ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు టిక్కేట్ భయం?
ఆ నియోజకవర్గాలకు రావడానికి మోహం చాటేస్తున్నా మంత్రులు

.. ఆ. ఇద్దరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ల టేన్సన్ దడపుట్టిస్తోంది.. పార్టీలో అసంత్రుప్తి అగ్గిరాజేస్తోంది..ప్రజావ్యతిరేకత. అవినీతి అరోపణలు ఎమ్మెల్యేల కోంపముంచుతుందా?. ఆ ఎమ్మెల్యేలను పార్టీ పక్కన పెట్టిందా…. నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఖారారు చేసిందా? మరి ఆ అభ్యర్థులేవరు..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ గుబులు పైప్రత్యేక కథనం
. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టిక్కెట్ టేన్షన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. వీరిద్దరు 2014, 2018 ఎన్నికలలో విజయం సాదించారు..మళ్లీ ముచ్చట గా మూడోసారి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు..
. కాని ఈ ఇద్దరి ఎమ్మెల్యేల పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. ప్రదానంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ పై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందట… అవినీతి , అక్రమాలు అమెకు మచ్చగా మిగిలాయట.. ఆ వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్యేకు టిక్కేట్లు ఇస్తే పార్టీ మునగడం ఖాయమని సర్వేలో తెలిందట.. అదేవిధంగా పార్టీ నాయకులు సైతం ఎమ్మెల్యే పై పిర్యాదులు చేశారట..
ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి అక్రమాలతో పాటు పార్టీలో అమె పై తీవ్రమైన అసంత్రుప్తి ఉందట.. ప్రదానంగా జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్థన్, ఎమ్మెల్యే రేఖనాయక్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేదాలు ఉన్నాయట..కనీసం ఇద్దరు ఒకే వేదికపై ఉన్నా పలకరించుకోలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీల నాయకుల్లా పగలు ఉన్నాయట.. నాయకులే కాదు ఎమ్మెల్యే ఒంటేద్దు పోకడలతో కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారట… దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్ వ్యతిరేకత స్థాయికి మించదట.. ఇలాంటి పరిస్థితులలో పార్టీ టిక్కెట్ ఇచ్చిన. గెలువడం సాద్యం కాదని తెలిందట..
.. ఖానాపూర్ నియోజకవర్గం తో పాటు… పార్టీబాగ వెనుకబడిన నియోజకవర్గం బోథ్..ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా రాథోడ్ బాపురావు రెండు సార్లు విజయం సాదించారు…కాని పార్టీ పై పట్టులేదట..ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందట.. అదేవిధంగా సర్కారు పథకాలైనా , అభివృద్ధి పథకాలైనా ఎమ్మెల్యేకు ముడుపులు ముడితేనే కదులుతాయట… లేదంటే అంతేసంగతులట…ఇలాంటి ప్రచారంతో ఎమ్మెల్యే పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందట… దీనికి తోడు పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పై వ్యతిరేకంగా ఉన్నారట.. అదేవిధంగా మాజీ ఎంపి నగేష్ తో బద్ద వైరం ఉందట.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గోనడం లేదట… ఒకవేళ. రాథోడ్ బాపురావుకు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చిన బాపురావు ఓడించడానికి నగేష్ ఎన్నికలలో బరిలో దిగుతారని నియోజకవర్గం లో జోరుగా ప్రచారం సాగుతుందట…
…అయితే ప్రజావ్యతిరేకత, అవినీతి అక్రమాలలో ప్రజల్లో పలుచనైనా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, రాథోడ్ బాపురావు ను పార్టీ పక్కన పెట్టిందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుందట.. అందుకే ఇటీవల మంత్రి కేటీఅర్ పర్యటన ఖారారైంది.. ఈ నెల ఇరవైనా పర్యటిస్తారని ..అభివ్రుద్ది పనులు ప్రారంభిస్తారని జోరుగాప్రచారం చేశారు..కాని మంత్రి ఖానాపూర్ పర్యటనకు రాలేదు.. అదేవిధంగా బోథ్ లో ఈనెల ఇరవై రెండున. మంత్రి హరీష్ రావు పర్యటిస్తారని… అదేవిధంగా అసుపత్రి పనులు ప్రారంభించడంతో పాటు… సభకు హజరవుతారని బహిరంగ సభను ఏర్పాటు చేశారు..కాని మంత్రి పర్యటనకు హజరుకాలేదు.. రెండు నియోజకవర్గాలలో కీలకమైన మంత్రులు కేటీఅర్ , హరీష్ రావు పర్యటనకు రాకుండా మోహం చాటేశారు…
దాంతో ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ పక్కన పెట్టందనే ప్రచారం సాగుతుందట… పైగా రెండు నియోజకవర్గాలలో ప్రత్యమ్నాయ అభ్యర్థులను ఎంపిక. చేసిందని పార్టీలో చర్చసాగుతుందట… ఖానాపూర్ అభ్యర్థి మంత్రి కేటీఅర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ కు టిక్కెట్ ఖారారైందట. ఇతను కేటీఅర్ తో పాటు డిగ్రీ చదువుకున్నా సమయంలో క్లాస్ మేట్… అదేవిధంగా అమెరికాలో కేటీఅర్ రూమ్ మేట్ కావడం విశేషం… వీటన్నింటికి తోడు ఐటికంపేనీలు ఉన్నాయట.. అర్థిక బలమైనా కావడంతో అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ను ఖారారు చేశారని పార్టీ వర్గాలలో చర్చసాగుతుందట..బోథ్ లో కూడ బాపు రావు పై వ్యతిరేకత ఉండటంతో అదివాసీ నాయకుడు మాజీ ఎంపి నగేష్ పేరును పార్టీ ఖారారు చేసిందని ప్రచారం ఉంది… ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో నగేష్ ను ఎంపిక చేశారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతుందట… సీఎం కేసీఆర్ ఎన్నికల. ప్రచారంనిర్వహించడానికి నగేష్ కు సంకేతాలు ఇచ్చారట… అయితే అభ్యర్థుల ఖరారు సీట్టింగ్ ఎమ్మెల్యేలు రేఖనాయక్ , రాథోడ్ బాపురావు కు వణుకు పుట్డిస్తుందట.… కాని ఇదంతా పుకార్లేనని ఎమ్మెల్యేలు కోట్టిపారేస్తున్నారట.. ఆరునూరైనా ఎన్నికల బరిలో నిలిచేది తామేనని వీరు సన్నిహితులకు చెప్పుకుంటున్నారట..మరి ఈనియోజకవర్గాలలో గులాబి పార్టీ టిక్కేట్లు ఏవరికి దక్కుతాయో చూడాలి