విలపించిన.ఎమ్మెల్యే రాజయ్య

రాజకీయంగా వేదిస్తున్నారని బోరున విలపించిన రాజయ్య

జనగామ జిల్లా స్టేషన్ ఘపపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. కుమిలిపోతు తన బాధను చెప్పుకుంటు బోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రాజయ్య కొందరు రండా రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేస్ట్ టు పేస్ రాజకీయాలు చేయండి తాడోపేడో తెలుసుకుందామన్నారు. ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని, డైరెక్ట్ గా తనను ఎదుర్కోలేక కొందరు రండా రాజకీయాలు చేస్తు ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు.

ఎంతో ఆత్యాయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను మత కన్నెల చేతుల్లో వారి ఒళ్ళొ పెరిగినవాణ్ణి, ఆడవాళ్ళను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షి గా రాజయ్య ప్రతినభూనారు.

Leave A Reply

Your email address will not be published.