టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి చేసిన ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి కలకలం రేపుతోంది… మందమర్రి సోమగూడేం సమీపంలో టోల్ ప్లాజా ఉంది.. ఈ‌‌టోల్ ప్లాజా సిబ్బంది పై ఎమ్మెల్యే చిన్నయ్య దాడి చేశారు.. ఆ దాడికి సంబంధించిన. విజువల్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి..

ఓవర్…మంచిర్యాల. నుండి నిన్న రాత్రి బెల్లంపల్లికి వస్తున్నారు… ఇదే సందర్బంలో టోల్ ప్లాజా సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి దారి‌ క్లియర్ చేయలేదు. దాంతో అగ్రహంతో ఊగిపోయారు… తన వాహనానికి దారి క్లియర్ చేయరా అంటూ ఎమ్మెల్యే చిన్నయ్య వాహనం దిగారు…. అక్కడే సిబ్బంది పై ఎడపేడా వాయించారు‌ ఎమ్మెల్యే … ఆ సిబ్బంది దాడి చేయడంలో ఒక్కసారిగా ఉల్కిపడ్టారు‌…. వదలకుండా దాడి చేస్తుండటంతో అక్కడి నుండి సిబ్బంది పారిపోయారు.. అకారణంగా టోల్ సిబ్బంది పై ఎమ్మెల్యే దాడి చేయడంపై ఇతర సిబ్బంది ఆయన పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ‌ సిబ్బంది పైదాడి చేసిన ఎమ్మెల్యే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

. టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి పై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు.. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు.. కాని. టోల్ వసూలు చేస్తున్నారని… దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు…అసంపూర్తిగా పనులు చేసి టోల్ ఏలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.. ఈ ఆంశాలపై టోల్ నిర్వహకులతో మాట్లాడితే పట్టించుకోవడం లేదన్నారు… అందువల్లనే అక్కడికి వెళ్లానంటున్నారు ఎమ్మెల్యే.. కాని దాడి చేయలేదంటున్నారు ఎమ్మెల్యే… దాడి చేసిన విజువల్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి…వాటిని ఎమ్మెల్యే బుకాయిస్తున్నారు…

‌తరచుగా దాడులకు, బేదిరింపులకు పాల్పపడుతున్నా ఎమ్మెల్యే పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..‌గతంలొ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారు..టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి చేసిన. ఎమ్మెల్యేపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.