స్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

అదిలాబాద్: పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మున్సిపల్ అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. స్మశాన వాటికలోని వెల్కమ్ ఆర్చ్ పనులకు పరిశీలించారు. అలాగే పూర్తయినటువంటి వాటర్ ట్యాంక్ తో పాటు ప్రహరీ గోడలు ఇతర పనులను పర్యవేక్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనులను త్వరగా పూర్తిచేసి అందుకు తగ్గ సూచనలు తెలియజేశారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సుందరి కారణంగా తీర్చిదిద్దడమే కాకుండా హరిత ఆహారాన్ని పెంపొందిస్తూ స్మశాన వాటిక లను సుందరీకారంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు అరుణ్, తిరుపతి, కది ల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.