రేవంత్ కు పోటీగా బట్టి విక్రమార్క పాదయాత్ర

ఆదిలాబాద్ జిల్లా పిప్రి నుండి ఈనెల. పదహరు నుండి భట్టి పాదయాత్ర

..దళిత, గిరిజన నియోజకవర్గాల పై  గురిపెట్టిన. కాంగ్రెస్… ఈనియోజక వర్గాలలో  బలం లేదు…బలగం లేదు… నాయకులు లేరు…నాయకత్వ లేదు..ఈ. ప్రాంతాలలో కదలని కాంగ్రెస్ ను  కదలించే  భట్టి   విక్రమార్క    పాదయాత్రకు  సిద్దమవుతున్నారు….. రేవంత్     పాదయాత్ర కు  పోటీగా నిర్వహిస్తున్నాభట్టి  పోరుయాత్ర కు  యాత్రకు జనం పోటేత్తుతారా..   అదివాసీ బిడ్డలు, దళిత. వర్గాలు   కాంగ్రేస్ ను అదరిస్తారా?… యాత్రకు  జనసమీకరణ. సవాలుగా  మారుతుందా?  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  సీఎల్పీ నాయకుడు   భట్టి పాదయాత్ర  పై ప్రత్యేక కథనం

.

  తెలంగాణ. కాంగ్రెస్  లో‌‌‌  మరో పాదయాత్ర… ఇప్పటికే    రేవంత్  రెడ్డి పాదయాత్ర సాగుతోంది.. ములుగు  నుండి   ప్రారంభమైన రేవంత్    పాదయాత్ర జోరుగా సాగుతోంది‌‌… రేవంత్  పాదయాత్రకు ప్రజల నుండి   ‌ మంచి స్పందన లబిస్తోంది…  యాత్రలో రాహుల్   గాందీ   హథ్ సే హథ్     ఆశయాలను,   తెలంగాణ సర్కారు  వైపల్యాలను  ప్రజల్లోకి  తీసుకవెళ్లుతున్నారు..  పార్టీకి    పాదయాత్ర ఊపునిస్తోంది… పార్టీ బలాన్ని    పెంచుతోంది..

  • .  అయితే     రేవంత్    పాదయాత్ర కు  కాంగ్రెస్ పోటీగా  మరో  పాద యాత్ర చేయడానికి  సీ ఎల్పీ నాయకుడు భట్టి  సిద్దమయ్యారు…అందులో బాగంగాబ   ఆదిలాబాద్ జిల్లా బజరాత్నూర్  మండలం   పిప్రి  గ్రామం   నుండిఈ నెల పదహరు నుండి   పాదయాత్ర చేస్తానని  ఆయన ప్రకటించారు …  భట్టి    పాదయాత్ర. బోథ్    నియోజకవర్గం .పీప్రీ గ్రామం ‌ నుండి ప్రారంభమై  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని  ఖానాపూర్,  అసిపాబాద్,  బెల్లంపల్లి,  మంచిర్యాల.   , చె‌న్నూర్   నియోజకవర్గాల మీదుగా     భట్టి పాదయాత్ర. నిర్వహించనున్నారు..తోంబై   ఒకటి   రోజుల పాటు    పదమూడు వందల. ఆరవై ఐదు  కిలోమీటర్ల. దూరం పాదయాత్ర చేయనున్నారు..  ఉమ్మడి ఆదిలాబాద్   భట్టి  పాదయాత్ర నిర్వహించే  నియోజకవర్గాలలో ‌ బోథ్, ఖానాపూర్,  అసిపాబాద్   నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్ డు  నియోజక వర్గాలు..  అదేవిధంగా బెల్లంపల్లి,  చెన్నూర్ , నియోజకవర్గాలు  ఎస్సీ  రిజర్వుడ్   నియోజకవర్గాలు కావడం   విశేషం…ఒక్క. మంచిర్యాల తప్ప…    అన్ని నియోజకవర్గాలు  రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి… ఆరు నియోజకవర్గాలలో ఐదు  నియోజకవర్గాలు  దళిత,గిరిజన వర్గాలు   ప్రాబల్యం ఉన్నా నియోజకవర్గాలే   కావడం విశేషం

