స్వరాష్ర్టంలో నీటి కష్టాలు తొలిగిపోయాయి..
శాసన సభ్యులు రాథోడ్ బాపురావు

బోథ్: తెలంగాణ రాష్ట్రం సాధించి 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు రాథోడ్ బాపురావు హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లికి నివాళులు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరయిన శాసన సభ్యులు రాథోడ్ బాపురావుకి SE స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్ర నీటి ప్రగతి యొక్క డాకుమెంటరీని వీక్షించారు. అనంతరం సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాసన సభ్యులు రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తాగు నీరు సాగు నీరు లేక అనేకమంది ఆత్మహత్యలు ఉండేవని నేడు సాధించి తెచ్చిన స్వరాష్ట్రంలో నీరు కష్టాలు పూర్తిగా తొలిగిపోయి ప్రజలు ఆనందంగా ఉందన్నారు. తాగు నీరు పట్ల నాడు అనేకమంది ప్రజలు వైరస్ కి గురయ్యారని నేడు మిషన్ భగీరథ ద్వారా స్వచ్చమైన తాగునీరు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , అధికారులు బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, జడ్పీటీసీ సంధ్యారాణి, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపిపి లింబాజి, సర్పంచ్ సురేందర్, ఆర్బిఎస్ జగన్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు తాహెర్, మండల నాయకులు పాల్గొన్నారు.