ఆంధ్ర గంజాయి రాజు దందా వరంగల్ లో

నూకరాజును పట్టుకుంటామంటున్నా పోలీసులు

నూక రాజు గంజాయి రాజు…. పేరు మోసిన గంజాయి స్మగ్లర్ .. పోలీసు నిఘా ఉన్నా ..‌చెక్ పోస్టుల తనిఖీలున్నా చిక్కడు దోరకడు.. అనుమా‌నం రాకుండా గంజాయి రవాణ చేయడంలో దిట్ట…. కోబ్బరి బోండాలను తరలించే వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తారు.. నిషా దందాతో ‌కోట్ల రుపాయలు కోల్లగోడుతున్నారు ..ఆ మాపియా రాజు గంజాయి దందాను పోలీసులు బద్దలు చేశారు.. వరంగల్ జిల్లాలో  గంజాయి దందా పై  ప్రత్యేక కథనం

 

పేరుకే కొబ్బరి బొండాలు సప్లై.. లోపల అంత అక్రమ దందా.. అదేంటి అనుకుంటున్నారా… కొబ్బరి బోండాల పేరుతో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న నలుగురిని ఓరుగల్లు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 34 లక్షల రూపాయల విలువచేసే 170 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించే కారు, బోలెరో వాహనాలను, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపించారు.

గంజాయి స్మగ్లర్ల ఆట పట్టించారు ఓరుగల్లు పోలీసులు. ప్రజాప్రతినిధి నేతృత్వంలో ముఠాగా ఏర్పడి కొబ్బరి బోండాల మాటున గంజాయి సప్లై చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి 34 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, కారు, బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యాశకు పోయి అడ్డంగా బుక్కై కటకటాలు లెక్కిస్తున్న గంజాయి స్మగ్లర్ల గురించి తెలిసిన వారు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రలో తక్కువే ధరకు దొరికే గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణలో ఎక్కువ ధర విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. భూపాలపల్లికి చెందిన రాయినేని శంకర్, నీరుకుళ్ళ ఉపసర్పంచ్ ముసిక లక్ష్మణ్, మాట మహేష్, గండికోట సతీష్ నలుగురు ఏపిలోని నర్సీపట్నంలో గల నూకరాజు వద్ద 170కిలోల గంజాయిని కోనుగోలు చేశారు. దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగల్ కు తరలించారు. దాన్ని విక్రయించి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ వద్ద తనిఖీలు చేపట్టగా గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టైంది. నలుగురిని అరెస్టు చేసి అక్రమ దందా గురించి వివరాలు వెల్లడించారు పోలీసులు. ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బోండాల మాటున రహస్యంగా గంజాయి సప్లై చేస్తున్నారని, ఇప్పటికే శంకర్ పై నాలుగు, లక్ష్మణ్ పై రెండు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు

తెలంగాణ వారికి గంజాయి విక్రయించిన ఆంధ్రాకు చెందిన నూకరాజు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను ఉన్నాతాదికారులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.