… అయితే    సీఎల్పీ నాయకుడు  దళిత  సామాజిక  వర్గాలకు     చెందిన నాయకుడు…. . ఆ సామాజిక వర్గాలలో మంచి గుర్తింపు ఉంది.. పార్టీకి   దూరమైనా  దళిత, గిరిజనులను   కాంగ్రెస్ కు దగ్గర చేర్చడానికి  ..వారి మద్దతుతో   అదికారంలో  రావాలని  కాంగ్రెస్ వ్యూహాన్ని రచించింది..ఆ. వ్యూహంలో    రిజర్వ్   నియోజకవర్గాలలో   పాదయాత్ర నిర్వహించనున్నారు భట్టి..

.. భట్టి పాదయాత్ర నిర్వహించే   నియోజకవర్గాలలో   కాంగ్రెస్  ఉనికి కరువైంది‌.‌ ప్రదానంగా గత. అసెంబ్లీ  ఎన్నికలలో   బోథ్   నుండి     కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా  సోయంబాపురావు పోటీ చేశారు…  ఆ ఎన్నికల్లో   ఓటమి    పాలయ్యారు… ఆ తర్వాత.   పార్టీ మారారు.. బిజెపి    తరపున ఎంపిగా  పోటి చేసి ఎంపి అయ్యారు… సోయం పార్టీ  మారిన తర్వాత.  పార్టీ ఉనికి కరువైంది.. సర్కారు   వైపల్యాలపై  పోరుకు   రాష్ట్ర   పార్టీ  పిలుపునిచ్చినా    నిరసన చేపట్టే లేని స్థితికి  కాంగ్రెస్ దిగజారింది.. అలాంటి   నియోజకవర్గం లో     భట్టి విక్రమార్క. పాదయాత్ర.  చేయనున్నారు..

.  బోథ్    కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ను అదివాసీ  నాయకుడు  వన్నేల     ఆశోక్ టిక్కేట్ ఆశిస్తున్నారు.. కాని   చుట్టం  చూపులా మంచిర్యాల నుండి రావడం  పోవడం తప్ప‌.. పార్టీ కోసంపనిచేయడంలేదు‌.‌అలాంటి   నాయకుడు పాదయాత్ర కు     జనసమీకరణ పై  చేతులు ఎత్తుతాడని  భట్టి వర్గీయులు భయపడుతున్నారు

