హత్యాచార నిందితులను ఉరితీయాలి…

బహుజన సంఘాలు...

ఇంద్రవెల్లి : మండలంలోని దన్నోర(బి) గ్రామంలో ఇటీవల జరిగిన హత్యాచార ఘటనకు కారకులైన నిందితులను ఉరితీయాలని బహుజన సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత,ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అత్యంత పాశవికంగా కుడ్మేత జంగుబాయిని హత్యాచారం చేసి హత్య చేసి ఎవరు గుర్తు పట్టకుండా బావిలో పడేశారని, ఈ ఘటనకు కారకులైన 3నిందితులను ఉరితీయాలన్నారు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి,వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల వారికి ఓ న్యాయం ?దళిత ఆదివాసీ బిడ్డలకు ఓ న్యాయమా ? అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జంగుబాయి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని,లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే మనోహర్,ప్రధాన కార్యదర్శి కాంరాజ్,ఖానాపూర్ నియోజకవర్గ భీం ఆర్మీ అధ్యక్షుడు దత్త,బీఎస్పీ మండల అధ్యక్షులు పేందుర్ అంకుశ్, ఖానాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శివాజీ,నాయకులు సోయం రాందాస్,సునీల్, అర్పీఐ మండల అధ్యక్షుడు బాబాసాహెబ్, భీం ఆర్మీ మండల అధ్యక్షుడు ఉత్తం, తుడుం దెబ్బ మండల ఉపాధ్యక్షుడు గెడం భారత్,మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు అతిష్, బీఎస్పీ నాయకులు సుద్దోధన్,సాయి, దళిత సంఘం నాయకులు ప్రశాంత్ బాబా,సునీల్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.