స్వచ్ఛత పక్వాడ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బెల్లంపల్లిG ఏరియా జిఎం జి.దేవేందర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా సోమవారం గోలేటిలోని సింగరేణి హై స్కూల్ విద్యార్థులకు స్వచ్ఛత అంశంపై వ్యాసరచన,క్విజ్ పోటీలను నిర్వహించారు.అనంతరం స్కూల్ ఆవరణలోని పరిసరాల్లో చెత్తను తొలగించారు.విజేతలకు జిఎం చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఉంటుందని జూనియర్ ఫారెస్ట్ అధికారి నవీన్ తెలిపారు.కార్యక్రమంలో స్కూల్ ఇంచార్జి హెచ్ఎం ఆర్ల రెడ్డి,ఉపాద్యాయులు లావణ్య,కవిత తదితరులు పాల్గొన్నారు .