11న పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు

మందమర్రి: మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ నెల 11న పోలేరమ్మ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతరకు హాజరు కావాలని కోరుతూ సోమవారం చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ ను వారు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు హాజరై తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల సంఘం సభ్యులు బంగారు ప్రసాద్, బంగారు లక్ష్మణ్, ముత్యాల రమేష్ బాబు, నీలపు వెంకటాద్రి, వడ్డాది ప్రసాద్, పొట్నూరి దుర్గేంద్ర పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.