శ్రీరాముని పట్టాబిషేకంలో పాల్గోన్నా గవర్నర్ తమిళ సై
ఆనందం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళ సై

భద్రాచలం
శ్రీరాముని పట్టాభిషేకం లో పాల్గొనడంనాకు చాలా సంతోషంగా ఉందన్నారు తమిళ సై గవర్నర్..తెలంగాణ,దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు..భద్రాద్రి రామయ్య సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సై..
సీతారాముల దర్శించుకొని ఇక్కడ భక్తులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.. పట్టు వస్త్రాలను సమర్పించారు.. అంతకుముందు హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు రైలు మార్గాన వచ్చిన గవర్నర్… ఐటీసీ గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడ నుంచి భద్రాచలం రామాలయం కు వచ్చారు.
గవర్నర్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం రామయ్య దర్శనం చేసుకున్నారు గవర్నర్.. అయితే ముందే ఖరారైన పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం పర్ణశాల కు గవర్నర్ వెళ్లాల్సి ఉన్నా వేరే ఇతర కార్యక్రమాల వల్ల ఆ పర్యటన రద్దయింది.. ఇవాళ రాత్రికి కొత్తగూడెం నుంచి రైలు మార్గన హైదరాబాద్ కి బయలుదేరి వెళ్లనున్నారు గవర్నర్..
పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం కు గవర్నర్ తో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ,ఎస్పి వినీత్ పాల్గొన్నారు..