బాసర ట్రిపుల్ ఐటికి సౌర కాంతులు!
దేశంలో తోలి గ్రీన్ యూనివర్సీటీగా ట్రిపుల్ ఐటి

..బాసర ట్రిపుల్ ఐటికి సౌర. కాంతులు…. ఆ. సౌర కాంతులతో కరెంట్ కోతలు ఉండవు.. అణా పైసా విద్యుత్ బిల్లులు ఉండవు… దేశంలో కరెంట్ బిల్లులు లేని తోలి యూనివర్సిటీగా ట్రిపుల్ ఐటి.... అంతేకాదు బాసర ట్రిపుల్ ఐటి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాదు… ఉత్పత్తి చేసిన విద్యుత్ ను అమ్మకానికి సిద్దమవుతోంది… బాసర. ట్రిపుల్ ఐటిలో సౌర విద్యుత్ వెలుగుల పై ప్రత్యేక కథనం
.. నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీ ఉంది..ఈ. యూనివర్సిటీ లో తొమ్మిది వేల. మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు…. ఇక్కడే విద్యార్థులకు పాఠాలు. బోధించడానికి అకాడమి బ్లాక్స్, హాస్టల్స్, , విద్యార్థులకు బోదన అందించే అద్యాపకులకు వసతి సముదాయాలు ఉన్నాయి..
వీటన్నింటికి విద్యుత్ వినియోగం తప్పనిసరి…త్రాగునీరు, కోసం,ల్యాబ్ ల కోసం, రాత్రిపూట క్యాంపస్ లో హైమస్ లైట్లు విద్యుత్ ను వినియోగిస్తున్నారు.. ప్రతి నెల వచ్చే.ఆ విద్యుత్ బిల్లే ట్రిపుల్ ఐటికి దడపుట్టిస్తోంది.. లక్ష కాదు… రెండు లక్షల కాదు నెలకు నలబై లక్షల. బిల్లు వస్తోంది.. ఆ బిల్లు ట్రిపుల్ ఐటికి బారంగా మారుతోంది…దీనికి తోడుకరెంట్ కోతలు… కరెంట్ కోతల వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కరెంటు కోతల వల్ల విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు.. పైగా పరీక్షల. సమయంలో కరెంటు కోతల తో చదువులు సరిగా సాగడం లేదని వాపోతున్నారు.
.. అయితే కరెంట్ కోతలవల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు…మరోవైపు విద్యుత్ బిల్లులు ట్రిపుల్ ఐటికి బారంగా మారుతున్నాయి… ఎటా ఐదు కోట్ల బిల్లులు కట్టడం ఇబ్బందిగా మారింది..
.. అయితే కరెంట్ కష్టాలకు, బిల్లుల బారానికి చెక్ పెట్టాలని అదికారులు నిర్ణయింవారు… అందులో బాగంగా ట్రిపుల్ ఐటిలో సౌర విద్యుత్ ను వినియోగించడానికి ప్రణాళికలు సిద్దం చేశారు.. ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును సింగరేణి కార్పొరేట్ సోషల్ రేస్పాన్స్ బులిటీ క్రింద మంజూరు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సిఎస్ అర్ పండ్ తొ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అద్వర్యంలో ని రెడ్ గో సంస్థతో వారం రోజులలో ఒప్పందం చేసుకుంటామని ట్రిపుల్ ఐటి వీసీ వెంకటరమణ అన్నారు..
…. బాసర. ట్రిపుల్ ఐటి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి విశాలమైన స్థలం ఉంది…అక్కడే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సౌర పలకలు ఏర్పాటు చేస్తామన్నారు… ఒకవేళ స్థలం సరిపోకపోతే ఇటీవల నీటి పై పలకలు ఏర్పాటు చేసుకునే టెక్నలాజి అందుబాటులోకి వచ్చిందని అన్నారు వీసీ… ఆ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ట్రిపుల్ ఐటిలో చెరువులో నీటి పై పలకలు ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటున్నారు …సోలార్ పలకలు నీటిలో ఏర్పాటు చేయడమే కాదు… భవనాల పై , పలకలు, అదేవిధంగా కోన్ని షేడ్ల పై రేకులు ఉన్నాయి…ఆ రేకులను తోలగించి సోలార్ రూప్ వాల్ ఏర్పాటు చేస్తామంటున్నారు
.. ఈ విదంగా సోలార్ విద్యుత్ ను కోద్ది రోజులలో ఉత్పత్తి చేసి… యూనివర్శిటీ కి ఉపయోగిస్తామంటున్నారు అదికారులు.. సోలార్ విద్యుత్ తో అణా పైసా బిల్లు ఉండదంటున్నారు.. ఈవిదంగా బాసర ట్రిపుల్ ఐటి కి సరిపడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసి సర్కారు విద్యుత్ ను అమ్ముతామంటున్నారు వీసీ… సోలార్ విద్యుత్ వినియోగంలోకి వచ్చే తోలి గ్రీన్ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటి అవుతుందని వీసీ వెంకటరమణ. ఆనందంవ్యక్తం చేస్తున్నారు..