హోంగార్డులు పెన్షన్ ఆధారిత పథకాలలో చేరాలి

జిల్లా ఎస్పీ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్: శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరం నందు 38 సంవత్సరముల పాటు హోంగార్డుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన కే విట్టల్ పదవి విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుకు సిబ్బంది సమక్షంలో శాలువా, పూలమాల, బహుమతిని అందజేసి సత్కరించారు. హోంగార్డు కే విట్టల్ 1985 వ సంవత్సరంలో పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. తదనంతరం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా, నిమ్మకంగా ఉంటూ విధులను నిర్వర్తించే వారిని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి పెన్షన్ లభించదు కావున ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రైవేటు రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ పెన్షన్ లభించే పథకాలలో చేరి పదవీ విరమణ అనంతరం నిశ్చింతగా ఉండే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సమయ్ జాన్ రావు, డీఎస్పీలు వి ఉమేందర్, పోతారం శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, హోంగార్డ్ అర్ఐ బి శ్రీపాల్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, హోంగార్డ్ ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.