హామీలు మరచిన జోగురామన్నకు ఓటెయ్యవద్దు
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్ : గత 15 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్నకు వచ్చే ఎన్నికలలో ఒక్క ఓటు కూడా పడకూడదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.గడపగడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్ననినాదంతో కంది శ్రీనివాసరెడ్డి జైనథ్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని సిర్సన్న,గూడ ,లేఖర్ వాడ, నిరాలలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు. లేఖర్ వాడలో భారీ సంఖ్యలో గ్రామస్తులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కంది శ్రీనివాస రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అవగాహన కల్పించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. జోగు రామన్నను ఓడించాలనుకునేవారు కాంగ్రెస్ తో చేయి కలపాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే 15ఏళ్లుగా లేని అభివృద్ధి తాను చేసి చూపిస్తానన్నారు. ఒక్కవకాశం ఇవ్వమని ప్రజలను కోరారు. జోగురామన్న, పాయల్ శంకర్ లు ఒకటేనని వారికి ఓటేస్తే ఆ ఓటు మోరిలో పడ్డట్టే అని అన్నారు. జోగురామన్నచిన్న కొడుకు రిమ్స్ లో ఉద్యోగాలు అమ్ముకున్నాడని ఆరోపించారు. తాను చెప్పింది నిజమని తన భార్యాబిడ్డలతో జైనథ్ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయటానికి సిద్దమని అన్నారు. అబద్ధమని జోగురామన్నఆయన కుటుంబం ప్రమాణం చేస్తుందా అని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం వస్తే ఇచ్చే గ్యారంటీ హామీలను ప్రజలకు విరించారు. రెండు లక్షల రుణమాఫీ,అవ్వతాతకు ఫించన్ ,భూమి లేనోళ్లకు బీమా,భూయజమానికి కౌలుదారునికి ఇద్దరికీ రైతుబంధు , ఇల్లు కట్టుకోవడానికి 5లక్షలసాయం, నిరుద్యోగులకు 4వేల భృతి,2లక్షలప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 18ఏళ్లు నిండిన చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీ,ఉపాధి కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ,విద్యార్దుకు పూర్తి ఫీ రియంబర్స్ మెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని తెలిపారు.కాంగ్రెస్ చెప్పింది చేస్తుందని అందుకే అభివృద్ధి జరగాలంటే ఒక్కసారి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ఎం.ఏ షకీల్ ,గీమ్మ సంతోష్, నాగర్కర్ శంకర్, సంతోష్ రెడ్డి, ముఖిమ్, ప్రభాకర్ రావు, దీపక్ రావు, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి,కిష్టా రెడ్డి, తోట పోచ్చన్న, అశోక్, అసిఫ్, దయానంద్, కపిల్, తోట సంతోష్, ప్రకాష్, రాంచందర్, శివయ్య, రాజేందర్ ,నరసింహులు, రమేష్, దేవన్న, స్వామి, నర్సింగ్, ఆశన్న,బండి కిష్టన్న, సంజీవ్, రామ్ రెడ్డి, పోతారాజు సంతోష్,ఎల్మా రామ్ రెడ్డి,కొండూరి రవి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, షాహిద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.