హోలి బూడిదకు కాపలాకాస్తున్నా అదివాసీలు
పక్క గూడాల వాళ్లు ఎత్తుకవెళ్లుతారనే భయం

. అది కాముని బూడిద…బుక్తినిస్తోందని… ప్రాణాలు మింగే రోగాలను పాతరేస్తుందని….ఆ మహిమ గల. బూడిద దోపిడీ దోంగల పాలు కాకుండా గిరిజనుల కాపలా.. రాత్రిపూట బూడిదకు కాపలా కాస్తున్నా గిరిజనులు..కాముని బూడిదకు ఎలాంటిమహిమలు ఉన్నాయి కాముని బూడిదకు అదివాసీల. కాపలాపై పైప్రత్యేక కథనం
.ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీలు హోలి పండుగను పవిత్రమైన పండుగా బావిస్తారు… రంగుల హోలికి ముందు రోజు కామదహనం చేస్తారు..ఈ సందర్భంగా అటవీ ప్రాంతం నుండి వేదురు బోంగులను తేస్తారు.. ఆ బోంగులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఆనంతరం ప్రతిఇంటి నుండి కుడకలను సేకరిస్తారు…… కుడకల సేకరణలో సందర్భంగా ఏవరైనా కుడకలు స్వచ్చందంగా ఇవ్వకపోతే వారు గూడేంలో లేనట్లుగా బావిస్తారు.. ఆ కుటుంబం జనాబా లేక్కల్లో లేనట్లుగా బావిస్తారు గిరిజనులు … కుడకల సేకరణ పూర్తైనా తర్వాత బూరేలు, నైవైద్యం తీసుకోని ఊరేగింపుగా ఊరి బయటకు వస్తారు.. అక్కడే వేదురు బోంగులకు ఉల్లిగడ్డలి కట్టి మాథై,మాథురిగా బావించే బోగులను దహనం చేస్తారు అదివాసీలు.
కాముని దహనం తర్వాత బూడిదను పవిత్రమైనదిగా బావిస్తారు.ఆ. బూడిదకు మహిమలు ఉంటాయి నమ్మకం… అంత్యంత. మహిమగల. బూడిదని చోరికి గురికాకుండా గూడేంకు చెందిన వాళ్లు బూడిద వద్ద కాపలా కాస్తారు.. రాత్రి అక్కడే పడుకోని ఉండి అదివాసీలు కాపలా కాస్తారు.. ఒకవేళ ఇతరులు బూడిదను దోంగిలిస్తే… గూడానికి అరిష్టం జరుగుతుందని నమ్మకం… అందువల్ల పక్క గూడేం వాళ్లు చోరికి పాల్పపడకుండా కాపలా కాస్తున్నామని అంటున్నారు
…తెల్లవారిన తరువాత ఉదయం పూట బూడిదకు మళ్లీ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఆనంతరం డబ్బు వాయిద్యాల మద్య. బూడిదను గూడానికి తీసుకవస్తారు..బూడిదను అందరికి పంచుతారు.. ఇంటి ద్వారాజ ముందు బూడిదతో బందనం చేస్తారు….ఈ విదంగా బందనం చేయడం వల్ల తమ ఇంటివైపు దుష్టశక్తులు రావంటున్నారు గిరిజనులు.. అదేవిధంగా బూడిద రోగాల బారిన పడినప్పుడు చల్లు కోవడం . రోగాలు మాటుమాయం అవుతాయంటున్నారు.. అదేవిధంగా ఆ బూడిద వల్ల తమకు సిరులు పంటలు పండి అష్ట ఐశ్వర్యాలు లబిస్తాయని జంగు పటేల్ విశ్వసాన్ని వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు..