదు… చాలనా తీస్తారు… డబ్బులు చెల్లించరు… కాని డబ్బులు చెల్లించకున్నా .. ,పెక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అదికారులు.
.అయితే సాదారణంగా స్లాట్ బుక్ చేసిన. తర్వాత. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తుదారు అర్టీఎ కార్యాలయానికి చేరుకుంటారు..అక్కడ. చాలానా కట్టిన వ్యక్తికి కౌంటర్ రిసిప్ట్ ఇస్తారు.. రిసిప్ట్ ఇవ్వడమంటే చాలనా డబ్బులు కట్టారని అర్థం..అప్పుడు మాత్రమే డ్రైవింగ్ పరీక్షను నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి..
..కాని నిర్మల్ అర్టీఎ. కార్యాలయం లో దరఖాస్తు చేస్తున్నా ప్రజలకు కౌంటర్ రిసిప్ట్ ఇవ్వడం లేదు… పైగా చాలానా చెల్లింపులు వ్యక్తులకు పెక్ డ్రైవింగ్ పరీక్షలు చేయడం నిబంధనలకు వ్యతిరేకం. పైగా పెక్ పరీక్షలలో దరఖాస్తు చేసుకున్నా పెయిల్ చేస్తున్నట్లు అర్టీఓ. ఆ పైల్ పై రాస్తున్నారు..
.ఈ పెయిల్ పరీక్షల వెనుక అర్టీఎ అదికారులకు ఓ లేక్క ఉంది… పెయిలైనా వాళ్లు దరఖాస్తుదారులు బ్రోకర్ ను ఆశ్రయిస్తున్నారు… అప్పడు వాళ్లు చెప్పినంతా డబ్బులు ముట్టజెప్పుతున్నారు… ప్రదానంగా ఒక. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎనిమిది వేల. నుండి పదివేల వరకు ఎజేంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు… ఆ డబ్బులు చెల్లిస్తే డ్రైవింగ్ డ్రైవింగ్ పరీక్షకు వెళ్లకుండానే డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసేన్స్ లు పోందుతున్నారు..ఎజెంట్ల ద్వారా డ్రైవింగ్ దరఖాస్తు చేసిన యువకుడు రాథోడ్ ఇదే విషయాన్ని తెలిపారు…
. అయితే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నా పెక్ పరీక్షల దందా పై సాక్షి టీవీ ఆదారాలు సేకరించింది.. .. .బండారం బయటపడుతుందని ఎంవిఐ. ఉల్కిపడ్డారు.. విషయం బయట పోక్కకుండా సాక్షిటీవీతో బ్రుందంతో అజయ్ కుమార్ బేరసారాలకు దిగారు.. ఆ బేరసారాలకు లోంగలేదు… అడుగు వెనుక అడుగు లేదు..ఈ అక్రమాల దందా బయటకు పడకుండా ఉండేందుకు ఎజేంట్ల బ్రుందం పై బెదిరింపులకు దిగింది… అయినా వినలేదు.. ఆతర్వాత ఎజెంట్ల దందా బయట పెట్టవదని ఎజెంట్లు వేడుకున్నారు..
.. ఎంవిఐ. అజయ్ కుమార్ చలానా కట్టకుండా,పెక్ పరీక్షలు నిర్వహిస్తున్నారని… అదేవిధంగా కౌంటర్ రిసిప్టులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు.. క్రిందిస్థాయి సిబ్బంది అలా చేస్తున్నారని తనకు సంబందం లేదన్నారు.. పైగా కౌంటర్ రిసిప్ట్ ఇవ్వని విషయాన్ని అంగీకరించారు.. చలానా కట్టని వాటిపై ఎందుకు పెయిల్ అని రాయడం తప్పుకదా అంటే…తప్పే… అన్ని అన్ని చోట్ల చేస్తున్నారని అందుకే తాను చేస్తున్నారని బుకాయించడం విశేషం.…. పెక్ డ్రైవింగ్ పరీక్షలతో బరి తెగించి వసూళ్ల పాల్పపడుతున్నా అర్టీఎ అదికారుల పై ప్రజలు మండిపడుతున్నారు..పెక్ డ్రైవింగ్ పరీక్షలు దందా నడిపిస్తున్నా అదికారుల పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.