.  ఈ.  ఒక్క నియోజకవర్గమే కాదు.. ఖానాపూర్ నియోజకవర్గం లో  కూడ. ఇదే పరిస్థితి ఉంది..  ఖానాపూర్ నియోజకవర్గం లో   ఉట్నూరు  మండలం నుండి చారులత.  కాంగ్రెస్ జడ్పీటీసీ గా గెలుపోందారు.. ఆ తర్వాత. జిల్లా పరిషత్    ఎన్నికలలో చారులత బిఅర్ ఎస్  ఓటు వేశారు.. ఇమే   పార్టీలో ఉంటారో…  ఊడుతారో అనే చర్చ కూడ సాగుతోంది…  అదేవిధంగా అదివాసీ నాయకుడు ఎడ్మా బోజ్జు ఉన్నా  రేవంత్ మద్దతు దారుడు…  భట్టి పాదయాత్ర కు  జనసమీకరణ. చేస్తారా లేదా  అసక్తికరంగా మారింది..లేదంటే  బోజ్జు  పాదయాత్రకు దూరంగా ఉంటారనే  చర్చసాగుతోంది. ఖానాపూర్   పాదయాత్ర. తర్వాత       ఆసిపాబాద్     నియోజకవర్గం లో   ప్రవేశిస్తుంది…   ఇక్కడ  కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపోందిన తర్వాత.  ఎమ్మెల్యే అత్రం  సక్కు  పార్టీ మారారు..  బిఅర్  ఎస్ లో  చేరారు.. దాంతో క్యాడరంతా   ఆయనతోపాటు బిఅర్ ఎస్ లో చేరారు.. ఈ ‌నియోజకవర్గంలో     కాంగ్రెస్ నాయకత్వం   లేక    కార్యకర్తలు  తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు…  ఇటీవల.  అసిపాబాద్ మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి  పార్టీలో  చేరారు… సరస్వతీ     పాదయాత్ర జనసమీకరణ   చేస్తారో     లేదోననే భయం వెంటాడుతోంది… అసిపాబాద్      తర్వాత పాదయాత్ర. బెలంపల్లి నియోజకవర్గంలో లో   నిర్వహిస్తారు… ఇక్కడ. మాజీ మంత్రి  వినోద్   టిక్కెట్ ఆశిస్తున్నారు…  నియోజకవర్గం లో  మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్  సాగర్ రావు, వినోద్   వర్గాల ‌మద్య యుద్దం సాగుతోంది… ఎకంగా రెండు వర్గాలు పరస్పరం  దాడులు చేసుకుంటున్నాయి..ఈ పరిస్థితులలో   భట్టి  పాదయాత్ర కు   ప్రేమ్  సాగర్  రావు వర్గం సహకరించిన… వినోద్ వర్గం ఏ మేరకు సహకరిస్తుందనేది          అసక్తి రేపుతోంది.. బెల్లంపల్లి  నుండి పాదయాత్ర. మంచిర్యాల నియోజకవర్గం లో ప్రవేశిస్తోంది‌..‌ఇక్కడే  సభను నిర్వహిస్తామని   భట్టి  ప్రకటించారు..మంచిర్యాల   నియోజకవర్గం నుండి ‌మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్  సాగర్  రావు టిక్కెట్  ఆశిస్తున్నారు.. పైగా   ప్రేమ్ సాగర్ రావు  భట్డి వర్గానికి చెందినవారిగా గుర్తింపు పోందారు…ఆయన పై     బారం వేసి  సభను  నిర్వహిస్తున్నారు… ఈ సభను     రేవంత్   సభలకు దీటుగా    నిర్వహించాలని  వ్యూహరచన. చేస్తున్నారు భట్టి..‌. బారీగా జనసమీకరణ  చేసి   పార్టీలో  రేవంత్  పై  అదిపత్యం చలాయించాలని  భట్టి బావిస్తున్నార‌ని  పార్టీలో  చర్చసాగుతోంది…

.మంచిర్యాల  సభ తర్వాత. చెన్నూర్ లో     పాదయాత్ర నిర్వహిస్తారు ‌.. చెన్నూర్ లో  మాజీ ఎమ్మెల్యే  ఓదేలు పార్టీ మారిన తర్వాత. పార్టీకి  నాయకుడు కరువయ్యారు..‌ ప్రేమ్ సాగర్ రావు  అనుచరులే  నాయకులుగా  కోనసాగుతున్నారు..ఈ  ప్రాంతంలో   పాదయాత్ర బారం   మోస్తారంటే  చెప్పలేని  పరిస్థితి ఉంది‌..దాంతో జనసమీకరణపై  అనుమానాలు వ్యక్తం  అవుతున్నాయి…  టీపీసీసీ అదినేత రేవంత్  దీటుగా ‌నిర్వహిస్తున్నా  పాదయాత్ర కు  జనసమీకరణ కరువైతే…   పార్టీ  పెద్దల వద్ద పరువుపోతుందని     భట్టి వర్గీయులు అందోళన చెందుతున్నారు…  ఆరునూరైనా రేవంత్    పాదయాత్రకు దీటుగా ‌   పాదయాత్రను   విజయవంతం చేయాలని  భట్టి విక్రమార్క అదేశాలు  జారీ వేశారు…మరి పోటీ యాత్రలలో ఏవరి  విజయం  సాదిస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.