ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం..మంత్రి అజయ్

ప్రైవేటీకరణ అడ్డుకోని తీరుతాము

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలో బీఅర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్    పాల్లోన్నారు..ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడారు సింగరేణి తెలంగాణ హక్కన్నారు ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని   హెచ్చరించారు.వెంటనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని   డిమాండ్ వేశారు..లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు…135 ఏళ్ల లో సింగరేణిని ఎప్పుడు నష్టాల్లో చూడలేదన్నారుబోనస్ లు ఇస్తు సింగరేణి కార్మికులను కంటి కి రెప్పలాగా చూసుకుంటామని అన్నారు..లాభాల్లో ఉన్న సింగరేణి ని దెబ్బతీయాలని బిజెపి కుట్ర చేస్తుందని  మండిపడ్డారు .ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం కు సింగరేణి లో 51 శాతం వాటా ఉంది కాబట్టి బిజెపి ప్రైవేటికరణ చేయని పరిస్థితి ఏర్పడిందన్నారు..

 

బీజేపీ కుటిల రాజకీయాలను ఎండగడతామన్నారు. మోది నోటి నుంచి వచ్చే మాట ఒకటి అజెండా మరొకటన్నారు…మీ గుజరాత్ కు ఒక న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నించారు .తెలంగాణ లో ఇక నుంచి మీ పప్పులు ఉడకవన్నారు.కబర్థార్  మీ అంతు చూస్తామని మోడికి హెచ్చరికలు జారీ  చేశారు

Leave A Reply

Your email address will not be published.