భట్టి విక్రమార్క వర్సేస్ రేణుకాచౌదరిమద్య యుద్దం
వైరాలో రెండు వర్గాలుగా విడిపోయినకార్యకర్తలు

ఖమ్మం
.. ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి…భట్టి వర్సెస్ రేణుక చౌదరి గా మారింది..వైరా లో జరగనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర కుసంబంధించి రేణుక వర్గం ప్రెస్‌మీట్ పెట్టింది… అయితే దీనికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదంటుంది భట్టి వర్గం…డీసీసీకి తెలియకుండానే కార్యక్రమం నడుస్తుందా అన్న అయోమయం పార్టీ కార్యకర్తల్లో నెలకొంది…ఖమ్మం కాంగ్రెస్‌లో వీడని వర్గ రాజకీయాలపై పై ప్రత్యేక కథనం
..ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ విబేధాలు మరోసారి బయటపడ్డాయి..ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అధిస్టానం సూచించినా జిల్లా పార్టీలో ఆ దిశగా అడుగులు పడటం లేదన్నది తెలుస్తుంది…నేతలు వర్గాలుగా విడిపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేస్తున్నారు..వెన్నుదన్నుగా నిలవాల్సిన నాయకులే పార్టీని బలహీన పరుస్తున్నారనేలా
ఆ పార్టీ కేడర్‌లో ప్రచారం జరుగుతోంది…వైరా నియోజకవర్గంలో ఈ విభేదాలు మరింత ముదిరయనే చెప్పాలి..
..ఈనెల 26న వైరాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రేణుక వర్గీయులు ప్రెస్‌మీట్ నిర్వహించారు…అయితే దీనిపై ఇటు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడుకి గానీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కనీస సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఈ పరిణామాలతో జిల్లాలో మరోసారి రేణుకా వర్సెస్ భట్టీ వర్గీయుల మధ్య విభేదాలుబహిర్గతమయ్యాయి…ఓ వైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ‘హాత్ సే హాథ్ జోడో అంటూ ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది…అయితే జిల్లాలో మాత్రం నేతల తీరుతో ‘చేయి.. చేయి కలిసేదెలా..?’ అంటూ ఆపార్టీ కేడర్‌లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి….
జిల్లా కాంగ్రెస్‌ను దశాబ్దాలుగా వర్గ పోరు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది..అధికారంలో ఉన్నా.. లేకున్నా నేతల మధ్య ఐక్యత, సఖ్యత ఏమాత్రం కనపడటం లేదు..జల్లాస్థాయిలోనే కాకుండా.. నియోజకవర్గాల స్థాయిలో కూడా రెండు గ్రూపులు ఉండటం కాంగ్రెస్‌లో ఆనవాయితీగా వస్తోంది. టికెట్లు అశిస్తున్న నియోజకవర్గ స్థాయి నేతలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి జిల్లాలోని రాష్ట్రస్థాయి నేతలు అభయం ఇస్తుండటంతో ఈ వైరం మరింతగా పెరుగుతోంది…ఖమ్మం, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య పొసగడం లేదు..అధిష్టానం ఆందోళనలకు పిలుపునిచ్చిన సమయంలో కూడా గ్రూపుల వారీగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..ఇలా ఎవరికి వారే యమునా తీరు చందంగా వ్యవహరిస్తున్నారు.
.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల సమయంలో విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేయాలని నేతలకు సూచిస్తూ వస్తోంది. అయితే ఇవేమీ నేతలు పట్టించుకోవడం లేదు. గతంలోనూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ఏకాభిప్రాయం సాధించే అవకాశం లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడి నియామకం చాలా రోజుల వరకు ఆపింది..జిల్లా రాజకీయాల్లో అనేక గ్రూపులు ఉండటం పీసీసీకి కూడా తలనొప్పిగా మారింది..దీనికి తోడు జిల్లాలో గ్రూపులకు ముఖ్య నేతలు కూడా ఆజ్యం పోస్తుండడంపై కింది స్థాయి కేడర్‌లో అసంతృప్తి నెలకొంది.
..వైరాలో మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గం నుంచి ధరావత్ రామ్మూర్తినాయక్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నుంచి మాలోతు రాందాస్ నాయక్, బానోత్ బాలాజీ నాయక్ టికెట్లను ఆశిస్తున్నారు..వీరిలో రాందాస్ నాయక్, ధరావత్ రామ్మూర్తి నాయక్‌లు వైరాలో క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు…బానోత్ బాలాజీనాయక్ మాత్రం కొంత స్తబ్దుగా ఉన్నారు..ప్రస్తుతం నియోజకవర్గంలో రాందాస్ నాయక్, రామ్మూర్తి నాయక్‌లు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..ఇక్కడ సీఎల్పీ నేత భట్టి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది…మరోవైపు టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..
..డీసీసీకి,సీఎల్పీ నేతకు తెలియకుండనే
రేణుకాచౌదరి వర్గీయులు వైరాలో విలేకరుల సమావేశం నిర్వహించి…ఈనెల 26న వైరాలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర, బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రె హాజరవుతారని తెలిపారు. అయితే దీనిపై తమకు ఎటువంటి సమాచారం తెలియదని భట్టి వర్గీయులు చెబుతున్నారు..డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కూడా సమాచారం లేదని తెలుస్తోంది.. దీంతో అసలు ఖమ్మం కాంగ్రెస్ లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్తితి ఏర్పడింది…
..జిల్లా కాంగ్రెస్‌లో ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ మీద అభిమానంతో పనిచేస్తుంటే నాయకులు మాత్రం వర్గాలుగా విడిపోయి పార్టీకి చేటు చేస్తున్నారనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో గ్రామ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన నేతలు ఇలా గ్రూపు రాజకీయాలకు పాల్పడటం ఏమిటంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల పర్యటన ఉన్నప్పుడు గ్రూపులకు అతీతంగా విజయవంతానికి కృషి చేయాల్సిన నేతలు.. ఇలా గ్రూపుల వారీగా విడిపోవడం కార్యకర్తలను నిరాశకు గురి చేస్తోంది. వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి సారిస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. మరి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి