బిజెపికి బీసీ గర్జన నిర్వహించే హక్కులేదు.. ఎమ్మెల్యే రామన్న
బీసీలకుచట్ట సభలలో రిజర్వేషన్లు అమలు చేయాలి

ఆదిలాబాద్
దేశంలో అరవై కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, రాష్ట్ర బీజేపీ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీజేపీ నేతల వైఖరిపై ధ్వజమెత్తారు. దేశానికి బీసీగా ప్రధాని ఉండి బీసీలకు చేసిందేంటన్న ఆయన.. తొమ్మిదేళ్ల పాలనలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కల్పించిన హక్కులేంటని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి పంపినా ఇప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు.
60 కోట్ల మంది బీసీలు ఉన్న దేశంలో మంత్రిత్వ శాఖ ఎందుకు కేటాయించడం లేదన్నారు. 45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో బీసీలకు కేవలం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించడం దేనికి సంకేతమని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలను కేటాయించిందన్న విషయాన్నీ గుర్తు చేశారు. కర్ణాటకలో ఉచితలు ఇస్తామని ప్రకటించినా బీజేపీ ఓటమి చవి చూసిందని ఎద్దేవా చేశారు. కేంద్రం పెత్తనం వల్లనే జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు దక్కడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ తీసుకురావడం వల్ల ఎందరో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక జనం పార్టీ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, 294 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లు ప్రారంభించామన్నారు.
261 జూనియర్ కాలేజ్ లు, 16 డిగ్రీ కళాశాలలను స్థాపించామని, 1, 81, 880 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏడాదికి 880 కోట్ల ఖర్చు చేస్తున్నామని వివరించారు. కేవలం కల్యాణ లక్ష్మీ పథకం కింద 1800 కోట్లను ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కారేక్రమం లో .గ్రాంధాలయ చేర్మెన్ రౌతు మనోహర్. ఆత్మ చేర్మెన్ జిట్టా రమేష్,ఎంపీపీ గండ్రత్ రమేష్, వైస్ మార్కెట్ చేర్మెన్ బొమ్మ కంటి rరమేష్,వష్ ఎంపీపీ జంగు పటేల్, నాయకులు సేవ్వా జెగదీష్, గంగారెడ్డి.దివిటి రాజు తదితరులు పాల్గోన్నారు