జూనియర్ పంచాయితీ కార్యదర్శి అత్మహత్య

ఉద్యోగ భద్రత లేక. అత్మహత్యకు పాల్పపడిన సోని

వరంగల్ జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. సమ్మెను వీడి వీడి విధులకు హాజరైన ఖానాపూర్ మండలం కొత్తూరురంగాపురం జెపిఎస్ సోనీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కుటుంబకలహాలతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడమేనని భావిస్తున్నారు. సమ్మె చేస్తున్న జేపీఎస్ లు మాత్రం సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

నాలుగేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని ఎప్రిల్ 28 నుంచి జేపిఎస్ లు సమ్మె చేస్తున్నారు.‌ సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోగా విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో 11 రోజులు సమ్మెలో పాల్గొన్న వరంగల్ జిల్లా కొత్తూరురంగాపురం జేపిఎస్ సోని సమ్మేను వీడి విధులకు హాజరయ్యారు. నర్సంపేట లో నివాసం అంటే సోనీ విధులకు హాజరై రంగాపురం జిపిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్థానికులు నర్సంపేట ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయారు.‌ ఉద్యోగ భద్రత లేక ఆవేదనతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికతో ఉద్యోగం పోతే ఇంటికొసం తీసుకున్న 16 లక్షల హౌసింగ్ లోన్ ఈఎంఐ కి ఇబ్బంది ఏర్పడుతుందని సమ్మెను వీడి వీధులకు హాజరయ్యారని చెప్పారు.

సోనికి పెళ్ళై ఎనిమిదేళ్ళ పాప ఉంది.‌ అప్పు చేసి నర్సంపేటలో ఇల్లు నిర్మించుకున్న సోని సమ్మె చేస్తే ఉద్యోగం పోతుందని భావించి విధులకు హాజరైనప్పటికీ రెగ్యులరైజ్ కాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. ఉద్యోగ భద్రత లేక కుటుంబ సమస్యలు ఉత్పన్నమై సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. సోని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొకరు బలి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సోనీ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులతో పాటు జేపీఎస్ లు ఆరోపిస్తుండగా స్థానికులు మాత్రం కుటుంబ కలహాలు సైతం అందుకు కారణమని భావిస్తున్నారు. సోనీ ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలను వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.సమ్మె చేస్తున్న జేపీఎస్ లు సోనీ ఆత్మహత్యతో ఆందోళన మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు.
.

Leave A Reply

Your email address will not be published.