పోంగులేటి వర్సేస్ బిఅర్ ఎస్ పార్టీల మద్య యుద్దం

పోంగులేటికి చరిష్మా లేదంటున్నా బిఅర్ ఎస్

..ఎత్తుకు  పై ఎత్తులు వేస్తున్నారు… అధికార పార్టీ  ఎత్తుగడలను చిత్తుచేస్తున్నారు.. బిఅర్  ఎస్  తో ‌ యుద్దానికి   సై అంటున్నారు… పార్టీ పత్తా చెప్పడం లేదు.. పది అసెంబ్లీ  సీట్లలో  పోటీ చేస్తామంటుమ్నారు.అనచరులనుసస్పేండ్   చేయడం.  కాదు…దమ్ముంటే  నన్ను సస్పెండ్  చేయాలని   కారు పార్టీకి    సవాలు  విసురుతున్నారు పోంగులేటి.. ఖమ్మంలో    కారు వర్సేస్    పోంగులేటి    పోరు  పై  ప్రత్యేక కథన

 

 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి..పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ గా మారాయి..బీఆర్‌ఎస్ అధిష్టానం టార్గెట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలనే వేదికగా తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు ఉంటే..అటు బీఆర్ఎస్ పార్టీ సైతం పొంగులేటి టార్గెట్ గా ఘాటుగానే కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది..ఏవరి సత్తా ఏంటో ఏవరి బ్రాండ్ ఏందో తెల్చుకుందామని సవాళ్లు విసురుకుంటున్నారు..దీంతో లోకల్ గా పాలిటిక్స్ మరింత హీట్ పెంచాయి..

..ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేశారు..పినపాక,ఇల్లందు,
మధిర,అశ్వారావుపేట నియోజకవర్గాల్లో
ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి..
ఇంకా ఆరు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరగాల్సి ఉంది..
ఇంకా ఏ పార్టీలో చేరుతున్నారన్నది క్లారిటి ఇవ్వకపోయిన..ఆత్మీయ సమ్మేళనాలలో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..ఇది జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రెకెత్తిస్తుంది..

 

.తన వర్గీయులను కాదు దమ్ముంటే తననే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానంకు శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పొంగులేటి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైరా నియోజక వర్గంలో లో తన వర్గీయులను సస్పెండ్ చేశారని.. ఒక వేళ సస్పెండ్ చేయాల్సి వస్తే తననే చేయాలనీ సవాల్ విసిరారు..
కొందరు సీనియర్ నాయకులు శ్రీనన్న ఏ పార్టీ లో వెల్లుతారని అభ్యర్థులను ప్రకటిస్తున్నారని చెప్పుకొస్తున్నారని..నాకు ఆ దమ్ము ఉందని ..నీను ఏ పార్టీలో వెళ్లిన నీను ప్రకటించిన వారే అభ్యర్థులు గా ఉంటారన్నారని చెప్పడం బట్టి చూస్తే పొంగులేటి ఊ్యహం ఏంటన్నదానిపై ఆసక్తిరేపుతుంది…మొన్న బిజెపి లో, నిన్న కాంగ్రెస్ లో, ఇప్పుడు వైఎస్ ఆర్ టిపిలో చేరుతానని ప్రచారం చేస్తున్నారని..ఈ వేదిక నుంచి ఒక్కటే చెబుతున్నా…ప్రజల తీర్పు ప్రకారం పార్టీ మార్పు ఉంటుందన్నారు..ఎవరో తొందర పెడితే నీను నిర్ణయం తీసుకొనని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని

అనడం బట్టి చూస్తే అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యే లోపు క్లారిటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…ఖమ్మం జిల్లా బీఅర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు కు సైతం పొంగులేటి కౌంటర్ ఇచ్చారు ..ఒక ప్రజాప్రతినిధి శ్రీనన్న గురించి కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నారు ..నిజం గా మీరు వెయ్యి కొట్లా, రెండు వేల కొట్లా?? వర్కులు ఇచ్చి ఉంటే చర్చకు నేను సిద్ధమన్నారు..ఎవరికి ఎంత ఇచ్చారో ఎవరికి ఎంత లాభం చేకురిందో లెక్కలేంటో నేను చూపిస్తానని సవాల్ విసరడం బట్టి చూస్తే అన్ని విధాల ఏదుర్కోవడానికి పొంగులేటి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది..

..ఇదిలా ఉంటే మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై దూకుడుగా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ..వైరా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంకు హజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,జిల్లా పార్టీ అధ్యక్షులు ఏమ్మెల్సీ తాత మధు పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు..ఖమ్మం జిల్లా లో రాజకీయాలు, రాజకీయ పరిస్థితులు పార్టీల చుట్టూ ఉంటాయని వ్యక్తుల చుట్టూ ఉండవన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..పార్టీ ని చీల్చే వారు అనేక ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు లేరని కానీ గులాబీ జెండా మాత్రం ఉందన్నారు..కేసీఆర్ ఎవరికి అన్యాయం చేయ లేదన్నారు..ఛాలెంజ్ లు విసరటం కాదని దమ్ము ఉంటే పార్టీ కి రాజీనామా చేయాలని పొంగులేటి కి సవాల్ విసిరారు మంత్రి అజయ్..సింపతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని..చర్యలు తీసుకోవటం ఆజెండా …మా ఏజెండా కాదన్నారు..వైరా నియోజకవర్గంలో పార్టీ పదవులు తీసుకున్నారు కాబట్టి పార్టీ కి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళ ని సస్పెండ్ చేశామన్నారు..కేసీఆర్ పిట్ట ఊపు లకు…పిల్ల ఊపులకు భయపడరన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు..రాజకీయ హాత్యలు ఉండవని ఆత్మహత్య లే ఉంటాయన్నారు..బిఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందన్నారు…

..జిల్లా పార్టీ తరపున పొంగులేటి కి ఒక్కటే హెచ్చరిస్తున్నామని..పొంగులేటి కి బీఆర్ ఎస్ పార్టీ ఏమి అన్యాయం చేసిందో బహిరంగ చర్చ కు రావాలని సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు..
పొంగులేటి రాజకీయాలన్ని వెన్నుపోటు రాజకీయాలే అని ఏద్దేవా చేశారు..
కేసీఅర్ కు జిల్లా పార్టీకి సవాల్ విసిరారు..
దమ్ముంటే నన్ను బహిష్కరించాలని అంటున్నాడు…పొంగులేటి కేసీఅర్ ను విమర్శించేంత పోటు మొనగడా అని పైర్ అయ్యారు తాత మధు..గత ఎన్నికల్లో పొంగులేటి అనుచరులకే సగం సీట్లు పార్టీ ఇచ్చిందని..నీకు నిజంగా ప్రజాదరణ ఉంటే వారిని ఎందుకు గెలిపించుకొలేదన్నారు.   ..బీఆర్ ఎస్ పార్టీలో ఏవరి బ్రాండ్ నడవదని.. ఒక్క కేసీఆర్ బ్రాండ్ మాత్రమే నడుస్తుందన్నారు…

మొత్తానికి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ గా మారయనే చెప్పాలి..పొంగులేటి పార్టీ విడేంత వరకు రెండు వైపుల ఎదురుదాడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

 

Leave A Reply

Your email address will not be published.