రైతుల వడగండ్ల వాన నష్టాన్ని చూసి చలించిన సీఎంకేసీఅర్

ఏకరాకు పదివేల పరిహరం ఇస్తామని ప్రకటించిన సీఎం

ఖమ్మం

కర్షకుల కడగండ్లను‌ కళ్లరా చూశారు.. నష్టపోయిన   పంటలను పరిశీలించారు…నష్టపోయిన. రైతులకు  బాసటగా నిలిచారు..   ఎకరాకు పదివేల. పరిహరం  ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారు.. ఖమ్మం   జిల్లాలో  సీఎం‌కేసీఅర్  పర్యటన పై ప్రత్యేక కథనం

 

ఖమ్మం జిల్లా  రైతులకు  అకాల. వర్షాలు కన్నీళ్లను మిగిల్చాయి.. ఈదురుగాలులతో  వడగండ్ల   వాన.  బీభత్సం స్రుష్టించింది…  ఈ వర్షాలతో  రైతులు  తీవ్రంగా నష్టం పోయారు…   అయితే  నష్టపోయిన. రైతులకు భరోసా ఇవ్వడానికి   సీఎం కేసీఆర్ జిల్లాలో ‌పర్యటించారు.

 

ఈ సందర్భంగా కేంద్రంపైమరోసారి తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు సీఏం కేసీఆర్..కేంద్ర ప్రభుత్వంకు రాజకీయాలు తప్పితే రైతుల మీద ఏమాత్రం ప్రేమలేదన్నారు..కేంద్రం కు ఏం చెప్పిన దున్నపోతు మీద వర్షం పడినట్లుగా మారిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందన్నారు..పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదని..గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదన్నారు
సీఏం కేసీఆర్..రైతులకు తామే పూర్తిగా అండగా ఉంటామన్నారు..అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఏం కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా ఎకరానికి 10వేల చోప్పున నష్ట పరిహరం ప్రకటించారు..

..అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు..ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు.దానికి సంబంధించిన జీవో కూడ విడుదలైంది..ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సీఏం కేసీఆర్…నష్ట తీవ్రతకు సంబందించి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు..ఏటువంటి అధ్యైర్యపడవద్దని ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు..ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు సీఏం..

..కేంద్ర ప్రభుత్వం టార్గెట్ నే విమర్శలు గుప్పించారు కేసీఆర్..కేంద్రానికి నివేదిక పంపమని..వందశాతం మేమే ఆదుకుంటామని స్పష్టం చేశారు..ఈ దేశంలో ఓ పద్ధతి, పాడు లేదని..ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవన్నారు..పాత ప్రభుత్వాలు అంతే..ఇప్పుడు
కూడా అంతే..కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తే చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందన్నారు..వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉందన్నారు.భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలన్నారు..ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోందని.మేం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కమిటీ ఎప్పుడొస్తుందో.. రిపోర్టు ఎప్పుడిస్తుందో ఆ దేవుడికే ఎరుక. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఆర్నెల్ల దాకా రూపాయి రాదన్నారు..

అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా
2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది..
మొక్కజొన్న 1,29,446 ఎకరాలు,వరి 72,709 ఎకరాలు,
మామిడి 8,865 ఎకరాలు వీటితో పాటు ఇతర
పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది..నష్ట పోయిన రైతులకు ఎకరానికి 10వేల చోప్పున
మొత్తం 222కోట్లు కేటాయించారు సీఏం కేసీఆర్…

..వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారన్నారు సీఏం కేసీఆర్..ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని కానీ మేం గర్వంగా చెబుతున్నాం..ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు..మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉందన్నారు చెప్పారు..జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని..
జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందన్నారు..కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉందని..యావరేజ్‌గా 16 శాతం వరకు ఉందన్నారు సీఎం కేసీఆర్‌..అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు..రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు..ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుందన్నారు..

..అకాల వర్షాలతో నష్టపోయిన రైతులలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు..దీంతో పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా..రబ్బర్‌ బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలన్నారు సీఏం కేసీఆర్..ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు. అని రైతుల్లో భరోసా నింపారు…సీఏం కేసీఆర్ పర్యటనతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…

 

Leave A Reply

Your email address will not be published.