హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనానికి మున్సిపాలిటీ ద్వార అయిదు లక్షల నిధులను కేటాయించడం పట్ల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ను సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నిధుల కేటాయింపుకు సంబంధించిన పత్రాలను చైర్మన్ అందించారు. భవన నిర్మాణానికి మున్సిపల్ ద్వార సహకారం అందించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జోగురామన్న తో పాటు మున్సిపల్ చైర్మన్ కు ధన్యవాదాలు తెలియచేశారు.

Leave A Reply

Your email address will not be published.